PM Kisan: రైతులకు మోడీ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌.. పీఎం కిసాన్‌ వెబ్‌సైట్‌లో మళ్లీ ఆ ఆప్షన్‌ అందుబాటులోకి తెచ్చిన కేంద్రం..!

PM Kisan: కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెడుతుంది. ఇక రైతులకు కేంద్రం శుభవార్త చెప్పింది. మళ్లీ ప్రధాన్‌ మంత్రి కిసాన్‌ సమ్మాన్ నిధి యోజన ..

PM Kisan: రైతులకు మోడీ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌.. పీఎం కిసాన్‌ వెబ్‌సైట్‌లో మళ్లీ ఆ ఆప్షన్‌ అందుబాటులోకి తెచ్చిన కేంద్రం..!
Follow us
Subhash Goud

|

Updated on: Apr 26, 2022 | 12:25 PM

PM Kisan: కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెడుతుంది. ఇక రైతులకు కేంద్రం శుభవార్త చెప్పింది. మళ్లీ ప్రధాన్‌ మంత్రి కిసాన్‌ సమ్మాన్ నిధి యోజన (PM Kisan Samman Nidhi Yojana) వెబ్‌సైట్‌లో ఈకేవైసీ ఆప్షన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీంతో రైతులు ఎక్కడికి వెళ్లుకుండా ఇంట్లోనే ఉండి పథకానికి సంబంధించి కేవైసీని పూర్తి చేసుకోవచ్చు. అయితే కేంద్ర సర్కార్‌ కొన్ని రోజులుగా ఈ సర్వీసును తొలగించిందింది. దీంతో రైతులు ఇతర సర్వీసు సెంటర్లకు వెళ్లి కేవైసీ పూర్తి చేసుకోవాల్సిన పరిస్థితి ఉండేది. అయితే అక్కడ కేవైసీ చేసుకునేందుకు డబ్బులు చెల్లించాల్సి వచ్చేది. ఇప్పుడు మళ్లీ కేంద్ర ప్రభుత్వం ఈ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇంట్లో ఉండి మొబైల్‌ నుంచి కూడా ఇకేవైసీ పూర్తి చేసుకోవచ్చు.

మే 31తో గడువు పూర్తి:

ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద లబ్ధి పొందుతున్న రైతులు అందరూ తప్పకుండా ఇకేవైసీ పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. ఈ గడువు మే 31 వరకు ఉంది. ఈలోగా రైతులు కేవైసీ చేసుకోకపోతే డబ్బులు అందవు. గడువులోగా పూర్తి చేసుకోవడం మంచిది.

ఇకేవైసీ చేయండిలా..

ఇకేవైసీ చేసే రైతులు ముందుగా పీఎం కిసాన్‌ వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. అక్కడ కుడివైపున ఫార్మర్స్‌ కార్నర్‌ అనే ఆప్షన్‌ కనిపిస్తుంటుంది. ఇందులో పైనే ఇకేవైసీ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీనిపై క్లిక్‌ చేయగా, కొత్త విండో ఓపెన్‌ అవుతుంది. తర్వాత రైతులు ఆధార్‌ నమోదు చేసిన తర్వాత సెర్చ్‌ చేయాలి. అక్కడ ఆధార్‌ రిజిస్టర్డ్‌ మొబైల్‌ నంబర్‌ను ఎంటర్‌ చేయాలి. తర్వాత మొబైల్‌ నంబర్‌కు వచ్చిన ఓటీపీ (OTP)ని ఎంటర్‌ చేసిన తర్వాత ఇకేవైసీ పూర్తవుతుంది. కాగా, రైతులకు ఇప్పుడు 11వ విడత డబ్బులు రావాల్సి ఉంది. వచ్చే నెలలో తొలి వారంలో రైతుల అకౌంట్లో జమ అయ్యే అవకాశం ఉంది. అందుకే ఇకేవైసీ చేయని రైతులు త్వరగా చేసుకోవడం బెటర్‌. రైతులకు ఆసరాగా ఉండేందుకు కేంద్రం ప్రతి ఏడాది రూ.6వేలు అందిస్తోంది. రూ.2000 చొప్పున మూడు విడతల్లో రైతుల బ్యాంకు అకౌంట్లో జమ చేస్తుంది కేంద్రం.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

UPI Payments: యూపీఐ సర్వర్లు డౌన్.. ఆగిన లావాదేవీలు.. ఇబ్బందులు పడ్డ వినియోగదారులు

Apple iPhone 12: యాపిల్‌ ఐఫోన్‌ 12పై భారీ తగ్గింపు.. ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌లో ధర ఎంత తగ్గిందో చూడండి..!

అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..
పాన్ కార్డు 2.0 అంటే ఏంటి? పాత కార్డు పని చేయదా? అసలు నిజం ఇదే
పాన్ కార్డు 2.0 అంటే ఏంటి? పాత కార్డు పని చేయదా? అసలు నిజం ఇదే
బ్యాంకు లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే లోన్ భారం వారిదే..!
బ్యాంకు లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే లోన్ భారం వారిదే..!