Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: ప్రయాణికులకు అలర్ట్.. హైదరాబాద్ లో నేడు ట్రాఫిక్ ఆంక్షలు.. ప్రత్యామ్నాయ మార్గాలివే

హైదరాబాద్(Hyderabad) వేదికగా నిర్వహిస్తున్న టీఆర్ఎస్(TRS) పార్టీ ప్లీనరీ సందర్భంగా నేడు నగరంలో భారీ ట్రాఫిక్ ఆంక్షలు, దారి మళ్లింపులు విధించారు. టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశాలను పురస్కరించుకుని ట్రాఫిక్‌ మార్గదర్శకాలు అమలు చేస్తున్నట్లు సైబరాబాద్‌(Cyberabad) పోలీస్‌...

Hyderabad: ప్రయాణికులకు అలర్ట్.. హైదరాబాద్ లో నేడు ట్రాఫిక్ ఆంక్షలు.. ప్రత్యామ్నాయ మార్గాలివే
Traffic
Follow us
Ganesh Mudavath

|

Updated on: Apr 27, 2022 | 10:00 AM

హైదరాబాద్(Hyderabad) వేదికగా నిర్వహిస్తున్న టీఆర్ఎస్(TRS) పార్టీ ప్లీనరీ సందర్భంగా నేడు నగరంలో భారీ ట్రాఫిక్ ఆంక్షలు, దారి మళ్లింపులు విధించారు. టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశాలను పురస్కరించుకుని ట్రాఫిక్‌ మార్గదర్శకాలు అమలు చేస్తున్నట్లు సైబరాబాద్‌(Cyberabad) పోలీస్‌ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర ఒక ప్రకటనలో తెలిపారు. టీఆర్‌ఎస్‌ 21వ ఆవిర్భావ వేడుకలు నగరంలో హెచ్ఐసీసీలో నిర్వహిస్తున్నారు. దీంతో హెచ్‌ఐసీసీ పరిసర ప్రాంతాలైన కొత్తగూడ-హైటెక్స్‌, సైబర్‌ టవర్స్‌-ఐకియా రోటరీ, గచ్చిబౌలి జంక్షన్‌-కొత్తగూడ ప్రాంతాల్లోని కార్యాలయాల నిర్వాహకులు పనివేళల్లో స్వల్ప మార్పులు చేసుకోవాలని సూచించారు. ఉద‌యం 9 నుంచి 11 గంట‌ల వ‌ర‌కు, సాయంత్రం 4 నుంచి 7 గంట‌ల వ‌ర‌కు ట్రాఫిక్ ర‌ద్దీ ఉండే అవ‌కాశం ఉంటుంద‌ని, ఈ స‌మయాల్లో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాల‌ని పోలీసులు సూచించారు. నీరూస్‌ జంక్షన్‌-సైబర్‌ టవర్స్‌ జంక్షన్‌-మెటల్‌ చార్మినార్‌ జంక్షన్‌-గూగుల్‌ జంక్షన్‌-కొత్తగూడ జంక్షన్‌ రోడ్డు. మెటల్‌ చార్మినార్‌ జంక్షన్‌-ఖానామెట్‌ జంక్షన్‌-హైటెక్స్‌/హెఐసీసీ/ఎన్‌ఏసీ రోడ్డు. జేఎన్‌టీయూ-సైబర్‌ టవర్స్‌ -బయోడైవర్సిటీ జంక్షన్‌. గచ్చిబౌలి జంక్షన్‌-బొటానికల్‌ గార్డెన్‌ జంక్షన్‌- కొత్తగూడ జంక్షన్‌-కొండాపూర్‌ జంక్షన్లలో ట్రాఫిక్ ఉంటుందని అధికారులు వెల్లడించారు.

నీరూస్‌ నుంచి గచ్చిబౌలి జంక్షన్‌కు వెళ్లే వారు సీఓడీ(మాదాపూర్‌ అయ్యప్ప సొసైటీ) నుంచి దుర్గం చెరువు-ఇనార్బిట్‌-ఐటీసీ కోహినూర్‌-ఐకియా-బయోడైవర్సిటీ-గచ్చిబౌలి మీదుగా సైబర్‌ టవర్స్‌ వైపునకు వెళ్లకుండా రాకపోకలు సాగించాలి. మియాపూర్‌, కొత్తగూడ, హఫీజ్‌పేట్‌ ప్రాంతాలనుంచి వచ్చే వారు హైటెక్‌ సిటీ- సైబర్‌ టవర్స్‌-జూబ్లీహిల్స్‌ వచ్చే వాహనాలు రోల్లింగ్‌ హిల్స్‌ ఏఐజీ హాస్పిటల్‌-ఐకియా-ఇనార్బిట్‌-దుర్గం చెరువు రోడ్డులో ప్రయాణించాలి. ఆర్‌సీపురం, చందానగర్‌, మాదాపూర్‌, గచ్చిబౌలి ప్రాంతాల నుంచి వచ్చే వాహనదారులు బీహెచ్‌ఈఎల్‌-నల్లగండ్ల-హెచ్‌సీయూ-ట్రిపుల్‌ ఐటీ-గచ్చిబౌలి రోడ్డులో కొండాపూర్‌, ఆల్విన్‌ రోడ్డు వైపునకు వెళ్లకుండా రాకపోకలు సాగించాలని సూచించారు. ఈ మార్పులను ప్రయాణికులు గమనించాలని ట్రాఫిక్ పోలీసులు, అధికారులు కోరారు.

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

ఇవీచదవండి.

Banana For Control BP: బీపీ ఉన్న వారు అరటిపండు తినడం మంచిదేనా..? నిపుణులు ఏమంటున్నారంటే..

Priyanka Chopra: ఆ అనాథను దత్తత తీసుకోవాలనుకున్నా.. కానీ, ఇంట్లో వాళ్లు అడ్డు చెప్పడంతో..: ప్రియాంక చోప్రా