AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Share Price: కంపెనీ టాప్ మేనేజ్‌మెంట్ మారితే షేర్లు పతనమోతాయా..? ఇన్వెస్టర్లు ఏమి చేయాలి..

Share Price: ఈ రోజుల్లో చాలా మంది మార్కెట్లోకి కొత్త మదుపరులు(Investors) వస్తున్నారు. వారిలో చాలా మందికి మార్కెట్లపై, షేర్ల పనితీరుపై సరైన అవగాహన ఉండదు. అసలు కంపెనీలో మేనేజ్ మెంట్ మార్పును ఎలా పరిగించాలో తెలుసుకుందాం..

Share Price: కంపెనీ టాప్ మేనేజ్‌మెంట్ మారితే షేర్లు పతనమోతాయా..? ఇన్వెస్టర్లు ఏమి చేయాలి..
Share Vale
Ayyappa Mamidi
|

Updated on: Apr 26, 2022 | 3:23 PM

Share

Share Price: ఈ రోజుల్లో చాలా మంది మార్కెట్లోకి కొత్త మదుపరులు(Investors) వస్తున్నారు. వారిలో చాలా మందికి మార్కెట్లపై, షేర్ల పనితీరుపై సరైన అవగాహన ఉండదు. షేర్ విలువ తక్కువగా ఉందని, కొన్ని షేర్ల రేటు పడిపోతుందంటూ.. వాటికి అసలు కారణాలను తెలుసుకోకుండా పెట్టుబడులు పెడుతుంటారు. ఎదైనా కంపెనీలో అత్యున్నత స్థాయిలో లేదా కీలక హోదాలో ఉన్న మేనేజ్ మెంట్ వ్యక్తులు కంపెనీ నుంచి వెళ్లిపోతే సదరు సంస్థ షేర్లపై ప్రభావం ఎలా ఉంటుంది. ఆ కంపెనీ షేర్ విలువ మార్కెట్లో పెరుగుతుందా లేక తగ్గుతుందా. అసలు ఈ మార్పులు కంపెనీ షేర్లపై ఎలాంటి ప్రభావం చూపుతాయో ఇన్వెస్టర్లు ముందుగా తప్పక తెలుసుకోవాలి. అలా కాకుండా గుడ్డిగా పెట్టుబడులు పెడితే వారు ఆ షేర్లలో లాభాలకు బదులు నష్టాలను చవిచూడవలసి ఉంటుంది.

ఇది మార్చి 2022లో వచ్చిన వార్త. గుంటూరుకు చెందిన నిఖిల్ న్యూస్ పేపర్ చదువుతున్నాడు. అతను 2 వేర్వేరు వార్తలను చదివాడు. అవి అతడిని గందరగోళానికి గురిచేశాయి. వాటిలో ఒకటి ఏమిటంటే.. జూబిలెంట్ ఫుడ్‌వర్క్స్ CEO ప్రతీక్ పోటా కంపెనీని వీడడం గురించి. దీని కారణంగా కంపెనీ షేర్లు స్టాక్ మార్కెట్లో ఏకంగా 12 శాతం పడిపోయాయి. మరో వార్త ఏమిటంటే.. ఇండియాబుల్స్ సంస్థకు చెందిన సమీర్ గహ్లాట్ రాజీనామా చేయటం. దీని కారణంగా ఆ కంపెనీ షేర్లు 13 శాతం లాభపడ్డాయి. అదేవిధంగా.., HDFC CEO ఆదిత్య పూరి పదవీ విరమణ చేసినప్పుడు.. కంపెనీ షేర్లు క్షీణించడాన్ని నిఖిల్ గమనించాడు. నిఖిల్ షేర్ మార్కెట్‌లో పెట్టుబడులు పెడుతుంటాడు. షేర్లు, మార్కెట్ గురించి కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తిని అతనికి ఎక్కువ. అందువల్ల.. అసలు షేర్లు ఎందుకు భిన్నమైన రీతిలో స్పందిస్తున్నాయో తెలుసుకోవడానికి నిశ్చయించుకున్నాడు. కొంత రీసెర్చ్ చేసిన తరువాత కంపెనీ నిర్వహణలో మార్పు వచ్చినప్పుడల్లా.., సదరు కంపెనీ షేర్ల ధరలు ప్రతిస్పందిస్తాయని నిఖిల్ కనుగొన్నాడు. ఇది గతంలో కంటే చాలా ఎక్కువగా జరుగుతోందని గమనించాడు.

HDFC బ్యాంక్‌..

