PM Kisan: పీఎం కిసాన్‌ స్కీమ్‌లో కేంద్రం కీలక నిర్ణయం.. నిబంధనలు కఠినతరం.. రైతులు ఇలా చేస్తే డబ్బులు అందవు

PM Kisan: మోడీ సర్కార్‌ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పేదల కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టింది. సామాన్యుల కోసం పలు రకాల స్కీమ్స్‌ను ప్రవేశపెట్టింది. అందులో అన్నదాతల..

PM Kisan: పీఎం కిసాన్‌ స్కీమ్‌లో కేంద్రం కీలక నిర్ణయం.. నిబంధనలు కఠినతరం.. రైతులు ఇలా చేస్తే డబ్బులు అందవు
Pm Kisan
Follow us

|

Updated on: Apr 27, 2022 | 7:50 AM

PM Kisan: మోడీ సర్కార్‌ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పేదల కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టింది. సామాన్యుల కోసం పలు రకాల స్కీమ్స్‌ను ప్రవేశపెట్టింది. అందులో అన్నదాతల కోసం ప్రత్యేకంగా కొన్ని పథకాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. అందులో ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం (Pradhan Mantri Kisan Samman Nidhi Scheme) ఒకటి. ఈ స్కీమ్ ద్వారా రైతులకు ఆర్థికంగా భరోసా కల్పిస్తోంది. పీఎం కిసాన్ పథకం ద్వారా రైతుల ఖాతాల్లోకి (Farmer Accounts) నేరుగా రూ.6 వేలను జమ చేయనుంది. అయితే ఈ డబ్బులను కేంద్రం ఒకేసారి కాకుండా విడుదల చేయకుండా విడతల వారిగా రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. ప్రతి విడతలోనూ రూ. 2 వేలను నేరుగా అన్నదాతల బ్యాంక్ ఖాతాల్లోకి పంపిస్తుంది. ఇప్పటివరకు 10 విడతల వారిగా నగదు జమ చేసింది కేంద్రం. తాజాగా రైతులకు 11విడత  (11 Installment)సాయం అందనుంది. రైతులకు ప్రత్యక్ష ప్రయోజనాలను అందించే ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం 11వ విడత ముందు కేంద్రం నిబంధనలు కఠినతరం చేసింది. ఏప్రిల్ 1, 2022 నుండి అన్ని చెల్లింపులు ఆధార్ కార్డ్ ఆధారంగానే చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అంటే ఆధార్ లేకుండా మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ డబ్బు అందదు. ఈ ముఖ్యమైన పథకంలో మోసాలు జరగకుండా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. అంతే కాదు లబ్ధిదారుల జాబితాను గ్రామసభలో ఆడిట్ చేయాలని కూడా ఆదేశాలు జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం.తర్వాత లబ్ధిదారుల జాబితాను గ్రామ పంచాయతీల్లో ప్రత్యేకంగా ప్రదర్శిస్తారు .

అసలే గ్రామాల్లో ఎవరు అర్హులో, ఎవరు అనర్హులో ఎవ్వరికి తెలియని పరిస్థితి నెలకొంది. అందువల్ల ఈ ఆడిట్‌లో నకిలీ లబ్ధిదారులను సులభంగా తెలుసుకోవచ్చు. పీఎం కిసాన్ పథకం కింద రైతులకు సంవత్సరానికి మూడు విడతలుగా మొత్తం రూ.6000 అందజేస్తారు. ఇప్పుడు11వ విడత రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కానున్నాయి. ఇందులో 10 కోట్ల మంది రైతులకు ఏకకాలంలో 20 వేల కోట్ల రూపాయలు విడుదల చేయనున్నారు. డిసెంబర్ 2021 నుండి మార్చి 2022 వరకు 10,95,47,469 మంది రైతులకు రూ. 2000 చొప్పున బదిలీ చేసింది. పథకం ప్రారంభమైనప్పటి నుంచి రైతులకు మొత్తం రూ.1.81 లక్షల కోట్ల మేర ప్రయోజనం చేకూరింది.

మనీ రీఫండ్ ఆప్షన్ ..

