Pawan Kalyan: ఏపీలో కాకరేపుతున్న సీఐ అంజుయాదవ్ ఇష్యూ.. తిరుపతికి పవన్‌ కల్యాణ్‌..

Pawan Kalyan Tirupati Visit: తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో జనసేన నేత సాయిపై చేయి చేసుకున్న సీఐ అంజు యాదవ్‌కి అధికారులు చార్జ్ మెమో జారీ చేశారు. ఈ ఘటనతోపాటు ఆమె పాత వీడియోలు కొన్ని బయటికి రావడం కలకలం రేపింది.

Pawan Kalyan: ఏపీలో కాకరేపుతున్న సీఐ అంజుయాదవ్ ఇష్యూ.. తిరుపతికి పవన్‌ కల్యాణ్‌..
Pawan Kalyan
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jul 17, 2023 | 7:57 AM

Pawan Kalyan Tirupati Visit: తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో జనసేన నేత సాయిపై చేయి చేసుకున్న సీఐ అంజు యాదవ్‌కి అధికారులు చార్జ్ మెమో జారీ చేశారు. ఈ ఘటనతోపాటు ఆమె పాత వీడియోలు కొన్ని బయటికి రావడం కలకలం రేపింది. అంతకుముందు అమాయకులను ఇబ్బంది పెట్టడం, తొడకొట్టి సవాళ్లు విసిరడం.. పలు ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడం ఏపీ పోలీసు శాఖలో సంచలనంగా మారింది. దీంతో ఆమెకు చార్జ్ మెమో జారీచేశారు. జనసేన నేతపై సీఐ చేయిచేసుకున్న ఘటనపై ఇప్పటికే జిల్లా ఎస్పీ విచారణ నిర్వహించారు. అనంతరం డీజీపీకి నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది.

కాగా.. నిరసన తెలియజేస్తున్న జనసేన నాయకులపై శ్రీకాళహస్తి సీఐ అంజు యాదవ్ దురుసు ప్రవర్తన.. కొడుతున్న సందర్భంగా, సహనంగా ఉన్న సాయిని పవన్ కల్యాణ్ తన మీటింగ్‌లో అభినందించారు. సాయిలాంటి దృఢ సంకల్పం ఉన్నవారు జనసేనకు కావాలంటూ పేర్కొన్నారు. దీనిపై మాట్లాడిన పవన్ తిరుపతికి వచ్చి సీఐ సంగతి తేలుస్తానంటూ ప్రకటించారు.

దీనిలో భాగంగా పవన్‌కల్యాణ్‌ తిరుపతికి వస్తున్నారు. ఐదుగురు జనసేన కార్యకర్తలతో కలిసి ఎస్పీ కార్యాలయానికి వెళ్లి సీఐపై ఫిర్యాదు చేయనున్నారు. అయితే, ఇటు పవన్‌ రాక, మరోవైపు పవన్ కు వ్యతిరేకంగా వాలంటీర్ల ఆందోళనలు జరుగుతాయన్న అనుమానంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఇవి కూడా చదవండి

సీఐ అంజుయాదవ్‌ విధి నిర్వహణలో ఎన్నో వివాదాలు, పలు కేసుల్లో చార్జ్‌ మెమోలు, ఎంక్వైరీలు ఎదుర్కొన్నారు. తాజా ఘటనతో ఆమె లీవ్‌లో ఉన్నారు. పవన్‌ కల్యాణ్‌ వచ్చేలోపే సీఐ అంజుయాదవ్‌పై చర్యలు తీసుకోవాలా? లేదంటే పవన్‌ తిరుపతి ఎస్పీని కలిసి ఏం డిమాండ్‌ చేస్తారో వేచి చూసి నిర్ణయం తీసుకోవాలా? అన్న దానిపై క్లారిటీ రావాల్సి ఉంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..