AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bank Holidays: ఖాతాదారులకు అలర్ట్‌.. మేలో బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవులంటే..

మేలో బ్యాంకు పనులు ఉన్నవారు.. బ్యాంకు సెలవుల గురించి తెలుసుకోవాలి.. ఎందుకంటే వారు సెసవులను బట్టి పనులను నిర్ణయించుకుంటారు...

Bank Holidays: ఖాతాదారులకు అలర్ట్‌.. మేలో బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవులంటే..
Banks
Srinivas Chekkilla
|

Updated on: Apr 27, 2022 | 7:00 AM

Share

మే(May)లో బ్యాంకు పనులు ఉన్నవారు.. బ్యాంకు(Bank) సెలవుల గురించి తెలుసుకోవాలి.. ఎందుకంటే వారు సెసవులను బట్టి పనులను నిర్ణయించుకుంటారు.  రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) విడుదల చేసిన సెలవుల జాబితా ప్రకారం, వారాంతాల్లో సహా మేలో మొత్తం 11 రోజులు బ్యాంకులు మూసివేయనున్నారు. వీటిలో ఆదివారం, రెండో, నాల్గవ శనివారాలతో పాటు పండుగలలో నాలుగు సెలవులు ఉన్నాయి. అయితే సెలవు దినాల్లో కూడా ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలు పనిచేస్తాయని గుర్తుంచుకోవాలి. నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్, నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్, రియల్ టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్ హాలిడే మరియు బ్యాంక్‌ల క్లోజింగ్ అకౌంట్స్ కింద సెలవుల జాబితాను జాతీయ, ప్రాంతీయంగా RBI వర్గీకరిస్తుంది.

అనేక సెలవులు ప్రాంతాలకు నిర్దిష్టంగా ఉంటాయి. ఇది రాష్ట్రాన్ని బట్టి, బ్యాంకును బట్టి మారవచ్చు. ఈద్-ఉల్-ఫితర్ సందర్భంగా వచ్చే నెలలో రెండు దీర్ఘ వారాంతాల్లో – బ్యాంకులు మూడు రోజుల పాటు మూతపడతాయి. మరి బ్యాంకుల సెలవు రోజు ఎప్పుడు చూద్దాం..

మే 1: ఆదివారం, మేడే మే 2: సోమవారం, మహర్షి పరుశురామ జయంతి (కొన్ని రాష్ట్రాల్లో సెలవు) మే 3: మంగళవారం, ఈద్ ఉల్ ఫితర్, బసవ జయంతి,( కర్ణాటక) మే 4: బుధవారం, ఈద్ ఉల్ ఫితర్( తెలంగాణ) మే 8: ఆదివారం మే 9: సోమవారం, రవీంద్ర నాధ్ ఠాగూర్ జన్మదినం (పశ్చిమ బెంగాల్, కలకత్తా, త్రిపుర) మే 14: రెండో శనివారం మే 15: ఆదివారం మే 16: సోమవారం, బుద్ధ పూర్ణిమ, బ్యాంకు సెలవు మే 22: ఆదివారం మే 24: మంగళ వారం, ఖాజీ నజ్రుల్ ఇస్మాల్ పుట్టిన రోజు (సిక్కిం) మే 28: నాలుగో శనివారం, అన్ని చోట్ల సెలవు మే 29: ఆదివారం

మరిన్ని బిజినెస్‌ వార్తలకు ఇక్కడ క్లిక్ చేయండి.

Read Also.. Stock Market: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు.. సెన్సెక్స్ 776, నిఫ్టీ 246 పాయింట్లు అప్..