Hanuman Chalisa Row: హనుమాన్ చాలీసాపై రాజకీయ రచ్చ.. నవనీత్ దంపతులకు హైకోర్టులోనూ షాక్..
Maharashtra Hanuman Chalisa Row: మహారాష్ట్రలో పవర్‌ఫుల్ పొలిటికల్ కపుల్‌గా రవి రాణా, నవనీత్ కౌర్‌లకు పేరుంది. నవనీత్ రాణా దంపతులు ఓ ఛాలెంజ్ చేసి వార్తల్లోకెక్కారు. మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాక్రే నివాసం ముందు
Maharashtra Hanuman Chalisa Row: మహారాష్ట్రలో పవర్‌ఫుల్ పొలిటికల్ కపుల్‌గా రవి రాణా, నవనీత్ కౌర్‌లకు పేరుంది. నవనీత్ రాణా దంపతులు ఓ ఛాలెంజ్ చేసి వార్తల్లోకెక్కారు. మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాక్రే నివాసం ముందు హనుమాన్ చాలీసా పఠిస్తామన్నది వారు విసిరిన సవాల్. ఇదే మహా రచ్చకు కారణమైంది. నవనీత్ (Navneet Kaur) రాణా దంపతులను ఇంటి నుంచి బయటకురాకుండా శివసేన కార్యకర్తలు ముట్టడించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించ వద్దంటూ నోటీసులు జారీ చేసిన ముంబై పోలీసులు నవనీత్ రాణా దంపతులను అరెస్ట్ చేశారు. సమస్యల నుంచి మహారాష్ట్ర నుంచి బయటపడేసి, రాష్ట్రంలో శాంతి నెలకొనేలా చూసేందుకు సీఎం ఉద్ధవ్ హనుమాన్ చాలీసాను పఠించాలని నవనీత్ రాణా దంపతుల డిమాండ్. కానీ తమ డిమాండ్‌ను సీఎం తిరస్కరించారు కావున.. ఆయన ఇంటి ముందు హనుమాన్ చాలీసా పఠిస్తామని పంతం పట్టారు ఆ కపుల్. హైడ్రామా మధ్య వారి అరెస్ట్ జరిగింది. మతవిద్వేషాలను రెచ్చగొట్టారని వారిపై కేసు నమోదయ్యింది. తమపై దాఖలైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టేయాలన్న నవనీత్ దంపతులు బాంబే హైకోర్టును ఆశ్రయించారు. అయితే వారి పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. వారిద్దరి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. గౌరవప్రదమైన పదవుల్లో ఉన్నవాళ్లు బాధ్యతాయుతంగా ఉండాలని చీవాట్లు పెట్టింది. దీంతో వారు హైకోర్టును ఆశ్రయించారు.
ఈ క్రమంలో సీఎం ఇంటి ముందు హనుమాన్ చాలీసా పఠిస్తామని సవాల్ విసరడం చాలా తప్పని కూడా హైకోర్టు వ్యాఖ్యానించింది. మరోవైపు పోలీసు స్టేషన్‌లో తనను వేధించారని లోక్‌సభ స్పీకర్‌కు ఓం బిర్లాకు నవనీత్ కౌర్ లేఖ రాశారు. దీనిపై పార్లమెంట్ సెక్రటేరియట్ స్పందించింది. 24 గంటల్లో జవాబు చెప్పాలని మహారాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. హనుమాన్ చాలీసా వివాదంపై స్పందించారు సీఎం ఉద్దవ్. హిందుత్వ గురించి తమకు ఎవరి పాఠాలు అవసరం లేదన్నారు. హనుమాన్ చాలీసా పఠించాలంటే ఒక పద్దతి ఉంటుందన్నారు.
Also Read: