Hyderabad Metro: మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఉచితంగా సినిమా చూసేలా సేవలు

మెరుగైన సేవలు అందిస్తూ.. రయ్..రయ్..మంటూ ముందుకు దూసుకెళ్తున్న మెట్రో.. ప్రయాణికుల కోసం మరో సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. మెట్రో రైలులో ప్రయాణిస్తూ ఉచితంగానే ఓ సినిమా చూసేలా హైస్పీడ్...

Hyderabad Metro: మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఉచితంగా సినిమా చూసేలా సేవలు
Hyderabad Metro
Follow us

|

Updated on: Apr 27, 2022 | 10:35 AM

మెరుగైన సేవలు అందిస్తూ.. రయ్..రయ్..మంటూ ముందుకు దూసుకెళ్తున్న మెట్రో.. ప్రయాణికుల కోసం మరో సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. మెట్రో రైలులో ప్రయాణిస్తూ ఉచితంగానే ఓ సినిమా చూసేలా హైస్పీడ్ ఇంటర్ నెట్ ను వేగవంతం చేసింది. కావాలంటే సినిమాను డౌన్‌లోడ్‌ చేసుకునేలా వెసులుబాటు చేసుకోవచ్చు. ఇతర సమాచారం, ఎంటర్టైన్ మెంట్, షాపింగ్‌, ఇలా నచ్చినవి చేసుకోవచ్చు. 2019లోనే హైదరాబాద్‌ మెట్రోతో అనుసంధానమైన షుగర్‌ బాక్స్‌ సంస్థ ప్రస్తుతం అంతరాయం లేని హైస్పీడ్‌ సేవలను అందుబాటులోకి తెచ్చింది. అమీర్‌పేటలోని మెట్రో స్టేషన్‌లో మంగళవారం షుగర్‌ బాక్స్‌ సంస్థ తన డిజిటల్‌ హైస్పీడ్‌ కనెక్టివిటీ సేవలను ప్రవేశపెట్టింది. ఇందుకుగాను పేటెంటెడ్‌ క్లౌడ్‌ ఫ్రాగ్‌మెంట్‌ టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నామని సంస్థ ప్రతినిధులు తెలిపారు.

మెట్రోరైలు దిగగానే అందుబాటులో ఉండేలా మెట్రోరైడ్‌ ఎలక్ట్రికల్‌ ఆటోలను కొద్దిరోజుల క్రితమే అధికారులు ప్రవేశపెట్టారు. మొదటి కిలోమీటరుకు రూ.10, తర్వాత ప్రతి కి.మీకి రూ.6 వసూలు చేస్తారు. 5 కిలోమీటర్ల పరిధిలోనే ఈ-ఆటోలు తిరగనున్నాయి. దశల వారీగా ప్రతి నెలా రెండు మూడు స్టేషన్లలో అందుబాటులోకి తీసుకురానున్నారు. మెట్రోరైడ్‌ యాప్‌లో ఆటోను బుక్‌ చేసుకోవాల్సి ఉంటుంది. క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌తో కూడా బుక్‌ అవుతుంది. కాలుష్యం తగ్గించేందుకు ఎలక్ట్రికల్‌ ఆటోలను వినియోగించాలని ప్రయాణికులను అధికారులు కోరారు.

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

ఇవీచదవండి. Priyanka Chopra: ఆ అనాథను దత్తత తీసుకోవాలనుకున్నా.. కానీ, ఇంట్లో వాళ్లు అడ్డు చెప్పడంతో..: ప్రియాంక చోప్రా