Tej Pratap Yadav: లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కొడుకు సంచలన నిర్ణయం.. RJDకి తేజ్ ప్రతాప్ రాజీనామా!
రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ)కి రాజీనామా చేస్తున్నట్లు ఆర్జేడీ నేత తేజ్ ప్రతాప్ యాదవ్ ప్రకటించారు. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు.. త్వరలో తన తండ్రిని కలుస్తానని, తన రాజీనామాను సమర్పిస్తానని చెప్పారు.
Tej Pratap Yadav Resign: రాష్ట్రీయ జనతాదళ్ (RJD)కి రాజీనామా చేస్తున్నట్లు ఆర్జేడీ నేత తేజ్ ప్రతాప్ యాదవ్ ప్రకటించారు. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు.. త్వరలో తన తండ్రిని కలుస్తానని, తన రాజీనామాను సమర్పిస్తానని చెప్పారు. పార్టీ కార్యకర్తలతో కలిసి గదిలో పార్టీ యువజన విభాగం నాయకుడిని బంధించి దాడి చేసి దుర్భాషలాడినట్లు ఆరోపణలు వచ్చాయి. హసన్‌పూర్ ఎమ్మెల్యే తేజ్ ప్రతాప్ యాదవ్ ట్వీట్ చేస్తూ.. “నేను మా నాన్నగారి అడుగుజాడల్లో నడిచాను. కార్మికులందరికీ గౌరవం, త్వరలో మా నాన్నను కలుసుకుని నా రాజీనామాను సమర్పిస్తాను” అని తెలిపారు.
ఏప్రిల్ 22 న జరిగిన ఇఫ్తార్ పార్టీలో తేజ్ ప్రతాప్ తనను మూసి ఉన్న గదిలో కొట్టాడని పార్టీ యువజన విభాగం పాట్నా మహానగర అధ్యక్షుడు రామ్‌రాజ్ యాదవ్ ఆరోపించారు. దూషణలు కూడా చేశాడు. అంతేకాదు, పార్టీని వీడాలని, లేదంటే పది రోజుల్లోగా నిన్ను కాల్చి చంపేస్తానని బెదిరించాడని పేర్కొన్నారు. దీంతో ఆగ్రహించిన ఆయన సోమవారం పార్టీ కార్యాలయానికి చేరుకుని యువజన కార్యకర్తలతో కలిసి రాజీనామా సమర్పించారు. ఈ విషయాన్ని వెంటనే పార్టీ పెద్ద నాయకులకు, ఆఫీస్ బేరర్లకు తెలియజేశాను.. చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని.. మూడు రోజులు గడిచినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఇప్పుడు రాజీనామా చేస్తున్నాను అని రాజీనామా చేసేందుకు వచ్చిన రాంరాజ్ తెలిపారు.
అయితే, తేజ్ ప్రతాప్ యాదవ్ ఈ మొత్తం విషయంలో తాను నిర్దోషి అని చెప్పాడు. రామ్‌రాజ్‌తో కలిసి ఉన్న ఫోటోను పంచుకుంటూ, ఆరోపణ నిరాధారమైనవి. రామ్‌రాజ్ భ్రమలో ఆరోపణలు చేస్తున్నాడు. ఇది ఇఫ్తార్ రోజు చిత్రం.” అని అన్నారు. అయితే, ప్రస్తుతం లాలూ యాదవ్ కుటుంబంలో పరిస్థితి అంతా బాగాలేదు. ఆయన పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. లాలూ యాదవ్ పెద్ద కుమారుడు అయిన తేజ్ ప్రతాప్ బీహార్‌లోని హసన్‌పూర్ ఎమ్మెల్యే. తన తండ్రి అడుగుజాడల్లో నడవడంపై ట్వీట్ చేశారు.
मैं अपने पिता के नक्शे कदम पर चलने का काम किया । सभी कार्यकर्ताओं को सम्मान दिया जल्द अपने पिता से मिलकर अपना इस्तीफा दूंगा ।@laluprasadrjd @RJDforIndia @yadavtejashwi @RabriDeviRJD @MisaBharti @Chiranjeev_INC
— Tej Pratap Yadav (@TejYadav14) April 25, 2022
Read Also… Governor vs Chief Minister: గవర్నర్ – ముఖ్యమంత్రుల మధ్య పెరుగుతున్న అగాధం!