RBI Investment: ఆర్బీఐ వద్ద రిస్క్ లేకుండా ఇలా పెట్టుబడి పెట్టండి.. బంపర్ ఆదాయం కూడా..

RBI Investment: మీరు రిస్క లేకుండా డబ్బును ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నారా? ఇలా సేఫ్ రిటర్న్ కావాలనుకునేవారికి రిజర్వు బ్యాంక్ నుంచి ఒక మంచి ఆఫర్ ఉంది. అదేమిటంటే..

RBI Investment: ఆర్బీఐ వద్ద రిస్క్ లేకుండా ఇలా పెట్టుబడి పెట్టండి.. బంపర్ ఆదాయం కూడా..
Rbi
Follow us
Ayyappa Mamidi

|

Updated on: Apr 26, 2022 | 3:56 PM

RBI Investment: మీరు రిస్క లేకుండా డబ్బును ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నారా? ఇలా సేఫ్ రిటర్న్ కావాలనుకునేవారికి రిజర్వు బ్యాంక్ నుంచి ఒక మంచి ఆఫర్ ఉంది. రిజర్వు బ్యాంక్ అందిస్తున్న దాని పేరు ఆర్‌బీఐ రిటైల్ డైరెక్ట్ స్కీమ్‌. ఇది దేశంలోని అందరికీ అందుబాటులో ఉంది. దీనిలో పెట్టుబడి పెట్టే వారికి బంపర్ రిటర్న్‌తో పాటు మీ డబ్బులకు పూర్తి భద్రత కూడా ఉంటుంది. ఈ స్కీమ్ కింద ఇన్వెస్టర్లు గవర్నమెంట్ సెక్యూరిటీల్లో తమ సొమ్మును ఇన్వెస్ట్ చేయవచ్చు. ఇలా చేయటం వల్ల సేఫ్ ఇన్వెస్ట్‌మెంట్‌తో పాటు ఆకర్షణీయమైన రాబడిని పొందొచ్చు. అకౌంట్ ఓపెనింగ్, మెనేజ్‌మెంట్‌కు ఎటువంటి అదనపు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం ఉండదు. అసలు ఈ స్కీమ్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

RBI రిటైల్ డైరెక్ట్ ఫెసిలిటీ:

ఈ ప్లాన్‌లో ఇన్వెస్టర్లు పలు రకాల ప్రయోజనాలను పొందవచ్చు. అలాగే అకౌంట్ ఓపెన్ చేయటం కోసం ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఆన్‌లైన్‌లోనే ఖాతా తెరిచే ప్రక్రియను పూర్తి చేయవచ్చు. రిటైల్ ఇన్వెస్టర్లు.. రిటైల్ డైరెక్ట్ గిల్ట్ అకౌంట్‌ను రిజర్వు బ్యాంక్ వద్ద ఓపెన్ చేయొచ్చు. గవర్నమెంట్ సెక్యూరిటీలను రిటైల్ ఇన్వెస్టర్లకు కూడా పెట్టుబడికోసం అందుబాటులో ఉంచేందుకే ఈ పథకాన్ని తెచ్చారు. అలాగే ఆన్‌లైన్ సేవలను కూడా అందుబాటులోకి తెచ్చారు. ఈ స్కీమ్ కింద సింగిల్ అకౌంట్ లేదా జాయింట్ అకౌంట్ ను తెరవవచ్చు. కానీ అందుకు అర్హత కలిగిన వారు మాత్రమే ఈ ఖాతాను తెరిచేందుకు అవకాశం ఉంటుంది.

ఎవరైనా ఈ స్కీమ్ కింద ప్రయోజనం పొందాలనుకుంటే.. వారు కచ్చితంగా బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్ కలిగి ఉండాలి. పాన్ నెంబర్, అవరసరమైన KYC డాక్యుమెంట్లు కావాల్సి వస్తుంది. వీటికి తోడు ఈ-మెయిల్ ఐడీ, మొబైల్ నెంబర్ వంటివి తప్పనిసరి. అప్పుడు మాత్రమే రిటైల్ డైరెక్ట్ ప్లాన్‌లో రిజిస్టర్ చేసుకోవడం వీలవుతుంది. మీరు ఆర్‌బీఐ వెబ్‌సైట్‌కు వెళ్లి ఈ అకౌంట్‌ను తెరవవచ్చు. ఆ తర్వాత సెక్యూరిటీస్ ట్రేడింగ్ చేయవచ్చు.

ఆన్‌లైన్‌లో ఖాతా తెరవండిలా..

వెబ్‌సైట్ ద్వారా మీరు ఆన్‌లైన్‌లో ఖాతాను ప్రారంభించవచ్చు. పేరు, పాన్ నెంబర్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడీ, అడ్రస్, బ్యాంక్ అకౌంట్ వంటి వివరాలు ఎంటర్ చేయాలి. తర్వాత మొబైల్ నెంబర్, ఈ-మెయిల్ ఐడీకి వచ్చే ఓటీపీలను ఎంటర్ చేయాలి. తర్వాత మీకు ట్రాకింగ్ నెంబర్ వస్తుంది. తర్వాత ఇన్వెస్టర్ KYC వివరాల వెరిఫికేషన్ ఉంటుంది. బ్యాంక్ అకౌంట్‌ను కూడా వెరిఫై చేసుకోవాలి. ఈ ప్రాసెస్ పూర్తి అయిన తర్వాత ఇన్వెస్టర్ పేరుపై ఆర్‌డీజీ అకౌంట్ క్రియేట్ అవుతుంది. తర్వాత ఈ-మెయిల్ ఐడీకి కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది. అకౌంట్ నెంబర్, లాగిన్ ఐడీ వివరాలు అందుతాయి. వీటి ద్వారా లాగిన్ అవ్వాలి. వడ్డీ లేదంటే మెచ్యూరిటీ డబ్బులు ఆర్‌డీజీ అకౌంట్‌తో లింక్ అయిన బ్యాంక్ ఖాతాలోనే నేరుగా జమ అవుతాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పర్సనల్ ఫైనాన్స్ కు సంబంధించిన ఆసక్తికరమైన వీడియోల వేదిక Money9 Telugu యూట్యూబ్ ఛానెల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవీ చదవండి..

Share Price: కంపెనీ టాప్ మేనేజ్‌మెంట్ మారితే షేర్లు పతనమోతాయా..? ఇన్వెస్టర్లు ఏమి చేయాలి..

Elon Musk: ఎలాన్ మస్క్ డబుల్ ధమాకా! ఒకే రోజు ఆకాశం.. భూమి రెండిటిపై సంచలన విజయాలు..