Sri lanka Crisis: శ్రీలంక ఆర్థిక సంక్షోభం నేర్పిన పాఠాలు.. రాష్ట్రాల రుణాలకు అడ్డుకట్ట వేయాల్సిందే..

Sri lanka Crisis: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంక ప్రపంచానికి పలు గుణ పాఠాలు నేర్పిస్తోంది. ఆదాయాన్ని సరిగ్గా అంచనా వేయకుండా అప్పుల కుప్పగా మారిన దేశం, ఆర్థికంగా పూర్తిగా దెబ్బతింది. ఆ దేశంలో లీటర్ పెట్రోల్‌ ధర రూ.373గా ఉంది. ఇక లీటర్ డీజిల్ ధర రూ.329కి చేరిందంటే...

Sri lanka Crisis: శ్రీలంక ఆర్థిక సంక్షోభం నేర్పిన పాఠాలు.. రాష్ట్రాల రుణాలకు అడ్డుకట్ట వేయాల్సిందే..
Narender Vaitla

|

Apr 26, 2022 | 6:20 PM

Sri lanka Crisis: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంక ప్రపంచానికి పలు గుణ పాఠాలు నేర్పిస్తోంది. ఆదాయాన్ని సరిగ్గా అంచనా వేయకుండా అప్పుల కుప్పగా మారిన దేశం, ఆర్థికంగా పూర్తిగా దెబ్బతింది. ఆ దేశంలో లీటర్ పెట్రోల్‌ ధర రూ.373గా ఉంది. ఇక లీటర్ డీజిల్ ధర రూ.329కి చేరిందంటే పరిస్థితుల ఎంతలా చేయి దాటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రజలకు రోడ్ల మీదికొచ్చి ప్రభుత్వంపై తిరగబడే పరిస్థితులు వచ్చాయి. ఇక మన పక్కనే ఉన్న మరో దేశం పాకిస్తాన్‌లోనూ ఇంచుమించు ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. పాక్‌లో రాజకీయ కారణాల కారణంగా ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటోంది. మరి మన పొరుగున ఉన్న రెండు దేశాలు ఇంతకీ ఆర్థిక నష్టాల్లోకి కూరుకుపోతున్న తరుణంలో భారత దేశం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి.? ఆర్థికంగా దేశం బలహీనపడకూడదంటే ఎలాంటి ముందుస్తు చర్యలు చేపట్టాలి అన్ని విషయాలపై ప్రముఖ రాజకీయ, ఆర్థిక విశ్లేషకుడు కరణ్ భాసిన్ పలు సూచనలు చేశారు. పొరుగు దేశాల పరిస్థితులు భారత్‌లో రాకూడదంటే ఏం చేయాలో వారి మాటల్లోనే..

భారత్‌లో తమిళనాడు, గుజరాత్‌, కర్ణాటక వంటి రాష్ట్రాలు ఆర్థిక వృద్ధి పరంగా బాగానే కనిపిస్తున్నాయి. కేరళ ఆర్థిక వ్యవస్థ చెల్లింపుల ఆధారంగా సాగుతోంది. అయితే రాజస్థాన్‌, పంజాబ్‌, హర్యానా రాష్ట్రాలు మాత్రం ఆర్థికంగా కష్టాలను ఎదుర్కొంటున్నాయి. బిహార్‌ కూడా పెట్టుబడులు లేని కారణంగా ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటోంది. అంతేకాకుండా ఇటీవల అక్కడ మద్యపాన నిషేధం కారణంగా ప్రభుత్వ ఖజానాకు గండి పడింది. దీంతో అభిబృద్ధి పనులు కుంటుపడ్డాయి. ఇక ఉత్తరప్రదేశ్‌ విషయానికొస్తే.. ఈ రాష్ట్రం పెట్టుబడులను ఆకర్షిస్తూ మెరుగ్గానే కనిపిస్తోంది.

భారత్‌లో ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకంగా ఆర్థిక పరిస్థితులు ఉన్నాయి. వారి వారి ప్రాధాన్యతల ఆధారంగా డబ్బులు ఖర్చు చేస్తున్నారు. కొన్ని రాష్ట్రాలు ప్రజల సంక్షేమం కోసం ఖర్చు చేస్తే, మరికొన్ని రాష్ట్రాలు నిర్మాణాలకు వెచ్చిస్తున్నారు. ఉత్పాదక పెంపులో ఈ రెండు అనివార్యమైనవి. ఇక మరికొన్ని రాష్ట్రాలు సబ్సీడీలపై ఎక్కువగా ఖర్చు చేస్తున్నారు. అయితే మధ్యతరగతి ప్రజలకు విద్యుత్‌పై రాయితీలు ఇవ్వడం ఆహ్వానించతగినది కాదు, అదే ఖర్చును ప్రజల ఆరోగ్యం, విద్యా వంటి మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి ఉపయోగించుకుంటే బాగుటుంది. ప్రజల ఖర్చులను తగ్గించే నిర్ణయాలు తీసుకోవడం సబ్సిడీ కంటే ముఖ్యమైంది.

ఢిల్లీలో ఈ దిశగా అడుగులు పడుతున్నాయి. అయితే ఢిల్లీ మోడల్‌ గురించి జరుగుతోన్న చర్చకు, వాస్తవికతకు తేడా ఉంది. ఇప్పటికీ తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలను చివరి చాయిస్‌గా చూస్తున్నారు. ఏమాత్రం ఆర్థిక స్థోమత ఉన్న వారైనా తమ చిన్నారులను ప్రైవేటు స్కూళ్లకే పంపిస్తున్నారు. ప్రజారోగ్య సౌకర్యాల విషయంలో కూడా ఇదే వర్తిస్తుంది. 1990వ దశకం ప్రారంభంలో, 2000 దశకం చివరిలో దేశంపై రుణాల ప్రభావం పడిన నేపథ్యంలో ఈ పరిణామాలను పరిగణలోని తీసుకొని మంచి ఆర్థిక విధానాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది.

ఈ నేపథ్యంలోనే రాష్ట్రాలు తీసుకునే అప్పుల విషయంలోనూ జాగ్రత్త పడాల్సి అవనరం ఎంతైనా ఉంది. ఈ క్రమంలోనే రాష్ట్రాలు తీసుకునే రుణాల విషయంలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కొన్ని షరతులు విధించాలి. ముఖ్యంగా ప్రైవేట్‌ రంగ సంస్థలు తీసుకునే రుణాలపై కట్టడి చేయాలి. అయితే ఇతర దేశాల ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు చూసి ప్రస్తుతం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. భారత్‌ ఇప్పటికీ మంచి వాతావరణమే ఉంది. ఆర్థికపరమైన అవకాశాలు మెరుగుపడేందుకు ఇంకా మంచి అవకాశాలు ఉన్నాయి.

Also Read: Adah Sharma: ఎర్ర కలువ పువ్వుల కవ్విస్తోన్న ఆదాశర్మ.. చూపుతోనే మతిపోగొడుతున్న ముద్దుగుమ్మ..

Chinni Trailer: వైలెంట్ పాత్రలో అదరగొట్టేసిన కీర్తి సురేష్.. ఆకట్టుకుంటున్న చిన్ని ట్రైలర్..

RBI Investment: ఆర్బీఐ వద్ద రిస్క్ లేకుండా ఇలా పెట్టుబడి పెట్టండి.. బంపర్ ఆదాయం కూడా..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu