Nitin Gadkari: టెస్లాకు కేంద్ర మంత్రి గడ్కరీ ఆహ్వానం.. కానీ ఆ విషయంలో మాత్రం కండిషన్స్ అప్లై..
Nitin Gadkari: ట్విట్టర్ యాజమాన్యాన్ని తన దారిలోకి తెచ్చుకుని వ్యాపార ప్రపంచాన్ని టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురిచేశారు. ఈ తరుణంలో ఆయనకు భారత్ నుంచి కూడా బంపర్ ఆఫర్ వచ్చింది. అదేంటంటే..
Nitin Gadkari: ట్విట్టర్ యాజమాన్యాన్ని తన దారిలోకి తెచ్చుకుని వ్యాపార ప్రపంచాన్ని టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురిచేశారు. ఈ తరుణంలో ఆయనకు భారత్ నుంచి కూడా బంపర్ ఆఫర్ వచ్చింది. టెస్లా సంస్థ భారత్‌లో కార్లను తయారు చేసేందుకు స్వాగతిస్తున్నట్లు ఒక ప్రైవేటు సదస్సులో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ఎలాన్ మస్క్ టెస్లాను భారత్‌లో తయారు చేయాలనుకుంటే ఎలాంటి ఇబ్బంది లేదని అన్నారు. భారత్ వద్ద అన్ని సామర్థ్యాలు ఉన్నాయని, అలాగే సాంకేతికత కూడా అందుబాటులో ఉందని.. వీటి వినియోగంతో టెస్లా ఖర్చును తగ్గించుకోవచ్చని అన్నారు.
#WATCH If Elon Musk is ready to manufacture in India, we’ve all competencies & technology. Our request to him is to manufacture in India. But suppose he wants to manufacture in China & sell in India, it cannot be a good proposition: Union Min Nitin Gadkari at a pvt event, today pic.twitter.com/t4UkjkOJio
— ANI (@ANI) April 26, 2022
మేడ్-ఇన్-చైనా కార్లకు నో ఎంట్రీ..
టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్‌లో పర్యటించాల్సిందిగా గడ్కరీ ఆహ్వానించారు. మస్క్ భారత్‌కు వచ్చి స్థానికంగా తయారీని ప్రారంభించాలని కేంద్ర మంత్రి అభ్యర్థించారు. భారత్ ప్రపంచంలోనే అతి పెద్ద మార్కెట్ అని.. ఇక్కడ పోర్టులు అందుబాటులో ఉన్నాయని అన్నారు. టెస్లా కార్లను భారత్ నుంచి కూడా ఇతర దేశాలకు ఎగుమతి చేయవచ్చని సూచించారు. ‘మేడ్ ఇన్ చైనా’ పేరుతో టెస్లా కార్లతో భారతదేశంలోకి ప్రవేశించే అవకాశాన్ని తోసిపుచ్చారు. మస్క్ కు భారత్ లో స్వాగతం లభిస్తుంది, కానీ.. చైనాలో తయారు చేసిన టెస్లా కార్లను ఇక్కడ విక్రయించాలనుకోవటం.. దేశ ప్రయోజనాలకు మంచిది కాదని వ్యాఖ్యానించారు. టెస్లా తన తయారీని దేశీయంగా చేసి విక్రయించాలని ఈ సందర్భంగా గడ్కరీ సూచించారు.
టెస్లా ప్రతిపాదనకు కేంద్రం నో..
ప్రపంచం కుబేరుడు ఎలాన్ మస్క్‌కి చెందిన ఎలక్ట్రిక్ కార్ కంపెనీ టెస్లా చాలా కాలంగా భారత మార్కెట్లోకి అరంగ్రేట్రం చేయాలని ఎదురుచూస్తోంది. దీని కోసం కంపెనీ భారత ప్రభుత్వం నుంచి పన్ను మినహాయింపును కోరుతోంది. టెస్లా పన్ను మినహాయింపు డిమాండ్‌ను భారత ప్రభుత్వం అనేక సార్లు తిరస్కరించింది. ఆయన కోరికను నెరవేర్చలేమని స్పష్టం చేసింది. ఎందుకంటే మస్క్ తన కార్లను చైనాలో తయారు చేసి భారత్ లో అమ్మాలనుకుంటున్నారు. దేశంలో ప్రస్తుతం అమలులో ఉన్న పన్ను చట్టాల ప్రకారం దిగుమతి చేసుకునే విదేశీ కార్లకు భారీ పన్నులు ఉన్నాయి. అందు కోసమే టెస్లా కంపెనీ పన్ను మినహాయింపు కోరుతోంది. కేంద్రం మాత్రం దిగుమతికి బదులు స్థానికంగానే ఉత్పత్తి చేయాలని సూచిస్తోంది.
వాహన దిగుమతులపై టాక్స్ ఎంత..
టెస్లా ప్రస్తుతం అమెరికాతో పాటు జర్మనీ, చైనాలో తన వాహనాలను ఉత్పత్తి చేస్తోంది. కంపెనీ చైనా ఫ్యాక్టరీ నుంచి ఆసియా, యూరప్ మార్కెట్లకు దిగుమతి చేసుకుంటోంది. మేడ్ ఇన్ చైనా వాహనాలను భారత్‌లో డంప్ చేయకుండా టెస్లా ఇక్కడే ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గతంలోనూ పలు సందర్భాల్లో తేల్చి చెప్పారు. ఎలక్ట్రిక్ వాహనాల దిగుమతిపై భారత ప్రభుత్వం ప్రస్తుతం 100 శాతం సుంకాన్ని విధిస్తోంది. దీనివల్ల వాటి ధర రెండింతలవుతుంది. మరోవైపు ఎలక్ట్రిక్ వాహనాల విడిభాగాల దిగుమతిపై ప్రభుత్వం 15 నుంచి 30 శాతం టాక్స్ వసూలు చేస్తోంది. ఎక్కువ దిగుమతి పన్ను వెనుక ఉద్ధేశ్యం ఏమిటంటే కంపెనీలు దేశంలో ఉత్పత్తి కార్యకలాపాలను నిర్వహించేలా చేసి ప్రజలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను మెరుగుపరచటమే. దేశ ప్రయోజనాల దృష్ట్యా
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
ఇవీ చదవండి..
RBI Investment: ఆర్బీఐ వద్ద రిస్క్ లేకుండా ఇలా పెట్టుబడి పెట్టండి.. బంపర్ ఆదాయం కూడా..
Share Price: కంపెనీ టాప్ మేనేజ్‌మెంట్ మారితే షేర్లు పతనమోతాయా..? ఇన్వెస్టర్లు ఏమి చేయాలి..