Andhra Pradesh: అక్రమంగా ఎర్రచందనం స్మగ్లింగ్.. 20 మంది అరెస్టు

తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లోని మూడు ప్రాంతాల్లో ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధక టాస్క్ ఫోర్స్ నిర్వహించిన దాడుల్లో 20మంది స్మగ్లర్లను అరెస్ట్ చేసి 19 ఎర్రచందనం దుంగలను టాస్క్ ఫోర్సు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు .

Andhra Pradesh: అక్రమంగా ఎర్రచందనం స్మగ్లింగ్.. 20 మంది అరెస్టు
Red Sandalwood
Follow us

| Edited By: Aravind B

Updated on: Jul 17, 2023 | 9:49 AM

తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లోని మూడు ప్రాంతాల్లో ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధక టాస్క్ ఫోర్స్ నిర్వహించిన దాడుల్లో 20మంది స్మగ్లర్లను అరెస్ట్ చేసి 19 ఎర్రచందనం దుంగలను టాస్క్ ఫోర్సు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు . అన్నమయ్య జిల్లా తుమ్మలబైలు సెక్షన్ చాకిరేవు సమీపంలోని అటవీ ప్రాంతంలో ఒక టీమ్, అన్నమయ్య జిల్లా సానిపాయ రేంజి ఫింఛా సెక్షన్ దిన్నెల ఫారెస్టు బీటు, చిట్టికురవ రాస్తా కోన సమీపంలోని నిషేధిత అటవీ ప్రాంతానికి రెండో టీమ్, మూడో టీమ్ తిరుపతి జిల్లా నాగపట్ల సెక్షన్లోని తిరుపతి పీలేరు రోడ్డులోని ఓ కళాశాల ఎదరుగా ఉన్న అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఆయా ప్రాంతాల్లో కొందరు వ్యక్తులు ఎర్రచందనం దుంగలు మోసుకెళ్తూ పట్టుబడ్డారని, వారిని టాస్క్ ఫోర్స్ చుట్టిముట్టి అరెస్ట్ చేశారని వివరించారు.

పట్టుబడిన స్మగ్లర్లు 20 మంది తమిళనాడుకు చెందినవారుగా గుర్తించామని పేర్కొన్నారు. మరోవైపు కడప సబ్ కంట్రోల్ పరిధిలో నిర్వహించిన కూంబింగ్ ఆపరేషన్ లో ఏడుగురు స్మగ్లర్లను అరెస్ట్ చేసి 32 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఆర్ఐ చిరంజీవులుకు చెందిన రెండు టీమ్ లు ఆర్ఎస్ఐ నరేష్ కు చెందిన టీమ్ గోపవరం పిపికుంట రిజర్వు ఫారెస్టులో కూంబింగ్ నిర్వహిస్తుండగా.. బ్రాహ్మణపల్లి వద్ద ఎర్రచందనం దుంగలు తీసుకెళ్తున్న వ్యక్తులను గుర్తించారు. చివరికి ముగ్గురు స్మగ్లర్లను అరెస్ట్ చేసి, 19 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన స్మగ్లర్లు కడప జిల్లా గోవపరం మండలం పీపీకుంటకు చెందిన వారిగా గుర్తించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Latest Articles
కోల్‌కతా విజయంతో ఉత్కంఠగా ప్లేఆఫ్ రేసు.. సేమ్ పాయింట్లతో 3 జట్లు
కోల్‌కతా విజయంతో ఉత్కంఠగా ప్లేఆఫ్ రేసు.. సేమ్ పాయింట్లతో 3 జట్లు
నేడు పులివెందులకు సీఎం జగన్ దంపతులు.. ఓటు వేసేందుకు సిద్దం..
నేడు పులివెందులకు సీఎం జగన్ దంపతులు.. ఓటు వేసేందుకు సిద్దం..
రాత్రి 9 గంటల తర్వాత భోజనం చేసేవారికి హెచ్చరిక..! ఈ ముప్పు తప్పదు
రాత్రి 9 గంటల తర్వాత భోజనం చేసేవారికి హెచ్చరిక..! ఈ ముప్పు తప్పదు
హోటల్లో రూమ్ బుక్ చేసుకున్న నటి..
హోటల్లో రూమ్ బుక్ చేసుకున్న నటి..
అందం ఈ ముద్దుగుమ్మను చేరి సోయగాన్ని అప్పు అడుగుతుందేమో..
అందం ఈ ముద్దుగుమ్మను చేరి సోయగాన్ని అప్పు అడుగుతుందేమో..
ఈ స్టార్ కిడ్స్ అందరికీ ఇదే ఫస్ట్ మదర్స్ డే..
ఈ స్టార్ కిడ్స్ అందరికీ ఇదే ఫస్ట్ మదర్స్ డే..
నిలవాలంటే గెలవాల్సిందే.. రాజస్థాన్‌తో పోరుకు సిద్ధమైన చెన్నై
నిలవాలంటే గెలవాల్సిందే.. రాజస్థాన్‌తో పోరుకు సిద్ధమైన చెన్నై
హైదరాబాద్ నుంచి ఏపీకి ప్రత్యేక బస్సులు.. ఛార్జీల వివరాలు ఇవే..
హైదరాబాద్ నుంచి ఏపీకి ప్రత్యేక బస్సులు.. ఛార్జీల వివరాలు ఇవే..
ఈ ప‌ప్పును వారంలో రెండు సార్లు తింటే మీ ఆరోగ్యానికి తిరుగుండ‌దు.!
ఈ ప‌ప్పును వారంలో రెండు సార్లు తింటే మీ ఆరోగ్యానికి తిరుగుండ‌దు.!
యువ ఓటర్లు ఎవరి వైపు..? పోలింగ్‌కు సిద్ధమైన తెలుగు రాష్ట్రాలు..
యువ ఓటర్లు ఎవరి వైపు..? పోలింగ్‌కు సిద్ధమైన తెలుగు రాష్ట్రాలు..