Andhra Pradesh: అనిల్ ఇంటికి వెళ్లిన మంత్రి కాకాని.. కలిసిన చేతులు.. కలవని చూపులు..!
Andhra Pradesh: మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణ తర్వాత నెల్లూరు వైసీపీలో నెలకొన్న విభేదాలకు ఫుల్‌స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు మంత్రి కాకాని,
Andhra Pradesh: మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణ తర్వాత నెల్లూరు వైసీపీలో నెలకొన్న విభేదాలకు ఫుల్‌స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు మంత్రి కాకాని, మాజీ మంత్రి అనిల్. ఇందులో భాగంగానే.. మాజీ మంత్రి అనిల్ కుమార్ ఇంటికి మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వెళ్లారు. ఆయనను కలిసి కాసేపు సరదాగా ముచ్చటించారు. ఈ విజిటింగ్ సందర్భంగా మాజీ మంత్రి అనిల్‌ను శాలువాతో సత్కరించారు మంత్రి కాకాని. కాగా, తేడాపల్లిలో సీఎం జగన్ వద్ద పంచాయతీ ముగిసినప్పుడు కూడా ఇద్దరూ కలిసి రాలేదు. ఇప్పుడు మాత్రం నెల్లూరులో అనిల్ ఇంటికి మంత్రి కాకాని వెళ్లడం ఆసక్తిగా మారింది. ఇద్దరూ కలిసి మాట్లాడుకోవడం మరింత ఇంట్రెస్ట్ పెంచింది. అయితే, భేటీ తరువాత ఈ ఇద్దరు నేతలు మీడియాతో మాట్లాడారు. ఈ భేటీలో ప్రత్యేకత ఏమీ లేదని, పార్టీ కోసం కలిసి పని చేస్తామని చెప్పుకొచ్చారు ఇద్దరు నేతలు.
ఇక నెల్లూరు జిల్లాలో మాజీ మంత్రి అనిల్ కుమార్, కాకాని గోవర్ధన్ రెడ్డి వర్గాల మధ్య విభేదాలు ఎప్పటి నుంచో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఇక మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ తరువాత అనిల్ పోస్ట్ పోవడం, కాకానికి ఆ పోస్ట్ దక్కడంతో విభేదాలు మరింత పెరిగాయి. ఇరు వర్గాలకు చెందిన పార్టీ కార్యకర్తల మధ్య వరుస ఘర్షణలు చోటు చేసుకున్నాయి. వివాదాలు మరింత ముదురుతుండటంతో.. సీఎం జగన్ వారిద్దరినీ పిలిచి మాట్లాడారు. ఆ తరువాత తమ మధ్య విభేదాలు లేవని, పార్టీ కోసం ఇద్దరం కలిసి పని చేస్తామంటూ ప్రకటించారు. ఈ క్రమంలో అనిల్ ఇంటికి కాకాని రావడంతో ఆసక్తిని రేపింది.
కనీసం మొహమైనా చూడని అనిల్..! ఇదంతా ఇలా ఉంటే.. మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అనిల్ ఇంటికి వెళ్లిన సందర్భంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. పైకి విభేదాలు లేవని చెబుతున్నప్పటికీ.. ఈ సీన్ చూస్తే మాత్రం ఎడబాటు ఎంతస్థాయిలో ఉందనేది అర్థం అవుతుంది. అవును, తన ఇంటికి వచ్చిన మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని అనిల్ ఆహ్వానించారు. అయితే ఈ సమయంలో అనిల్.. అంటీముట్టనట్లుగా వ్యవహరించడం మరో చర్చకు దారి తీస్తోంది. ఇంటికి వచ్చిన కాకానికి షేక్ హ్యాండ్ ఇచ్చిన అనిల్.. కనీసం మొహమైన ఎత్తి చూడలేదు. ఏదో మమ అన్నట్లుగా వ్యవహరించారు. కాకాని గుమ్మం బయట ఉండగానే అనిల్ మాత్రం చకచకా ఇంటి లోపలికి వెళ్లిపోయారు. ఈ ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
Also read:
Andhra Pradesh: సంసారానికి దూరంగా భర్త.. నిలదీస్తే ఒకటే ఏడుపు.. కృష్ణా నదిలో భార్య నిరసన..!