Andhra Pradesh: కోడిపై దాడి చేసిన కుక్క.. టీడీపీ వైసీపీ నేతల మధ్య చెలరేగిన ఘర్షణ
వైఎస్సార్ జిల్లా సిద్ధవటం మండలంలో విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది. మాధవరం-1 గ్రామంలో ఓ కుక్క కోడిపై దాడి చేయడం వల్ల వైసీపీ, టీడీపీ వర్గాలపై కేసు నమోదం కావడం చర్చనీయాంశమైంది. ఇక వివరాల్లోకి వెళ్తే టీడీపీ నేత చలపాటి చంద్రకు చెందిన కోడిపై శనివారం సాయంత్రం వైసీపీ నేత నారాయణ పెంపుడు కుక్క దాడి చేసింది.
వైఎస్సార్ జిల్లా సిద్ధవటం మండలంలో విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది. మాధవరం-1 గ్రామంలో ఓ కుక్క కోడిపై దాడి చేయడం వల్ల వైసీపీ, టీడీపీ వర్గాలపై కేసు నమోదం కావడం చర్చనీయాంశమైంది. ఇక వివరాల్లోకి వెళ్తే టీడీపీ నేత చలపాటి చంద్రకు చెందిన కోడిపై శనివారం సాయంత్రం వైసీపీ నేత నారాయణ పెంపుడు కుక్క దాడి చేసింది. ఈ దాడిలో ఆ కోడికి గాయాలయ్యాయి. దీంతో రెండు కుటుంబాల మధ్య ఏర్పడ్డ వాగ్వాదం ఘర్షణకు దారి తీసింది. ఈ గొడవలో గాయాలపాలైన చలపాటి చంద్రను కడప సర్వజన ఆసుపత్రికి తరలించారు.
అయితే చలపాటి చంద్రను టీడీపీ రాజంపేట పార్లమెంటు నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి నాగమునిరెడ్డి, రాష్ట్ర వాణిజ్య విభాగం అధికార ప్రతినిధి గంజి సుబ్బరాయడు తదితరులు వచ్చి పరామర్శించారు. చలపాటి ఫిర్యాదు మేరకు నారాయణరెడ్డి, ఆయన కుమారుడు శ్రీనివాసులరెడ్డి, సహకరించిన నేకనాపురంమ వాసి కుమార్ రెడ్డి అలాగే మరికొందరిపై కేసు నమేదు చేశారు. మరోవిషయం ఏంటంటే నారాయణ ఇంటివద్దకు చంద్ర వచ్చి దర్భాషలాడాడని.. అతడ్ని ప్రశ్నిస్తే తనను కులం పేరుతో దూషించారని నేకనాపురం గ్రామానికి చెందిన చిన్న నాగయ్య అనే వ్యక్తి కూడా చంద్రపై పోలీసులుకు ఫిర్యాదు. ప్రస్తుతం ఈ కేసులపై విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు.