AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: గ్రూప్-1 నోటిఫికేషన్ తో హైదరాబాద్ లో సందడి.. కోచింగ్ సెంటర్లలో పెరిగిన రద్దీ

తెలంగాణ(Telangana) లో గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ విడుదల కావడంతో నిరుద్యోగులు నగరబాట పడుతున్నారు. జిల్లాల నుంచి వస్తున్న ఉద్యోగార్థులతో హైదరాబాద్ నగరంలో సందడి నెలకొంది. కొన్ని రోజులుగా నోటిఫికేషన్ కోసం ఎదురు చూసిన అభ్యర్థులు..

Hyderabad: గ్రూప్-1 నోటిఫికేషన్ తో హైదరాబాద్ లో సందడి.. కోచింగ్ సెంటర్లలో పెరిగిన రద్దీ
Tspsc Group 1 Exam
Ganesh Mudavath
|

Updated on: Apr 27, 2022 | 11:51 AM

Share

తెలంగాణ(Telangana) లో గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ విడుదల కావడంతో నిరుద్యోగులు నగరబాట పడుతున్నారు. జిల్లాల నుంచి వస్తున్న ఉద్యోగార్థులతో హైదరాబాద్ నగరంలో సందడి నెలకొంది. కొన్ని రోజులుగా నోటిఫికేషన్ కోసం ఎదురు చూసిన అభ్యర్థులు.. ప్రస్తుతం నోటిఫికేషన్(Group-1 notification) విడుదల చేయడంతో పుస్తకాలతో కుస్తీ పట్టేందుకు సిద్ధమయ్యారు. ఉద్యోగ ప్రకటనకు, పరీక్షకు కేవలం రెండు నుంచి మూడు నెలల సమయం మాత్రమే ఉండటంతో సిలబస్‌ను పూర్తి చేయడంలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల నుంచి చాలామంది హైదరాబాద్(Hyderabad) చేరుకుని కోచింగ్‌ సెంటర్లు, హాస్టళ్లలో ఉంటూ చదువుతున్నారు. తద్వారా కోచింగ్‌ సెంటర్లు, లైబ్రరీల వద్ద హడావిడి ఏర్పడింది. సివిల్స్‌కు సన్నద్ధమవుతున్న అభ్యర్థులు సైతం గ్రూప్‌-1 పరీక్షపై దృష్టి సారిస్తున్నారు. నగరంలోని అశోక్‌నగర్‌, దిల్‌సుఖ్‌నగర్‌, అమీర్‌పేట తదితర ప్రాంతాల్లో ఉన్న కోచింగ్‌ కేంద్రాలు ఇప్పటికే గ్రూప్‌-1కు శిక్షణ ప్రారంభించాయి. గత నెల చివరి వారం నుంచే కొత్త బ్యాచ్‌లు ప్రారంభించాయి. తాజాగా నోటిఫికేషన్‌ విడుదల కావడంతో మరిన్ని బ్యాచ్‌లు ఈ వారంలోనే ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నాయి.

గ్రూప్-1 నోటిఫికేషన్‌ విడుదల అయినందున టైం వేస్ట్ చేసుకోకుండా ప్రణాళిక ప్రకారం ప్రిపేర్ అవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు. మూడు నెలల సమయం ఉన్నందున దానికి తగ్గట్టుగా ప్రణాళిక చేసుకోవాలని.. ఇప్పటికే ప్రిపరేషన్ ను ప్రారంభించిన అభ్యర్థులు ప్రిలిమ్స్‌ సిలబస్‌తో పాటు మెయిన్‌ పరీక్షకు సంబంధించి ఏవైనా రెండు సబ్జెక్టులు ఎంపిక చేసుకుని చదివాలంటున్నారు. తాజాగా సన్నద్ధత ప్రారంభించే వారు పూర్తిగా ప్రిలిమ్స్‌పైనే దృష్టి పెట్టాలని సూచించారు.

తెలంగాణ నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదలైంది. 503 పోస్టులతో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. తెలంగాణ ఏర్పడ్డాక విడుదలైన తొలి గ్రూప్-1 నోటిఫికేషన్ ఇదే కావడం విశేషం. ఇక గ్రూప్-1 ఉద్యోగాలకు ఇంటర్వ్యూ రద్దు చేసింది ప్రభుత్వం. ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్ష ద్వారా ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు టీఎస్‌పీస్‌సీ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని టీఎస్‌పీఎస్‌సీ చైర్మన్ జనార్థన్ రెడ్డి తెలిపారు. మే 2వ తేదీ నుంచి మే 31వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

ఇవీచదవండి

Fire Accident: ప్రభుత్వాసుపత్రిలో అగ్ని ప్రమాదం… మంటల్లో 50 మందికిపైగా రోగులు..

Atal Pension Yojana: ఆన్‌లైన్‌లో అటల్‌ పెన్షన్‌ యోజన ఖాతా తెరవాలనుకుంటున్నారా..? ఇంట్లోనే ఉండి ఇలా చేయండి!

Hyderabad: ప్రయాణికులకు అలర్ట్.. హైదరాబాద్ లో నేడు ట్రాఫిక్ ఆంక్షలు.. ప్రత్యామ్నాయ మార్గాలివే