- Telugu News Photo Gallery Iphone 12 price drop flipkart and amazon know offers discount and exchange value
Apple iPhone 12: యాపిల్ ఐఫోన్ 12పై భారీ తగ్గింపు.. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లో ధర ఎంత తగ్గిందో చూడండి..!
Apple iPhone 12: ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్‌ల ట్రెండ్ కొనసాగుతోంది. టెక్నాలజీని ఉపయోగించుకుని అద్భుతమైన ఫీచర్స్‌తో రకరకాల స్మార్ట్‌ఫోన్లు విడుదల అవుతున్నాయి. ప్రస్తుత ధర ఐఫోన్ 12 ధర ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 56999, అమెజాన్‌లో రూ. 54900 ఉంది..
Updated on: Apr 25, 2022 | 12:03 PM

Apple iPhone 12: ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్‌ల ట్రెండ్ కొనసాగుతోంది. టెక్నాలజీని ఉపయోగించుకుని అద్భుతమైన ఫీచర్స్‌తో రకరకాల స్మార్ట్‌ఫోన్లు విడుదల అవుతున్నాయి. ప్రస్తుత ధర ఐఫోన్ 12 ధర ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 56999, అమెజాన్‌లో రూ. 54900 ఉంది. ఈ ధరలో 64 GB స్టోరేజ్, బ్లూ వేరియంట్ అందుబాటులో ఉన్నాయి. ఐఫోన్ 12 అనేక తాజా ఫీచర్లు, కొత్త డిజైన్లలో వస్తుంది.

ఈ ఫోన్‌లో సూపర్ రెటినా XDR డిస్‌ప్లే, డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇది 12-మెగాపిక్సెల్ కెమెరా. అలాగే ఇందులో 12 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. కంపెనీ ఈ ఫోన్‌లో A14 బయోనిక్ చిప్‌సెట్‌ని ఉపయోగించింది.

Flipkart iPhone 12 ధరను 13 శాతం తగ్గించింది. ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ. 65,900 నుండి రూ. 56,999కి తగ్గింది. ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ అమెజాన్‌లో 17 శాతం తగ్గింపు తర్వాత, ఐఫోన్ 12 ధర రూ.65,900 నుండి రూ54,900కి తగ్గించబడింది.

ఫ్లిప్‌కార్ట్‌లో Apple iPhone 12ని కొనుగోలు చేసిన తర్వాత, మీరు పాత స్మార్ట్‌ఫోన్‌ను కూడా విక్రయించవచ్చు.దీని కింద పాత స్మార్ట్‌ఫోన్‌ను రూ. 13 వేల వరకు తగ్గించవచ్చు. అయితే మీ పాత ఫోన్ స్థితి, బ్రాండ్‌ను బట్టి ధర నిర్ణయిస్తుంది.





























