IPL 2022 Purple Cap: పర్పుల్ క్యాప్‌ కింగ్‌ యుజ్వేంద్ర చాహల్.. టాప్ 3లోకి దూసుకొచ్చిన డ్వేన్‌ బ్రేవో..

IPL 2022 Purple Cap: IPL 2022 పర్పుల్‌ క్యాప్‌ రేస్‌ ఆసక్తికరంగా కొనసాగుతోంది. ఈసారి ఐపీఎల్‌లో 8 జట్లకి బదులుగా 10 జట్లను లీగ్‌లో చేర్చారు.

IPL 2022 Purple Cap: పర్పుల్ క్యాప్‌ కింగ్‌ యుజ్వేంద్ర చాహల్.. టాప్ 3లోకి దూసుకొచ్చిన డ్వేన్‌ బ్రేవో..
Purple Cap Race
Follow us
uppula Raju

|

Updated on: Apr 26, 2022 | 1:08 PM

IPL 2022 Purple Cap: IPL 2022 పర్పుల్‌ క్యాప్‌ రేస్‌ ఆసక్తికరంగా కొనసాగుతోంది. ఈసారి ఐపీఎల్‌లో 8 జట్లకి బదులుగా 10 జట్లను లీగ్‌లో చేర్చారు. దీని కారణంగా పాయింట్ల పట్టికతో పాటు, పర్పుల్ క్యాప్, ఆరెంజ్ క్యాప్‌ల రేసు కూడా పెరిగింది. సోమవారం చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్‌ కింగ్స్‌ మ్యాచ్‌ తర్వాత పరిస్థితి ఈ విధంగా మారింది. పంజాబ్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో డ్వేన్ బ్రావో రెండు వికెట్లు తీశాడు. ఇప్పుడు 8 మ్యాచ్‌ల్లో 14 వికెట్లు తీసి టాప్ 3లో చేరాడు. కుల్దీప్ యాదవ్‌ను వెనక్కి నెట్టి మూడో ర్యాంక్‌ను కైవసం చేసుకున్నాడు. అతను టి నటరాజన్‌ను సమం చేయడానికి కేవలం ఒక వికెట్ దూరంలో ఉన్నాడు. మరోవైపు పర్పుల్ క్యాప్‌పై కూర్చున్న యుజ్వేంద్ర చాహల్ ఈ జాబితాలో చాలా ముందున్నాడు. ఏడు మ్యాచ్‌ల్లో 18 వికెట్లు తీసిన చాహల్‌కు హ్యాట్రిక్ కూడా ఉంది. పంజాబ్ కింగ్స్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ రాహుల్ చాహర్. 8 మ్యాచ్‌ల్లో 10 వికెట్లు పడగొట్టాడు. అయితే సోమవారం ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయాడు.

యుజ్వేంద్ర చాహల్ పర్పుల్ క్యాప్ రేసులో ఇప్పటి వరకు ఆడిన 7 మ్యాచ్‌ల్లో 18 వికెట్లు పడగొట్టి ముందంజలో ఉన్నాడు. అతని తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫాస్ట్ బౌలర్ టి. నటరాజన్ రెండో స్థానంలో ఉన్నాడు. ఈ లెఫ్టార్మ్ బౌలర్ ఇప్పటి వరకు ఆడిన 7 మ్యాచుల్లో 15 వికెట్లు పడగొట్టాడు. IPL 2022లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరపున ఆడుతున్న ఉమేష్ యాదవ్ టోర్నీని అట్టహాసంగా ప్రారంభించాడు. అయితే ఇప్పుడు అతను ఈ రేసులో చాలా వెనుకబడి ఉన్నాడు. చాహల్ మొదటి స్థానాన్ని ఆక్రమించినప్పటి నుంచి దానిని ఎవరూ బ్రేక్ చేయలేదు. ఇక నిన్నటి మ్యాచ్‌లో శిఖర్ ధావన్ 88 నాటౌట్‌తో ఆఖరి ఓవర్‌లో పంజాబ్ కింగ్స్ 11 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ నాలుగు వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసి చెన్నై ఇన్నింగ్స్‌ను 176 పరుగులకు పరిమితం చేసింది. దీంతో ఈ సీజన్‌లో నాలుగో విజయాన్ని నమోదు చేసింది.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Women Health: మగువలకి గమనిక.. ఆరోగ్యకరమై హృదయం కోసం ఏడు జాగ్రత్తలు..!

Summer Skin Care: ఎండాకాలంలో రోజ్‌ వాటర్‌తో ఇలా చేస్తే చర్మం కాంతివంతం..!

RR vs RCB Prediction: ఫామ్‌లో ఉన్న జోస్ బట్లర్, యుజ్వేంద్ర చాహల్‌.. బెంగుళూరుకి విజయం అంత సులువు కాదు..!