Aadhaar Card: మీ ఆధార్‌ కార్డు విషయంలో ఏదైనా మోసం జరిగిందా..? సింపుల్‌ ఇలా తెలుసుకోండి

Aadhaar Card: ఆధార్‌ కార్డు అనేది నేటి కాలంలో ఎంతో ముఖ్యమైనది. ఇది లేనిది ఏ పనులు జరగని పరిస్థితి ఉంది. ఇప్పుడు పెద్దలకే కాకుండా పిల్లలకు కూడా ఆధార్ కార్డు ముఖ్యమైపోయింది...

Aadhaar Card:  మీ ఆధార్‌ కార్డు విషయంలో ఏదైనా మోసం జరిగిందా..? సింపుల్‌ ఇలా తెలుసుకోండి
Follow us
Subhash Goud

|

Updated on: Apr 27, 2022 | 7:16 AM

Aadhaar Card: ఆధార్‌ కార్డు అనేది నేటి కాలంలో ఎంతో ముఖ్యమైనది. ఇది లేనిది ఏ పనులు జరగని పరిస్థితి ఉంది. ఇప్పుడు పెద్దలకే కాకుండా పిల్లలకు కూడా ఆధార్ కార్డు ముఖ్యమైపోయింది. మీ బిడ్డకు ఆధార్ కార్డు లేకపోతే, పాఠశాలలో అడ్మిషన్ సమయంలో అనేక సమస్యలు తలెత్తుతాయి. ఇది కాకుండా మీ పిల్లలు ఆధార్ లేకుండా ఏ ప్రభుత్వ పథకాన్ని ఉపయోగించలేరు. ఆధార్‌కు ఉన్న ప్రాముఖ్యత దృష్ట్యా, దాని దుర్వినియోగం ప్రమాదం కూడా పెరుగుతుంది. కానీ ఆధార్‌తో ఉన్న ఒక ఉత్తమమైన విషయం ఏమిటంటే మీరు దానిని ఎప్పుడు, ఎక్కడ ఉపయోగించారు అనే సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా తమ ఆధార్ కార్డును దుర్వినియోగం చేస్తారేమోనని చాలా మంది భయపడుతున్నారు. మీకు ఆధార్ కార్డ్ భద్రత, దుర్వినియోగం గురించి కూడా ఆందోళనలు ఉంటే మీరు ఆధార్ వెబ్‌సైట్‌ని సందర్శించడం ద్వారా గత 6 నెలల్లో ఆధార్‌ కార్డును ఎక్కడెక్కడ వినియోగించారనే విషయాన్ని తెలుసుకోవచ్చు. UIDAI వెబ్‌సైట్‌లో మీ ఆధార్ వినియోగం ఎప్పుడు, ఎక్కడ ఉపయోగించబడింది అనే పూర్తి వివరాలు అందుబాటులో ఉంటాయి.

మన ఆధార్‌ కార్డును ఇతర వ్యక్తులు నకిలీ ఆధార్‌ కార్డును సృష్టించి వాడుకుంటున్నారు. ఇలాంటి మోసాలు కూడా ఇప్పటి వరకు పోలీసులు ఎన్నో బయట పెట్టారు. ఒకవేల మీ ఆధార్ కార్డు ఎవరైన వ్యక్తుల చేతుల్లోకి వెళ్తే ఇక అంతే సంగతులు. అందుకే మన ఆధార్‌ కార్డును ఎవరైనా వాడుతున్నారా?, వారు మన కార్డును ఎక్కడైనా ఉపయోగించారా..? అనే విషయాన్ని తెలుసుకునేందుకు యూఐడీఏఐ (UIDAI) అవకాశం కల్పిస్తోంది. కొన్ని మార్గాలను ఉపయోగించడం ద్వారా పూర్తి వివరాలను తెలుసుకునే వెసులుబాటు కల్పించింది యూఐడీఏఐ.

☛ ముందుగా ఆధార్ అధికారిక యూఐడీఏఐ పోర్టల్ ఓపెన్ చేయండి వెళ్లాలి.

ఇవి కూడా చదవండి

☛ తర్వాత మై ఆధార్‌ సెక్షన్‌లోకి వెళ్లి ఆధార్‌ సర్వీసెస్‌ను ఎంపిక చేసుకోవాలి.

☛ ఇక ఆధార్‌ సర్వీస్‌ సెక్షన్‌లో 8వ వరుసలో కనిపించే ఆధార్‌ అథెంటికేషన్‌ హిస్టరీపై క్లిక్‌ చేయాలి.

☛ ఇప్పుడు ఆధార్‌ నెంబర్‌, క్యాప్చా ఎంటర్‌ చేసి సెండ్‌ ఓటీపీపై క్లిక్‌ చేయాలి.

☛ ఎప్పటి నుంచి హిస్టరీ కావాలో ఎంచుకుని తేదీ, నెల, సంత్సరం ఎంటర్‌ చేయాలి.

☛ ఇక్కడ ఆరు నెలలకు సంబంధించిన సమాచారం మాత్రమే వస్తుంది.

☛ ఆ తర్వాత మీ ఆధార్‌కు లింక్‌ అయి ఉన్న ఫోన్‌ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. తర్వాత దానిని ఎంటర్‌ చేయాలి.

☛ ఇప్పుడు మీరు ఏ సమయంలో, ఎక్కడ ఉపయోగించారో పూర్తి వివరాలు తెలిసిపోతాయి.

☛ ఈ వివరాలన్నీ తెలుసుకోవాలంటే కచ్చితంగా మీ మొబైల్ నెంబర్, ఆధార్ కార్డుకు లింకు అయి ఉండాలి. దీని తర్వాత, మీ ఆధార్ కార్డ్ ఎప్పుడు, ఎక్కడ ఉపయోగించబడింది అనే సమాచారం మీ ముందుకు వస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

PM Kisan: రైతులకు మోడీ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌.. పీఎం కిసాన్‌ వెబ్‌సైట్‌లో మళ్లీ ఆ ఆప్షన్‌ అందుబాటులోకి తెచ్చిన కేంద్రం..!

martphone Reset: మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను విక్రయించే ముందు మీ వ్యక్తిగత డేటా మొత్తాన్ని ఇలా తొలగించండి..!

చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు..? సంతకం కోసం బ్యాట్‌ వదిలిన అభిమాని..
ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు..? సంతకం కోసం బ్యాట్‌ వదిలిన అభిమాని..
అభిమానులతో సెల్ఫీలు.. కట్‌చేస్తే.. ఆసీస్ సెన్సేషన్‌‌కు బిగ్ షాక్?
అభిమానులతో సెల్ఫీలు.. కట్‌చేస్తే.. ఆసీస్ సెన్సేషన్‌‌కు బిగ్ షాక్?
కుంభ మేళాలో వీఐపీల కోసం సర్క్యూట్ హౌస్ ఏర్పాటు సౌకర్యాలు ఏమిటంటే
కుంభ మేళాలో వీఐపీల కోసం సర్క్యూట్ హౌస్ ఏర్పాటు సౌకర్యాలు ఏమిటంటే