SBI Recruitment: టెక్నికల్ డిగ్రీ చేసిన వారికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. ఇలా దరఖాస్తు చేసుకోండి..
SBI Recruitment: భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ముంబై కేంద్రంగా పనిచేసే ఈ బ్యాంకు పలు పోస్టులను రెగ్యులర్/ కాంట్రాక్ట్ విధానంలో తీసుకోనుంది...

SBI Recruitment: భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ముంబై కేంద్రంగా పనిచేసే ఈ బ్యాంకు పలు పోస్టులను రెగ్యులర్/ కాంట్రాక్ట్ విధానంలో తీసుకోనుంది. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం…
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 35 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* వీటిలో రెగ్యులర్ పోస్ట్‌లు (07), కాంట్రాక్ట్ విధానంలో (28) ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* రెగ్యులర్ పోస్టులకు గాను సిస్టమ్ ఆఫీసర్లు (టెస్ట్ ఇంజనీర్, వెబ్ డెవలపర్, సీనియర్ ఆటేమేషన్ టెస్ట్ ఇంజనీర్, ప్రాజెక్ట్ మేనేజర్) ఖాళీలు ఉన్నాయి.
* కాంట్రాక్ట్ విధానంలో భాగంగా ఎగ్జిక్యూటివ్ (టెస్ట్ ఇంజనీర్, ఇంటరాక్షన్ డిజైనర్, వెబ్ డెవలపర్, పోర్టల్ అడ్మినిస్ట్రేషన్, ప్రాజెక్ట్ మేనేజర్) వంటి పోస్టులు ఉన్నాయి.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టుల ఆధారంగా సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్/ ఎంఈ/ ఎంటెక్/ ఎమ్మెస్సీ/ ఎంసీఏ ఉత్తీర్ణత పొంది ఉండాలి. సంబంధిత పనిలో అనుభవంతో పాటు, టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి.
* అభ్యర్థుల వయసు 32 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను తొలుత పనితీరు ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేస్తారు. అనంతరం రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ 27-04-2022న మొదలవుతోంది. చివరి తేదీగా 17-05-2022ని నిర్ణయించారు.
* ఆన్‌లైన్ టెస్ట్‌ని 25-06-2022 తేదీన నిర్వహించనన్నారు.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..
LIC IPO Price Band: LIC ఐపీవో అప్ డేట్.. ఒక్కో షేరు రేటు, పాలసీదారులకు డిస్కౌంట్ ఎంతంటే..
Russia Ukraine war: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం.. యూరఫ్ దేశాలకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన భారత్..




