Parenting Tips: మీ పిల్లలను స్కూల్‌లో చేర్పిస్తున్నారా? ఈ విషయాలను తప్పక గుర్తుంచుకోండి..!

Parenting Tips: ఏ తల్లిదండ్రులైనా తమ పిల్లలు ప్రయోజకులు కావాలని ఆశిస్తున్నారు. వారు కడుపులో ఉండగానే.. వారి భవిష్యత్‌పై కలలు కంటుంటారు.

Parenting Tips: మీ పిల్లలను స్కూల్‌లో చేర్పిస్తున్నారా? ఈ విషయాలను తప్పక గుర్తుంచుకోండి..!
Child Care
Follow us

|

Updated on: Apr 27, 2022 | 8:10 AM

Parenting Tips: ఏ తల్లిదండ్రులైనా తమ పిల్లలు ప్రయోజకులు కావాలని ఆశిస్తున్నారు. వారు కడుపులో ఉండగానే.. వారి భవిష్యత్‌పై కలలు కంటుంటారు. వారి చదువు, ఇతర అన్ని విషయాల్లోనూ ప్రత్యేక కేరింగ్ తీసుకుంటారు. ఏ పాఠశాలలో చేర్పించాలి, పిల్లలు ఏం చదవాలి, ఏం అవ్వాలి ఇలా అనేక అంశాలపై ఒక ఆలోచన చేస్తారు. పిల్లలకు మొదటి ఉపాధ్యాయులు వారి తల్లిదండ్రులే. ఆ తరువాత పాఠశాల వారీ జీవితానికి ఒక దిశానిర్దేశం చేస్తుంది. పిల్లలకు నిజమైన విద్య పాఠశాలలోనే లభిస్తుంది. అందుకే స్కూల్, టీచర్ బాగోకపోతే పిల్లల జీవితంపై చెడు ప్రభావం పడుతుంది. పిల్లలు కష్టపడి చదువొచ్చు, తమ స్వంత లక్ష్యాలను ఏర్పరుచుకోవచ్చు. అయితే, ఇది చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే సాధ్యమవుతుంది. అందుకే పిల్లలను పాఠశాలలో జాయిన్ చేసే ముందు తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. తల్లిదండ్రులు తమ పిల్లలకు సరైన పాఠశాలను ఎంచుకోవాలి. తల్లిదండ్రులు తమ పిల్లల పాఠశాలను ఎన్నుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. వారు చేసే ఒక్క తప్పు పిల్లలకే కాదు, వారి జీవితాన్ని కూడా కష్టాల కడలిలో నెట్టేస్తుంది. పాఠశాలను ఎన్నుకునేటప్పుడు ఎలాంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

పాఠశాల స్థానం.. మీ పిల్లలను చేర్పించాలని భావిస్తున్న పాఠశాల ఉన్న ప్రదేశం చాలా ముఖ్యమైనది. పాఠశాల పరిసర ప్రాంతాలు, అక్కడ నివసించే ప్రజలు కూడా పిల్లల మనస్తత్వాన్ని ప్రభావితం చేస్తారు. స్కూల్లో టీచర్లు, ఇంట్లో తల్లిదండ్రులు పిల్లలకు మంచి విషయాలు నేర్పాలి. కానీ బడి చుట్టూ వాతావరణం సరిగా లేకుంటే ఆ పిల్లలు అనేక చెడు అలవాట్లకు ఆకర్షితులవుతారు. అందువల్ల, పాఠశాలను ఎంచుకునే ముందు దాని పరిసరాల గురించి సమాచారాన్ని సేకరించాలి.

ఉపాధ్యాయుల సమాచారం.. ఉపాధ్యాయుల గురించి సమాచారాన్ని తప్పకుండా తెలుసుకోవాలి. మీ పిల్లలను చేర్చాలనుకుంటున్న పాఠశాలలో చదువుతున్న పిల్లల తల్లిదండ్రుల నుండి ఉపాధ్యాయుల స్వభావం గురించి సమాచారాన్ని పొందాలి. అలాగే స్కూల్ లోపల వాతావరణం ఎలా ఉందో కూడా తెలుసుకోవాలి. ఈ విధంగా మీ పిల్లల కోసం మంచి ఉపాధ్యాయులను ఎంపిక చేసుకోవచ్చు.

అభ్యాస వ్యవస్థ.. పిల్లలను పాఠశాలకు పంపడంలో ముఖ్య ఉద్దేశ్యం వారిలో జ్ఞానాన్ని పెంపొందించడం. అందుకే పాఠశాల విద్యా విధానం ఎలా ఉందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. పిల్లలకు క్లాసులు ఇచ్చే ఫార్మాట్ ఏమిటి, హోంవర్క్ ఎలా ఇస్తారు, అదనపు తరగతులు ఉన్నాయా? అలాగే బడిలో పిల్లలకు బోధించడంతోపాటు ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారో తెలుసుకోవడం చాలా ముఖ్యం.

Also read:

Viral Video: వ్యాన్‌కు వేలాడుతూ పాము షికారు.. వీడియో చూస్తూ ఫ్యూజులు ఔట్..!

Telangana Group 1: నిరుద్యోగులకు శుభవార్త.. గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చేసింది.. పూర్తి వివరాలివే..

Andhra Pradesh: అనిల్ ఇంటికి వెళ్లిన మంత్రి కాకాని.. కలిసిన చేతులు.. కలవని చూపులు..!

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..