Priyanka Chopra: అనాథ పాపను దత్తత తీసుకోవాలనుకున్నా.. ఆత్మకథలో వెల్లడించిన ప్రియాంక చోప్రా..
అయితే, ప్రియాంక తల్లి కావడానికి చాలా కాలం ముందు, ప్రియాంక ఒక పాపను దత్తత తీసుకోవడానికి ఇష్టపడింది. కానీ కుటుంబ సభ్యుల అసమ్మతి కారణంగా తన కోరికను నెరవేర్చుకోలేకపోయింది.
బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా (Priyanka Chopra) ఇప్పుడు మాతృత్వానికి సంబందించిన సంతోషకరమైన క్షణాలను అనుభవిస్తోంది. సరోగసీ ద్వారా జనవరిలో తల్లి అయిన ప్రియాంక.. తన జీవితాన్నే పూర్తిగా మారిపోయేలా చేసింది. ప్రియాంకకు పిల్లలంటే చాలా ఇష్టం. సోషల్ మీడియా ఖాతాలలో ఆమె తరచుగా తన ఫోటోలను, తన భర్త నిక్ జోనాస్(Nick Jonas) కుటుంబానికి చెందిన పిల్లలతో ఆడుకుంటోన్న ఫొటోలను కూడా పంచుకుంటుంది. అయితే తాజాగా ప్రియాంక.. తన చిన్నతనంనాటి జ్ఞాపకాన్ని గుర్తుచేసుకుంది. ఓ అనాథ బాలికను తనతో ఉంచుకోమని తన తల్లి డాక్టర్ మధు చోప్రా( Dr Madhu Chopra)ను ఆమె కోరిన క్షణాలవి. అయితే కుటుంబ సభ్యుల అసమ్మతి కారణంగా తన అభిరుచి నెరవేరలేదు. ఈ విషయాన్ని ప్రియాంక తన ఆత్మకథలో ప్రియాంక చోప్రా పంచుకుంది.
నటి తల్లి మధు చోప్రా డాక్టర్. హాస్పిటల్ బయట కార్ పార్కింగ్‌లో ఓ అనాథ బాలికను చూసింది. ఆ పాప ఏడుస్తూనే ఉంది. దీంతో మధు చోప్రా ఆ పాపను వెంటనే తన ఇంటికి తీసుకొచ్చింది. ఆ అమ్మాయిని చూసిన ప్రియాంక ఎంతగానో సంతోషించి, ఆ పాపను తన దగ్గరే ఉంచుకుంటానంటూ పట్టుబట్టింది. కానీ ప్రియాకం తల్లి అభ్యంతరం చెప్పడంతో నిరాశపడింది.
సంతానం లేని దంపతులకు పాపను అప్పగించాలనేది ప్రియాంక చోప్రా తల్లి ఆలోచన. జన్మాష్టమి రోజు రాత్రి వర్షంలో తడుస్తూ వాహనం నడుపుతూ దంపతులకు బిడ్డను అప్పగించారు. సంతానం లేని దంపతులు ఆనందంతో కృతజ్ఞతతో ఆ పాపను తీసుకున్నారు. ఆనాటి సంఘటనలను తాను ఎప్పటికీ మరచిపోలేనని ప్రియాంక రాసుకొచ్చింది. అయితే ఆ సమయంలో దత్తతకు సంబందించిన ప్రాసెస్ తనకు తెలియదని చెప్పుకొచ్చింది.
ప్రియాంక ప్రస్తుతం లాస్ ఏంజిల్స్‌లో నటుడు, గాయకుడు భర్త నిక్ జోనాస్, వారి కుమార్తెతో నివసిస్తున్నారు. ఆమె ఎండింగ్ థింగ్స్, ఇట్స్ ఆల్ కమింగ్ బ్యాక్ టు మీ, సిటాడెల్, బాలీవుడ్ చిత్రం జీ లే జరాలో కనిపించనుంది.
Also Read: Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట ట్రైలర్ అప్డేట్ ఇచ్చిన తమన్.. స్కోర్ స్టార్ట్ అంటూ పోస్ట్..