Railway News: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. పలు రూట్లలో రైళ్ల పునరుద్ధరణ..
Railway News: తెలుగు రాష్ట్రాల ప్రజలకు దక్షిణ మధ్య రైల్వే (South central railway) శుభవార్త తెలిపింది. గతంలో పలు కారణాల వల్ల రద్దైన పలు రైళు సర్వీసులను తిరిగి ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. ఏపీతో పాటు, ఆంధ్రప్రదేశ్‌లో పలు రూట్ల మధ్య నడిచే డెయిలీ...
Railway News: తెలుగు రాష్ట్రాల ప్రజలకు దక్షిణ మధ్య రైల్వే (South central railway) శుభవార్త తెలిపింది. గతంలో పలు కారణాల వల్ల రద్దైన పలు రైళు సర్వీసులను తిరిగి ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. ఏపీతో పాటు, ఆంధ్రప్రదేశ్‌లో పలు రూట్ల మధ్య నడిచే డైలీ ఎక్స్‌ప్రెస్/ప్యాసింజర్/డెమూ రైళ్ల సేవలను పునరుద్ధరించారు. ఈ సేవలను ఏప్రిల్ 27 నుంచి అందుబాటులోకి రానున్నాయి. అధికారులు పునరుద్ధరించిన రైల్వే సేవల వివరాలు ఇవే..
* ట్రెయిన్ నెంబర్ 17645 (57651 పాత నెంబర్) సికింద్రాబాద్ నుంచి రేపల్లే వెళ్లే రైలు 11.10 గంటలకు బయలుదేరి, 19.45కి గమ్యాన్ని చేరుకుంటుంది. ఈ సర్వీసు 27-04-2022 నుంచి అందుబాటులోకి రానుంది.
* 17646 (57650 పాత నెంబర్) రేపల్లే నుంచి సికింద్రాబాద్ వెళ్లే రైలు 07.50కి బయలు దేరి 16.55కి గమ్యాన్ని చేరుకుంటుంది. 27-04-2022 సర్వీసు పునఃప్రారంభం కానుంది.
* 07594 (57688 పాత నెంబర్) కాచిగూడ నుంచి నిజమాబాద్ వెళ్లే రైలు 18.50కి బయలు దేరి 23.50కి గమ్యాన్ని చేరుకుంటుంది. ఈ రైలు 29-04-2022 నుంచి అందుబాటులోకి రానుంది.
* 07595 (57689 పాత నెంబర్) నిజమాబాద్ నుంచి కాచిగూడ వెళ్లే రైలు 05.05కి బయలు దేరి 09.40కి గమ్యాన్ని చేరుకుంటుంది. ఈ రైలు సేవలు 30-04-2022 నుంచి ప్రారంభం కానున్నాయి.
* 07496 (77690 పాత నెంబర్) రాయ్‌చూర్ నుంచి గద్వాల్ వెళ్లే రైలు 13.10కి బయలుదేరి, 14.30కి గమ్యాన్ని చేరుకుంటుంది. 27-04-2022ని పునఃప్రారంభం కానున్నాయి.
* 07495 (77689 పాత నెంబర్) గద్వాల్ నుంచి రాయ్‌చూర్ వెళ్లే రైలు 14.50కి బయలుదేరి, 16.20కి గమ్యాన్ని చేరుకుంటుంది. ఈ రైలు సర్వీసు 27-04-2022 నుంచి పునఃప్రారంభం కానున్నాయి.
మరిన్ని ఏపీ, తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..