TS Government: గంజాయి సాగు రైతులపై సర్కార్‌ కొరడా.. జూన్‌ నుంచి రైతుబంధు నిధులు కట్..

Rythu Bandhu: రైతుబంధు.. యావత్‌ దేశాన్ని ఆకర్శించిన పథకమిది.. పెట్టుబడితో నడ్డి విరుగుతున్న రైతన్నకు వెన్నుదన్నుగా నిలిచిన సర్కార్‌ సాయమిది.. అన్నదాతకు ఆయువును అందిస్తోన్న ఈ మహత్తర పథకానికి తూట్లు పొడుస్తున్నారు కొంతమంది రైతులు.

TS Government: గంజాయి సాగు రైతులపై సర్కార్‌ కొరడా.. జూన్‌ నుంచి రైతుబంధు నిధులు కట్..
Cannabis Cultivation Farmer
Follow us

|

Updated on: Mar 15, 2022 | 1:31 PM

రైతుబంధు(Rythu Bandhu).. యావత్‌ దేశాన్ని ఆకర్శించిన పథకమిది.. పెట్టుబడితో నడ్డి విరుగుతున్న రైతన్నకు వెన్నుదన్నుగా నిలిచిన సర్కార్‌ సాయమిది.. అన్నదాతకు ఆయువును అందిస్తోన్న ఈ మహత్తర పథకానికి తూట్లు పొడుస్తున్నారు కొంతమంది రైతులు. రైతుబంధు నిధుల్ని గంజాయ్‌ సాగుకు(Cannabis Cultivation) వాడడంపై కన్నెర్రజేస్తోంది సర్కార్‌. చిన్నాపెద్దా తేడా లేదు. సన్నకారు అన్న వివక్ష లేదు. ఎకరా.. అర ఎకరా అన్న ప్రస్తావనే లేదు.. వ్యవసాయం దండుగ కాదు.. పండుగలా మార్చేందుకు తెలంగాణ సర్కార్‌ రైతుబంధు అనే మహత్తర పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకానికి పరిమితుల్లేవ్‌. హద్దుల్లేవ్‌. ఈ పథకం ద్వారా ఎన్ని ఎకరాలున్నా పెట్టుబడి సాయం అందుతుంది. ఎకరాకు 5 వేల చొప్పున పెట్టుబడి రూపంలో అందుతుంది. పదుల ఎకరాలున్న బడా రైతులకూ ఈ ప్రయోజనం దక్కుతోంది. రైతు ప్రయోజనాన్ని కాంక్షించి ప్రవేశపెట్టిన ఈ పథకానికి గుప్పెడుమంది తమ చర్యలతో చెడ్డపేరు తెస్తున్నారు. అలాంటి రైతులపై స్పెషల్‌ ఫోకస్‌ పెట్టింది తెలంగాణ ప్రభుత్వం.

ఈత వనంలో గంజాయి మొక్కలా మారిన వ్యక్తుల పేర్ల ఏరివేతకు నడుం బిగించింది. పెట్టుబడి సాయాన్ని అప్పనంగా వాడుకుంటూ.. రాష్ట్రంలో గంజాయి సాగు చేస్తోన్న రైతులకు రైతుబంధు ఇవ్వకూడదన్న నిర్ణయానికి వచ్చింది. గతంలోనే ఈ మేరకు సీఎం కేసీఆర్‌ ఆదేశాలు ఇచ్చారు. సీఎం ఆదేశాలతో కదిలిన ఎక్సైజ్‌ యంత్రాంగం గంజాయి సాగు చేస్తోన్న రైతుల్ని గుర్తించింది. గంజాయి పండిస్తున్న 148 మంది రైతుల్లో 121 మందిపై ఇప్పటికే కేసులు నమోదు చేసింది.

నారాయణ్‌ఖేడ్‌, మహబూబాబాద్‌, జహీరాబాద్‌, వరంగల్‌, భూపాలపల్లి, ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌ ప్రాంతాలకు చెందిన రైతులపై కేసులు నమోదయ్యాయి. ఈ రైతులకు రైతుబంధు నిలిపివేయాలని ప్రభుత్వానికి లేఖ రాసింది ఎక్సైజ్‌ శాఖ. జూన్‌లో విడుదల చేయనున్న రైతుబంధును వీరికి ఇవ్వొద్దని లేఖలో కోరింది. సదరు 148 మంది రైతుల ఆధార్‌ కార్డులు, ల్యాండ్ డాక్యుమెంట్లను కలెక్టర్లకు పంపారు ఎక్సైజ్‌ అధికారులు. నల్గొండ, సూర్యాపేటలో సైతం గంజాయి పండిస్తున్న రైతుల వివరాలు సేకరించింది ఎక్సైజ్‌శాఖ.

వ్యవసాయాన్ని లాభాల బాట పట్టించేందుకు.. అన్నదాతను అప్పుల ఊబి నుంచి బయటపడేసేందుకు రైతుబంధు పథకాన్ని పట్టాలెక్కించింది తెలంగాణ ప్రభుత్వం. ఏటా రెండు విడతలుగా ఈ సాయాన్ని అందజేస్తోంది. ఈ పథకాన్ని 2018 మే 10న కరీంనగర్‌ జిల్లాలో ప్రారంభించారు సీఎం కేసీఆర్‌.

ఇవి కూడా చదవండి: Wi-Fi Repeater: వైఫై రూటర్‌‌కు ధీటుగా Wi-Fi రిపీటర్.. అది ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలని ఉందా..

Target 2024: మళ్లీ అధికారమే టార్గెట్‌గా వైసీపీ మాస్టర్ ప్లాన్.. జగనన్న ఏం చేయబోతున్నారో తెలుసా..