AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RBI: బ్యాంకులకు షాకిస్తున్న ఆర్బీఐ.. ఈ బ్యాంకుకు రూ.1.12 కోట్ల జరిమానా.. ఎందుకో తెలుసా..?

RBI: భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా ( RBI ) ప్రభుత్వ యాజమాన్యంలోని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రపై 1.12 కోట్ల రూపాయల జరిమానా విధించింది. కేవైసీ (KYC)కి సంబంధించిన..

RBI: బ్యాంకులకు షాకిస్తున్న ఆర్బీఐ.. ఈ బ్యాంకుకు రూ.1.12 కోట్ల జరిమానా.. ఎందుకో తెలుసా..?
Subhash Goud
|

Updated on: Apr 26, 2022 | 8:11 AM

Share

RBI: భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా ( RBI ) ప్రభుత్వ యాజమాన్యంలోని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రపై 1.12 కోట్ల రూపాయల జరిమానా విధించింది. కేవైసీ (KYC)కి సంబంధించిన నిబంధనలతో సహా సెంట్రల్ బ్యాంక్ జారీ చేసిన సూచనలను పాటించనందుకు ఆర్బీఐ ఈ పెనాల్టీ (Penalty)ని విధించింది. ఆర్బీఐ జారీ చేసిన నిబంధనలలో నో యువర్ కస్టమర్ (కేవైసీ) నియమాలకు సంబంధించినవి కూడా ఉన్నాయి. సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో.. ప్రభుత్వ రంగ బ్యాంకుపై విచారణ జరిగిందని సెంట్రల్ బ్యాంక్ తెలిపింది. బ్యాంకు ద్వారా ప్రభుత్వ ఖాతాలో కస్టమ్ డ్యూటీ జమ కాకపోవడంపై విచారణ జరిగింది. ఈ చర్య రెగ్యులేటరీ సమ్మతిలో లోపాలపై ఆధారపడి ఉందని తెలిపింది.

రాజ్‌కోట్ నాగరిక్ సహకారి బ్యాంక్‌పై రూ.12 లక్షల జరిమానా:

ఇది కాకుండా, రాజ్‌కోట్ నాగ్రిక్ సహకారి బ్యాంక్‌పై సెంట్రల్ బ్యాంక్ రూ.12 లక్షల జరిమానా కూడా విధించింది. డిపాజిట్ల వడ్డీ రేటుపై సూచనలను పాటించనందుకు ఆర్బీఐ ఈ పెనాల్టీని విధించింది. దీనితో పాటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా హర్యానా స్టేట్ కో-ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ చండీగఢ్‌పై 25 లక్షల రూపాయల జరిమానా విధించింది. హౌసింగ్ ఫైనాన్స్‌పై ఆర్‌బిఐ సూచనలను ఉల్లంఘించినందున ఈ జరిమానా విధించింది.

కస్టమర్ ప్రొటెక్షన్ నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను ప్రభుత్వ రంగ రుణదాత సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాపై రూ. 36 లక్షల జరిమానా విధించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది.18 ఏప్రిల్ 2022న జారీ చేసిన ఆర్డర్‌లో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాపై 36 లక్షల రూపాయల ద్రవ్య జరిమానా విధించినట్లు భారతీయ రిజర్వ్ బ్యాంక్ అంటే RBI ఒక ప్రకటనలో తెలిపింది. అనధికారిక బ్యాంకింగ్ లావాదేవీలలో వినియోగదారుల రక్షణ- పరిమిత బాధ్యతపై నిర్దిష్ట సూచనలను పాటించనందుకు ఈ జరిమానా విధించింది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్, 1949లోని నిబంధనల ప్రకారం ఈ పెనాల్టీ విధించినట్లు రెగ్యులేటర్ తెలిపారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

PM Kisan: రైతులకు మోడీ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌.. పీఎం కిసాన్‌ వెబ్‌సైట్‌లో మళ్లీ ఆ ఆప్షన్‌ అందుబాటులోకి తెచ్చిన కేంద్రం..!

UPI Payments: యూపీఐ సర్వర్లు డౌన్.. ఆగిన లావాదేవీలు.. ఇబ్బందులు పడ్డ వినియోగదారులు

Follow Us
ఎయిర్ ఇండియా చేసిన పనికి వెనక్కి వచ్చిన విమానం!
ఎయిర్ ఇండియా చేసిన పనికి వెనక్కి వచ్చిన విమానం!
సిలిండర్‌ 14.2 కేజీలే ఎందుకు ఉంటుంది? 15 కేజీలు ఎందుకు ఉండదు?
సిలిండర్‌ 14.2 కేజీలే ఎందుకు ఉంటుంది? 15 కేజీలు ఎందుకు ఉండదు?
భారతదేశంలో ఎప్పటికీ ఫెయిల్యూర్ కాని 5 టాప్ బిజినెస్ ఐడియాలివే!
భారతదేశంలో ఎప్పటికీ ఫెయిల్యూర్ కాని 5 టాప్ బిజినెస్ ఐడియాలివే!
గ్లోబల్ సైజుకు తీసుకెళదామనుకున్న సినమాకు గుర్తింపు లేదా?
గ్లోబల్ సైజుకు తీసుకెళదామనుకున్న సినమాకు గుర్తింపు లేదా?
బ్యాడ్ కొలెస్ట్రాల్ కు చెక్.. గుండెపోటు రాకుండా 5 సూపర్ టిప్స్
బ్యాడ్ కొలెస్ట్రాల్ కు చెక్.. గుండెపోటు రాకుండా 5 సూపర్ టిప్స్
ఉగాది రోజున ఇల్లు శుభ్రం చేస్తుండగా ఘోరం..!
ఉగాది రోజున ఇల్లు శుభ్రం చేస్తుండగా ఘోరం..!
చాణక్యుని 4 సూత్రాలతో మీ రోజును మొదలుపెడితే జీవితంలో విజయం ఖాయం
చాణక్యుని 4 సూత్రాలతో మీ రోజును మొదలుపెడితే జీవితంలో విజయం ఖాయం
మండే ఎండల్లో మిమ్మల్ని చలచల్లగా ఉంచే సూపర్ డ్రింక్స్.. తాగేద్దామా
మండే ఎండల్లో మిమ్మల్ని చలచల్లగా ఉంచే సూపర్ డ్రింక్స్.. తాగేద్దామా
వాస్తు టిప్స్: తడి బట్టలు ఇంట్లో ఆరేస్తున్నారా..అదృష్టం పోయినట్లే
వాస్తు టిప్స్: తడి బట్టలు ఇంట్లో ఆరేస్తున్నారా..అదృష్టం పోయినట్లే
బాయ్స్ హాస్టల్‌లో ల్యాప్‌టాప్, మొబైల్స్ దొంగతనం!
బాయ్స్ హాస్టల్‌లో ల్యాప్‌టాప్, మొబైల్స్ దొంగతనం!