Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tomato: టమాటాలతో తులాభారం.. ఆసక్తిగా తిలకించిన భక్తులు!

టమాటా ధరలు నానాటికీ ఆకాశానికి ఏగబాకుతున్నాయి. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో రూ.300 మార్కు దాటేసింది. దీంతో సామాన్యుడు టమాటాలను కొనలేక తినలేక నానాఅగచాట్లు పడుతున్నాడు. ఇదిలా ఉంటే ఆదివారం ఓ వ్యక్తి ఏకంగా..

Tomato: టమాటాలతో తులాభారం.. ఆసక్తిగా తిలకించిన భక్తులు!
Tomato Tulabaram
Follow us
Srilakshmi C

|

Updated on: Jul 17, 2023 | 8:00 AM

అనకాపల్లి, జులై 17: టమాటా ధరలు నానాటికీ ఆకాశానికి ఏగబాకుతున్నాయి. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో రూ.300 మార్కు దాటేసింది. దీంతో సామాన్యుడు టమాటాలను కొనలేక తినలేక నానాఅగచాట్లు పడుతున్నాడు. ఇదిలా ఉంటే ఆదివారం ఓ వ్యక్తి ఏకంగా టమాటా తులాభారం ఇచ్చాడు. ధరలు పెరిగిన నేపథ్యంలో ఈ టమాటా తులాభారం వ్యవహారం స్థానికంగా చర్చణీయాంశంగా మారింది.

ఆంధ్రప్రదేశ్‌ అనకాపల్లి జిల్లాకు చెందిన మళ్ల జగ్గ అప్పారావు, మోహిని దంపతుల కుమార్తె భవిష్యకు టమాటా తులాభారం నిర్వహించారు. నూకాలమ్మ ఆలయంలో ఈ మొక్కుబడి కార్యక్రమం నిర్వహించారు. తొలుత 51 కేజీల టమాటాలతో తులాభారం ఇచ్చారు. తర్వాత బెల్లం, పంచదారతో నిర్వహించారు. తులాభారం కింద వచ్చిన టమాట, బెల్లం, పంచదారలను అమ్మవారి నిత్యాన్నదానంలో ఉపయోగిస్తామని దేవస్థానం అధికారులు తెలిపారు. కాగా ప్రస్తుతం మార్కెట్‌లో టమాటాల ధర కేజీ రూ.120పైనే ఉంది. దీంతో తులాభారం నిర్వహించే సమయంలో దర్శనానికి వచ్చిన భక్తులు ఆస్తక్తిగా తిలకించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.