Traffic Challan: ఇదెక్కడి ఇచ్చంత్రం సామీ.. చలాన్లు ఇలా కూడా వేస్తారా?.. తలపట్టుకున్న వాహనదారుడు..!

Traffic Challan: కేరళలో ఓ వాహనదారుడికి విచిత్ర పరిస్థితి ఎదురైంది. సాధారణంగా ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించిన వారికి సహజంగానే జరిమాన విధిస్తారు.

Traffic Challan: ఇదెక్కడి ఇచ్చంత్రం సామీ.. చలాన్లు ఇలా కూడా వేస్తారా?.. తలపట్టుకున్న వాహనదారుడు..!
Traffic Challan
Follow us
Shiva Prajapati

|

Updated on: Apr 26, 2022 | 3:42 PM

Traffic Challan: కేరళలో ఓ వాహనదారుడికి విచిత్ర పరిస్థితి ఎదురైంది. సాధారణంగా ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించిన వారికి సహజంగానే జరిమాన విధిస్తారు. అయితే, ఇక్కడ మాత్రం ఓ వాహనదారుడికి చలాన్ విధించిన కారణం అందరినీ షాక్‌కు గురి చేస్తుంది. కారులో ప్రయాణించే ప్రయాణికులు సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే ఫైన్ వేస్తారు. కానీ, హెల్మెట్ పెట్టుకోలేదని కారు డ్రైవర్‌కు చలాన్ వేయడం ఎప్పుడైనా చూశారా? అయితే, ఇప్పుడు చూసేయండి. హెల్మెట్ సరిగా ధరించలేదనే కారణంగా మారుతీ ఆల్టో కారు నడుపుతున్న డ్రైవర్‌కు కేరళ ట్రాఫిక్ పోలీసులు రూ. 500 ఫైన్ వేశారు. దీనికి సంబంధించిన మెసేజ్ తన మొబైల్‌కు రావడంతో.. అవాక్కవడం అతని వంతైంది. కారు డ్రైవ్ చేస్తే హెల్మెట్ ధరించడం ఏంటి? అని షాక్ అయ్యాడు. తనకు వచ్చిన చలాన్‌ను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాడు బాధిత వ్యక్తి.

ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కేరళకు చెందిన అజిత్‌కు మారుతీ ఆల్టో కారు ఉంది. అయితే, తనకు తాజాగా ట్రాఫిక్ పోలీసుల నుంచి ఒక సందేశం వచ్చింది. బైక్ నడిపే వ్యక్తి, పిలియన్ రైడర్ ఇద్దరూ హెల్మెట్ ధరించకుండా బైక్‌పై వెళ్తున్నందుకు గానూ రూ.500 ఫైన్ విధించినట్లు ఆ మెసేజ్ సారాంశం. ఈ చలాన్ సైట్‌లో మాత్రం వాహనం ‘కార్’ అని చూపిస్తోంది. దీంతో ఏదో పొరపాటు జరిగినట్లు భావించిన అజిత్.. ట్రాఫిక్ అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లాడు. టెక్నికల్ ప్రాబ్లమ్ వల్ల ఈ చలాన్ పడినట్లు అధికారులు చెబుతున్నారు.

Also read:

Smart Water Bottle: మార్కెట్లోకి స్మార్ట్‌ వాటర్‌ బాటిల్ వచ్చేశాయి.. ఫీచర్లు తెలిస్తే ఫిదా అవ్వాల్సిందే..

TS Police Recruitment 2022: హైదరాబాద్‌లో పది కేంద్రాల్లో ప్రారంభమైన పోలీస్‌ ఉచిత శిక్షణ

Share Price: కంపెనీ టాప్ మేనేజ్‌మెంట్ మారితే షేర్లు పతనమోతాయా..? ఇన్వెస్టర్లు ఏమి చేయాలి..