Kurnool: అబ్బ.. పొలంలో మరో వజ్రం దొరికింది.. అక్షరాలా రూ.25 లక్షలకు విక్రయం
వర్షాకాలంలో కర్నూలు జిల్లాలో రైతులు పొలాల్లో వజ్రాల వేట కొత్తేం కాదు. తమ అదృష్టం పండి పొలంలో వజ్రాలు దొరుకుతాయేమోనని ఆశగా వెతుకుతుంటారు. ఏదైనా రంగురాయి దొరికితే వజ్రమేమోనని పరీక్షించుకోవడానికి బంగారం..
కర్నూలు, జులై 17: వర్షాకాలంలో కర్నూలు జిల్లాలో రైతులు పొలాల్లో వజ్రాల వేట కొత్తేం కాదు. తమ అదృష్టం పండి పొలంలో వజ్రాలు దొరుకుతాయేమోనని ఆశగా వెతుకుతుంటారు. ఏదైనా రంగురాయి దొరికితే వజ్రమేమోనని పరీక్షించుకోవడానికి బంగారం షాపులకు పరుగులు తీస్తుంటారు. ఒక్క వజ్రం దొరికినా తరాల నాటి తమ దరిద్రం అంతా ఒక్కథాటితో కొట్టుకుపోతుందని వజ్రాల కోసం ఆశగా వెదుకులాట సాగిస్తారు. ఐతే తాజాగా కర్నూలు జిల్లాలో కొందరికి వజ్రాలు దొరికినట్లు సామాజిక మాధ్యమాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది.
తుగ్గలి మండలం జొన్నగిరి పొలాల్లో ఒంగోలుకు చెందిన ఓ వ్యక్తికి ఇటీవల తేనె రంగులో ఉన్న ఓ వజ్రం లభించినట్లు సమాచారం. దాన్ని ఓ స్థానిక వ్యాపారి వద్ద అమ్మకానికి పెట్టగా ఏకంగా రూ.25 లక్షలకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అదేరోజు మరో ఇద్దరికి రెండు వజ్రాలు లభ్యమైనట్లు తెలుస్తోంది. మద్దికెర మండలం మదనంతపురం వాసి పొలంలో శనివారం కలుపు తీస్తుండగా వజ్రం దొరికినట్లు సమాచారం. ఈ సీజన్ ముగిసేలోపు ఇంకెంతమందిని అదృష్టం వరిస్తుందో వేచి చూడాల్సిందే.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.