AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Minister Harish Rao: జాతీయ రాజకీయాల్లో TRS కీలక పాత్ర.. మంత్రి హరీష్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌ (Prashant Kishor) తో తెలంగాణ రాష్ట్ర సమితి(TRS) కలిసి పనిచేస్తే తప్పేంటని మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. 

Minister Harish Rao: జాతీయ రాజకీయాల్లో TRS కీలక పాత్ర.. మంత్రి హరీష్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు
Telangana Minister Harish Rao
Janardhan Veluru
| Edited By: Ravi Kiran|

Updated on: Apr 27, 2022 | 1:59 PM

Share

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌ తో తెలంగాణ రాష్ట్ర సమితి(TRS) కలిసి పనిచేస్తే తప్పేంటని మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు.  ఓటమి భయంతోనే ప్రశాంత్ కిషోర్‌ను టీఆర్ఎస్ వాడుకుంటోందంటూ బీజేపీ, కాంగ్రెస్ నేతలు చేస్తున్న విమర్శలను తిప్పికొచ్చారు.  ఇదే ప్రశాంత్ కిషోర్ గతంలో కాంగ్రెస్, బీజేపీలతో కలిసి పనిచేశారని గుర్తుచేశారు. టీఆర్ఎస్ కోసం ప్రశాంత్ కిషోర్‌ పనిచేయడంపై మాట్లాడే అర్హత బీజేపీ, టీఆర్ఎస్‌లకు లేదన్నారు.

టీఆర్ఎస్ 21వ ఆవిర్భావ దినోత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న ప్లీనరీ సమావేశాల్లో మంత్రి హరీష్ రావు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తప్పనిసరిగా భవిష్యత్‌లో జాతీయ రాజకీయాల్లో టీఆర్ఎస్ కీలక పాత్ర పోషిస్తుందని హరీష్ రావు ధీమా వ్యక్తంచేశారు. దీని కోసం టీఆర్ఎస్ సన్నద్ధమవుతున్నట్లు చెప్పారు.

బీజేపీ తెలంగాణ రాష్ట్రాధ్యక్షుడు బండి సంజయ్ చేపడుతున్న పాదయాత్రను ప్రజలు ఆదరించడం లేదని మంత్రి హరీష్ అన్నారు. తన పాదయాత్రకు ప్రజల నుంచి ఆదరణ లేకపోవడంతో దీన్ని ఎలా ఆపాలని బండి సంజయ్ ఆలోచిస్తున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీ సభల్లో కుర్చీలు ఖాళీగా కనిపిస్తున్నాయని హరీశ్ రావు విమర్శించారు.

Also Read..

Atal Pension Yojana: ఆన్‌లైన్‌లో అటల్‌ పెన్షన్‌ యోజన ఖాతా తెరవాలనుకుంటున్నారా..? ఇంట్లోనే ఉండి ఇలా చేయండి!

TRS Foundation Day: జాతీయ రాజకీయాల్లోకి టీఆర్ఎస్.. సమావేశంలో ప్రవేశ పెట్టనున్న 11 తీర్మానాలు ఇవే..