ఎట్టి పరిస్థితుల్లోనూ అనర్హులకు నగదు బదిలీ చేయకూడదన్న ప్రభుత్వ ఉద్దేశం ఈసారి స్పష్టంగా ఉంది. ఇందుకోసం ఆధార్ కార్డు ఆధారిత చెల్లింపుతో పాటు మరికొన్ని చర్యలు కూడా చేపట్టింది. PM కిసాన్ స్కీమ్ వెబ్‌సైట్‌లోని చట్టవిరుద్ధంగా పథకాన్ని సద్వినియోగం చేసుకున్న రైతులకు డబ్బును తిరిగి ఇచ్చే ఆప్షన్‌ కల్పించింది కేంద్ర ప్రభుత్వం. బీహార్ ప్రభుత్వం ఇప్పటికే ప్రత్యేక పోర్టల్‌ను రూపొందించింది.

అంతే కాకుండా నిజమైన రైతులకు లబ్ధి చేకూర్చేందుకు పథకం సక్రమంగా అమలు చేసేందుకు నిధులు దుర్వినియోగం కాకుండా ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. నిబంధనల ప్రకారం మేయర్, ఎంపీ, ఎమ్మెల్యే, మంత్రి, మాజీ మంత్రి, ప్రభుత్వ అధికారులు, ఆదాయపు పన్ను చెల్లింపుదారులు ఈ పథకం ప్రయోజనం పొందరు. సుమారు 4000 కోట్లకు పైగా అనర్హుల ఖాతాల్లోకి చేరింది. దీనిపై కేంద్రం చర్యలు చేపట్టింది. కాగా, ఈ పథకం కింద లబ్దిపొందేవారు ఆధార్‌ కార్డుతో ఈ స్కీమ్‌కు కేవైసీ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ గడువు మే నెల చివరి వరకు ఉంది. కిసాన్‌ పథకానికి ఆధార్‌కార్డును అందించి కేవైసీ చేసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే డబ్బులు నిలిచిపోతాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

Aadhaar Card: మీ ఆధార్‌ కార్డు విషయంలో ఏదైనా మోసం జరిగిందా..? సింపుల్‌ ఇలా తెలుసుకోండి

Cibil Score: మీరు ఈ తప్పులు చేస్తున్నారా..? మీ సిబిల్‌ స్కోర్‌ పడిపోవడం ఖాయం..!

మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్
చిక్కుల్లో విజయ్‌ దళపతి.. స్టార్ హీరోపై సామాన్యుడి కేస్.!
చిక్కుల్లో విజయ్‌ దళపతి.. స్టార్ హీరోపై సామాన్యుడి కేస్.!
పగోడికి కూడా రాకూడదు ఈ కష్టం.! మీర్జాపూర్’ నటుడి ఇంట విషాదం.!
పగోడికి కూడా రాకూడదు ఈ కష్టం.! మీర్జాపూర్’ నటుడి ఇంట విషాదం.!
గుడ్ న్యూస్ చెప్పిన చిరంజీవి కూతురు శ్రీజ కొణిదెల.! వీడియో.
గుడ్ న్యూస్ చెప్పిన చిరంజీవి కూతురు శ్రీజ కొణిదెల.! వీడియో.
మళ్లీ కెలుక్కుంటాను అంటే రా.! డైరెక్టర్ హరీష్ శంకర్ బిగ్ పంచ్.
మళ్లీ కెలుక్కుంటాను అంటే రా.! డైరెక్టర్ హరీష్ శంకర్ బిగ్ పంచ్.
చూస్తుంటే గుండె బరువుగా, నిండుగా ఉంది.. నాని ఎమోషనల్ పోస్ట్.!
చూస్తుంటే గుండె బరువుగా, నిండుగా ఉంది.. నాని ఎమోషనల్ పోస్ట్.!
యాక్షన్ కింగ్ కూతురు మామూలుగా లేదుగా.. హీరోయిన్స్ ను మించే అందం
యాక్షన్ కింగ్ కూతురు మామూలుగా లేదుగా.. హీరోయిన్స్ ను మించే అందం