LIC IPO Price Band: LIC ఐపీవో అప్ డేట్.. ఒక్కో షేరు రేటు, పాలసీదారులకు డిస్కౌంట్ ఎంతంటే..

LIC IPO Price Band: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) షేర్ల రేటు ఖరారు. ఒక్కో షేరు రేటు ఎంత. పాలసీదారులకు ఎల్ఐసీ ఎంత తగ్గింపు ఇస్తోంది. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి..

LIC IPO Price Band: LIC ఐపీవో అప్ డేట్.. ఒక్కో షేరు రేటు, పాలసీదారులకు డిస్కౌంట్ ఎంతంటే..
Lic Ipo
Follow us
Ayyappa Mamidi

|

Updated on: Apr 26, 2022 | 8:43 PM

LIC IPO Price: ఆఫర్‌కు సంబంధించిన ప్రైస్ బ్యాండ్(Price band) ను నిర్ణయించింది. ఒక్కో షేర్ ధర రూ. 902 నుంచి రూ. 949 మధ్య ఉండనున్నట్లు నిర్ణయించబడింది. దీనికి తోడు ఎల్ఐసీ పాలసీ హోల్డర్‌లకు ఒక్కో షేరుకు రూ. 60 తగ్గింపు ఇవ్వనున్నట్లు ప్రభుత్వ వర్గాల నుంచి తెలిసినట్లు CNBC TV-18 వార్తా సంస్థ వెల్లడించింది. రిటైల్ ఇన్వెస్టర్లు, ఉద్యోగుల కోసం రూ. 40 తగ్గింపు ఉంటుందని విశ్వసనీయ వర్గాల నుంచి తెలుస్తోంది. ఇన్వెస్టర్లు చాలా కాలం నుంచి ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎల్ఐసీ ఐపీవో మే 4న ప్రారంభం కానుంది. ఈ ఇష్యూ మే 9న ముగియనున్నట్లు తెలుస్తోంది. ఆఫర్ కోసం యాంకర్ బుక్ మే 2 న తెరవవచ్చని సమాచారం. ఐపిఓలో గ్రీన్‌షూ ఆప్షన్ ఉండదని సమాచారం ప్రకారం తెలుస్తోంది. ఏప్రిల్ 25న సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ) అప్‌డేట్ చేయబడిన డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్‌కు(DRHP) ఆమోదం తెలిపింది. ఇది మునుపటి డ్రాఫ్ట్ పేపర్‌లో తెలిపిన 5 శాతానికి బదులుగా 3.5 శాతం వాటాను ప్రభుత్వం విక్రయిస్తోంది.

సవరించిన DRHP గత వారం మార్కెట్ రెగ్యులేటర్ కు సమర్పించటం జరిగింది. ఈ ఇష్యూలో దాదాపు 22 కోట్ల షేర్లను విక్రయించడం ద్వారా రూ. 21,000 కోట్ల మొత్తాన్ని సమీకరించాలని ఎల్ఐసీ యోచిస్తోంది. దీనికి సంబంధించిన రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్‌ను ఏప్రిల్ 27లోగా సెబీ ముందు సమర్పించనున్నట్లు తెలిపింది. ఈ లెక్కన ఎల్ఐసీ విలువ 6 బిలియన్ డాలర్లుగా ఉండనుంది. IPO ద్వారా పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాలను చేరుకోవడానికి కేంద్రం నిర్ణయించింది. గత ఆర్థిక సంవత్సరం రూ.13,531 కోట్ల నుంచి 2022-23కి రూ. 65,000 కోట్ల పెట్టుబడుల ఉపసంహరణను ప్రభుత్వం అంచనా వేసింది. ఈ ఇష్యూ ఇంతకు ముందే జరగాల్సి ఉన్నప్పటికీ.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తెచ్చిన అస్థిరతల కారణంగా అది అప్పట్లో వాయిదా పడింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పర్సనల్ ఫైనాన్స్ కు సంబంధించిన ఆసక్తికరమైన వీడియోల వేదిక Money9 Telugu యూట్యూబ్ ఛానెల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవీ చదవండి..

Economic Crisis: భారత్ మరో శ్రీలంకగా మారుతుందా..! గణాంకాలు ఏమి చెబుతున్నాయంటే..

Sri lanka Crisis: శ్రీలంక ఆర్థిక సంక్షోభం నేర్పిన పాఠాలు.. రాష్ట్రాల రుణాలకు అడ్డుకట్ట వేయాల్సిందే..