నిఖిల్ HDFC బ్యాంక్‌తో ప్రారంభించాడు. ఇప్పటి వరకు ఈ షేర్ 21,916 శాతం రాబడిని ఇచ్చిందని అతను తెలుసుకున్నాడు. జూలై 1, 1999లో దీని ఒక్కో షేర్ విలువ  5.50 రూపాయలు ఉండగా.. 26 అక్టోబర్ 2020  దాని షేరు విలువ 1,210.90 రూపాయలుగా ఉంది. అక్టోబరు 26న, బ్యాంక్ MD CEO ఆదిత్య పూరి 25 సంవత్సరాల పాటు అత్యున్నత స్థాయిలో సేవలందించిన తరువాత పదవీ విరమణ చేశారు. HDFC బ్యాంకును దేశంలోనే అగ్రశ్రేణి ప్రైవేట్ బ్యాంక్‌గా మార్చడంలో ఆదిత్య పూరి కీలక పాత్ర పోషించారు. గత 5 ఏళ్ల కాలంలో బ్యాంక్ వార్షికంగా 20 శాతం చొప్పున వృద్ధి చెందింది. కానీ పూరి రిటైర్మెంట్ తర్వాత ఆ షేర్ కళ తప్పింది. షేర్ ఆ స్థాయి నుంచి పెద్దగా పడిపోలేదు. కానీ.. బెంచ్‌మార్క్‌తో పోలిస్తే షేరు తక్కువ పనితీరు కనబరిచింది. గత సంవత్సరంలో బ్యాంక్ 7.5 శాతం రాబడిని ఇచ్చింది. ఈ కాలంలో నిఫ్టీ- 50.. 16 శాతం పెరిగింది.

టాప్‌ మేనేజ్‌మెంట్‌ సిబ్బంది కంపెనీ నుంచి వెళ్లిపోతే అప్రమత్తంగా ఉండాలని స్వస్తిక ఇన్వెస్ట్‌మెంట్‌ మార్ట్‌ రీసెర్చ్‌ హెడ్‌ సంతోష్‌ మీనా చెప్పారు. సంస్థ విజయం ఎప్పుడూ నిర్వహణలో భాగంగా తీసుకునే చర్యలు, వ్యూహాలపై ఆధారపడి ఉంటుందని గుర్తుంచుకోవాలని ఆయన అంటున్నారు. గ్రేట్ మేనేజర్లు కంపెనీని మెరుగుపరుస్తూ.. కొత్త ఎత్తులకు తీసుకువెళతారని ఆయన అన్నారు. కానీ పరిమితమైన స్టార్ మేనేజర్లు మాత్రమే ఉన్నారు. అటువంటి మేనేజర్ కంపెనీని విడిచిపెట్టినట్లయితే, అది షేర్ పేలవమైన పనితీరును సూచిస్తుంది. ఉదాహరణకు.. ఆదిత్య పూరి HDFC బ్యాంక్‌ను విడిచిపెట్టిన తర్వాత, షేర్ ధర దాని కళను కోల్పోయింది. కొత్త మేనేజ్ మెంట్ ఇంకా దాని సామర్థ్యాన్ని నిరూపించుకోలేదు.

ఇన్వెస్టర్లకు సూచనలు..

టాప్ మేనేజ్‌మెంట్ నుంచి ఎవరైనా కంపెనీని విడిచిపెట్టినట్లయితే సంస్థ పూర్తి పనితీరును చూడండి. ఉదాహరణకు, ఎవరైనా ఊహించని విధంగా తీసివేయబడితే, అది కంపెనీ కార్యకలాపాలను ప్రభావితం చేసే సమస్య ఉందని సూచిస్తుంది. నిర్వహణలో మార్పు ఎల్లప్పుడూ పూర్ బిజినెస్ ఆపరేషన్స్ ను సూచించదు. మంచి ఆఫర్ వచ్చినందున మేనేజర్ రాజీనామా చేసే అవకాశం ఉంది లేదా అతను తన స్వంత వెంచర్‌ను ప్రారంభించినప్పుడు కంపెనీని వీడే అవకాశం ఉంటుంది. సాధారణంగా మంచి మేనేజర్ వారసత్వ ప్రణాళికను సిద్ధం చేశారా లేదా అనేది చూడాలి. ఇన్వెస్టర్లు కంపెనీ గురించి ఈ మొత్తం సమాచారాన్ని పొందటంతో పాటు కంపెనీ కొత్త మ్యానేజ్ మెంట్ వ్యూహాలపై నిఘా ఉంచాలి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పర్సనల్ ఫైనాన్స్ కు సంబంధించిన ఆసక్తికరమైన వీడియోల వేదిక Money9 Telugu యూట్యూబ్ ఛానెల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవీ చదవండి..

Elon Musk: ఎలాన్ మస్క్ డబుల్ ధమాకా! ఒకే రోజు ఆకాశం.. భూమి రెండిటిపై సంచలన విజయాలు..

QR Code Alert: మీరు QR కోడ్‌తో లావాదేవీలు జరిపితే జాగ్రత్తగా ఉండండి.. ఈ తప్పులు చేస్తే మీ బ్యాంకు ఖాతా ఖాళీయే..!