AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: ‘మా అమ్మ నాన్న వాళ్లే’.. గతజన్మ పేరెంట్స్‌ కోసం ఇంటిని వదిలిన బాలుడు.. హైదరాబాద్‌లో సంచలనం..

Hyderabad: ఏడేడు జన్మలు ఉంటాయని ఎప్పటి నుంచో ప్రచారంలో ఉంది. దీని ఆధారంగా తమకు గత జన్మ స్మృతులు గుర్తొస్తున్నాయంటూ చాలా మంది అంటూ ఉండడం తెలిసిందే. అయితే దీనిపై ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. కానీ.

Hyderabad: 'మా అమ్మ నాన్న వాళ్లే'.. గతజన్మ పేరెంట్స్‌ కోసం ఇంటిని వదిలిన బాలుడు.. హైదరాబాద్‌లో సంచలనం..
representative image
Narender Vaitla
|

Updated on: Apr 27, 2022 | 9:48 AM

Share

Hyderabad: ఏడేడు జన్మలు ఉంటాయని ఎప్పటి నుంచో ప్రచారంలో ఉంది. దీని ఆధారంగా తమకు గత జన్మ స్మృతులు గుర్తొస్తున్నాయంటూ చాలా మంది అంటూ ఉండడం తెలిసిందే. అయితే దీనిపై ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. కానీ.. ఇప్పటికీ ఎక్కువగా పూర్వజన్మ ఆధారాల కోసం పాకులాడే వారు ఉన్నారు. అయితే ఇటీవలి కాలంలో చిన్నారులు ఇలా తమకు పూర్వ జన్మ ఉందంటూ చెప్పడం ఎక్కువగా జరుగుతోంది. కేవలం చెప్పడమే కాకుండా తమ సొంత వారినే పరాయి వారిగా భావిస్తున్నారు. క్రమేపి ఈ పంథాలో తమను కన్న తల్లిదండ్రులను కాదని, గత జన్మ బంధాల కోసం వెతుకుతూ వెళ్లిపోతున్నారు. తాజాగా ఇలాంటి ఓ విచిత్ర సంఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌లోని న్యూ విద్యానగర్‌లో ఉండే దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. భర్త ఇద్దరు పిల్లలను భార్య వద్ద వదిలి వేరుగా ఉంటున్నాడు. ఇద్దరు చిన్నారులు పాఠశాలకు వెళ్లకుండా ఇంట్లోనే ఆన్‌లైన్‌ తరగతులు అటెండ్‌ అవుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా చిన్న కుమారుడు (13) ఏప్రిల్‌ 1వ తేదీన మొబైల్‌ ఫోన్‌లో ఓ వీడియోను రికార్డ్ చేసి ఇంటిని వదిలి వెళ్లిపోయాడు.

ఆ వీడియోలో తనకు పూర్వజన్మ తల్లిదండ్రులు గుర్తొచ్చారని. మీరు నా పేరెంట్స్‌ కాదంటూ, వారి వద్దకు వెళుతున్నాను అంటూ రికార్డ్‌ చేసి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. దీంతో విషయం తెలసుకున్న పేరెంట్స్‌ పలు ప్రాంతాల్లో వెతికినా కుమారుడి ఆచూకి లభించలేదు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు దర్యా్ప్తు చేస్తున్నారు. దీంతో ఈ విషయం స్థానికంగా సంచలనం సృష్టించింది.

మరిన్ని హైదరాబాద్ వార్తలకు క్లిక్ చేయండి..

Also Read: Andhra Pradesh: హాల్ టిక్కెట్ చూపిస్తే “ఫ్రీ”గా ప్రయాణం.. విద్యార్థుల కోసం ఆర్టీసీ కీలక నిర్ణయం

SBI Recruitment: టెక్నికల్‌ డిగ్రీ చేసిన వారికి స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో ఉద్యోగాలు.. ఇలా దరఖాస్తు చేసుకోండి..

Parenting Tips: మీ పిల్లలను స్కూల్‌లో చేర్పిస్తున్నారా? ఈ విషయాలను తప్పక గుర్తుంచుకోండి..!

కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..
కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..
రాయలసీమ గడ్డపై పందెం కోళ్లు.. పులివెందుల పుంజులకు భారీ డిమాండ్!
రాయలసీమ గడ్డపై పందెం కోళ్లు.. పులివెందుల పుంజులకు భారీ డిమాండ్!
పక్కా యాక్షన్ మోడ్‌లో రష్మిక, విజయ్‌ వీడియో
పక్కా యాక్షన్ మోడ్‌లో రష్మిక, విజయ్‌ వీడియో
పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..
పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..