CAG Report: రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక క్రమశిక్షణపై కాగ్ విమర్శలు.. తెలంగాణ బడ్జెట్‌పై కాగ్ నివేదిక..
తెలంగాణ బడ్జెట్‌పై కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(Comptroller and Auditor General) - కాగ్(CAG) నివేదిక ఇచ్చింది. బడ్జెట్ కేటాయింపులు, రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక క్రమశిక్షణపై కాగ్ విమర్శలు చేసింది. 2019-20 బడ్జెట్ వాస్తవానికి..
తెలంగాణ బడ్జెట్‌పై కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(Comptroller and Auditor General) – కాగ్(CAG) నివేదిక ఇచ్చింది. బడ్జెట్ కేటాయింపులు, రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక క్రమశిక్షణపై కాగ్ విమర్శలు చేసింది. 2019-20 బడ్జెట్ వాస్తవానికి దగ్గరగా లేదని చెప్పింది కాగ్. బడ్జెట్ పర్యవేక్షణ లో నియంత్రణ లేదని.. కొన్ని కేటాయింపులు అసెంబ్లీ ఆమోదం లేకుండానే ఖర్చు చేశారని నివేదిక సమర్పించింది. పుర్తి స్థాయిలో ఖర్చుచేసే శాఖలకు కేటాయింపులు పెంచలేదని చెప్పింది కాగ్. కొన్నేళ్లుగా అసెంబ్లీ ఆమోదానికి మించి ప్రభుత్వం ఖర్చు చేస్తుందని చెప్పింది. ఐదేళ్లలో 84వేల కోట్ల అధిక వ్యయాన్ని అసెంబ్లీ ఇంకా క్రమబద్దీకరించలేదని చెప్పింది. ఇది రాష్ట్ర శాసన సభ సాధికారత ను తగ్గించడమేనని విమర్శించింది కాగ్.
ఎమర్జెన్సీ నిధుల నుంచి అడ్వాన్సులు తీసుకునే విషయంలో జాగ్రత్తలు తీసుకోలేదని.. వార్షిక పద్దుల సమర్పణలో ప్రభుత్వం జవాబు దారితనం లేదని నివేదికలో పొందుపర్చింది. కాగ్ ప్రమాణాలను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో పాటించడం లేదని చెప్పింది. ఐదు ఏళ్లలో రెవెన్యూ మిగులు లేకపోగా.. అవసరాలకు మించి రుణాలు తీసుకున్నారంది.
గత అప్పులు తీర్చడానికి మరిన్ని అప్పులు చేస్తున్నారని.. దీని ప్రభావం ఆస్తుల కల్పనపై పడినట్లు చెప్పింది కాగ్. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ప్రభుత్వం విద్యా,వైద్యం పై ఖర్చు తక్కువగా ఉందని.. సాగునీటి ప్రాజెక్ట్ ల నిర్మాణాలు ఆలస్యం కావడం వల్ల వ్యయం పెరిగినట్లు చెప్పింది. ఉదయ్ పథకం కింద ప్రభుత్వం వాటా 4063.65 కోట్లు చెల్లించక పోవడం వల్ల డిస్కం లు నష్టపోయాయంటూ నివేదించింది కాగ్.
ఇవి కూడా చదవండి: Wi-Fi Repeater: వైఫై రూటర్‌కు ధీటుగా Wi-Fi రిపీటర్.. అది ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలని ఉందా..