Andhra Pradesh: సంసారానికి దూరంగా భర్త.. నిలదీస్తే ఒకటే ఏడుపు.. కృష్ణా నదిలో భార్య నిరసన..!
Andhra Pradesh: ఆ ఇద్దరికీ పెళ్లి జరిగి నాలుగు సంవత్సరాలు అవుతోంది. అప్పటి నుంచి భార్యను కనీసం ముట్టనైనా ముట్టుకోలేదు.
Andhra Pradesh: ఆ ఇద్దరికీ పెళ్లి జరిగి నాలుగు సంవత్సరాలు అవుతోంది. అప్పటి నుంచి భార్యను కనీసం ముట్టనైనా ముట్టుకోలేదు. దగ్గరకు వెళ్లనూ లేదు. నాలుగేళ్లుగా ఇదే తంతు.. పేరుకే పెళ్లి అయింది కానీ, సంసారంలో అచ్చటాముచ్చటా లేనే లేదు. అదేమంటే ఇజ్జత్ పోతుందని, గమ్మునుండాలంటూ కట్టుకున్న భార్యను బెదిరింపులకు గురి చేస్తూ వచ్చాడు భర్త. చివరకు ఇక భరించలేనంటూ విషయాన్ని బహిర్గతం చేసింది ఆ భార్య. తన భర్త సంసారానికి పనికిరాడంటూ.. పంచాయతీ పెట్టింది. పంచాయతీ పెద్దలు నిలదీస్తే ఆ భర్త ఏడుపు లంకించుకున్నాడు. ఆ తరువాత మ్యాటర్ అందరికీ అర్థమైపోయింది.
క్రిష్టా జిల్లా నందిగామకు చెందిన మహిళకు పొరుగూరు వ్యక్తితో నాలుగు సంవత్సరాల క్రితం వివాహమైంది. అయితే పెళ్ళైన నాటి నుంచి భర్త సంసార సుఖానికి దూరంగా ఉంటున్నాడని బాధితురాలు వాపోయింది. పరువు పోతుందని బెదిరింపులకు గురి చేశాడని బాధితురాలు వాపోయింది. తన భర్త సంసారానికి పనికిరాడని, కట్నం డబ్బులు వాపసు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బాధిత మహిళ తన కుటుంబ సభ్యులతో కలిసి ఏకంగా క్రిష్ణా నదిలో నిరసనకు దిగింది.
గ్రామ పెద్దల సమక్షంలో తనకు రూ.15 లక్షలు ఇస్తానని అత్త మామలు ఒప్పుకున్నారని తెలిపింది. చివరికు డబ్బు ఇవ్వకపోగా తమపై కోర్టుకు వెళ్ళి తమను ఇబ్బందులకు గురి చేసి, తమపై పరువు నష్టం వేశారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. తమకు న్యాయం జరిగే వరకూ కృష్ణా నదిలో నీళ్ళు తాగి నిరసన చేస్తానని వాపోయింది. ఆమెను ఆమె కుటుంబ సభ్యులను పోలీసులు అడ్డుకుని ఊరికి పంపించివేశారు. సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
Also read:
Traffic Challan: ఇదెక్కడి ఇచ్చంత్రం సామీ.. చలాన్లు ఇలా కూడా వేస్తారా?.. తలపట్టుకున్న వాహనదారుడు..!