AP High Court: రాయలసీమ వర్సిటీ ప్రొఫెసర్లపై వేటు.. ఆ ముగ్గురిని తొలగించాలంటూ హైకోర్టు సంచలన తీర్పు..

Andhra Pradesh: రాయలసీమ యూనివర్సిటీలో ముగ్గురు ప్రొఫెసర్లను డిస్మస్ చేయడం సంచలనంగా మారింది. ఈ నెల 11న ఏపీ హైకోర్టు 31, 32, 33తో పాటు కొన్ని జీవోలు, నోటిఫికేషన్లను కొట్టి వేస్తూ తీర్పు ఇచ్చింది. యూజీసీ నిబంధనలకు విరుద్ధంగా నియమితులైన ముగ్గురిపై తక్షణమే..

AP High Court: రాయలసీమ వర్సిటీ ప్రొఫెసర్లపై వేటు.. ఆ ముగ్గురిని తొలగించాలంటూ హైకోర్టు సంచలన తీర్పు..
Rayalaseema University Kurnool
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Jul 17, 2023 | 8:35 AM

Andhra Pradesh: రాయలసీమ యూనివర్సిటీలో ముగ్గురు ప్రొఫెసర్లను డిస్మస్ చేయడం సంచలనంగా మారింది. ఈ నెల 11న ఏపీ హైకోర్టు 31, 32, 33తో పాటు కొన్ని జీవోలు, నోటిఫికేషన్లను కొట్టి వేస్తూ తీర్పు ఇచ్చింది. యూజీసీ నిబంధనలకు విరుద్ధంగా నియమితులైన ముగ్గురిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని తాజాగా హైకోర్టు తీర్పు వెలువరించింది. దీంతో యూనివర్సిటీలో ముగ్గురు ప్రొఫెసర్లపై వేటు పడింది. రిజిస్ట్రార్‌గా కొనసాగుతున్న పి.వెంకట సుందరానంద్, పరీక్షల విభాగం డీన్‌గా పనిచేసిన సి. విశ్వనాథరెడ్డి, రీసెర్చ్ విభాగం డీన్ భరత్ కుమార్లను విధుల నుంచి తొలగిస్తూ పాలకమండలి నిర్ణయం తీసుకుంది. రాయలసీమ యూనివర్సిటీలో 19 కోర్సులకుగాను ఐదు రెగ్యులర్, 14 సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు, ఒక ఇంజనీరింగ్ విభాగం ఉన్నాయి.

అయినా యూనివర్సిటీలో నలుగురు రెగ్యులర్ ప్రొఫెసర్లు మాత్రమే ఉన్నారు. దీంతో 2017లో ఏడుగురిని రెగ్యులర్ ప్రాతిపదికన ప్రొఫెసర్ పోస్టులకు నియమించారు. అయితే ఆ పోస్టులు యూజీసీ నిబంధనలకు విరుద్ధమని ఆరోపణలు వెల్లువెత్తాయి. విద్యార్థి సంఘాల నాయకులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో అప్పట్లో నలుగురు ప్రొఫెసర్లు వివిధ కారణాలతో రాజీనామా చేశారు. అయితే కోర్టులో సుదీర్ఘ విచారణ అనంతరం జూలై 11వ తేదీన కోర్టు తుదితీర్పును వెలువరించింది. యూనివర్సిటీలో ప్రొఫెసర్లుగా కొనసాగుతున్న వెంకట సుందరానంద్, సి.విశ్వనాథ రెడ్డి, భరత్ కుమార్లను తొలగించాలంటూ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. హైకోర్టు నిర్ణయం యూనివర్సిటీలో సంచలనం రేపుతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..