AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Atal Pension Yojana: ఆన్‌లైన్‌లో అటల్‌ పెన్షన్‌ యోజన ఖాతా తెరవాలనుకుంటున్నారా..? ఇంట్లోనే ఉండి ఇలా చేయండి!

Atal Pension Yojana: అటల్ పెన్షన్ యోజన ( APY ) ప్రభుత్వ పెన్షన్ పథకాలలో అత్యధిక ప్రయోజనం కలిగి ఉంది. అసంఘటిత రంగ ప్రజలు కూడా పదవీ విరమణ ప్రయోజనాలను..

Atal Pension Yojana: ఆన్‌లైన్‌లో అటల్‌ పెన్షన్‌ యోజన ఖాతా తెరవాలనుకుంటున్నారా..? ఇంట్లోనే ఉండి ఇలా చేయండి!
Atal Pension Yojana
Subhash Goud
|

Updated on: Apr 27, 2022 | 10:08 AM

Share

Atal Pension Yojana: అటల్ పెన్షన్ యోజన ( APY ) ప్రభుత్వ పెన్షన్ పథకాలలో అత్యధిక ప్రయోజనం కలిగి ఉంది. అసంఘటిత రంగ ప్రజలు కూడా పదవీ విరమణ ప్రయోజనాలను పొందవచ్చు. పెన్షన్ డబ్బు వారి చేతుల్లోకి వస్తుంటుంది. ఈ ఉద్దేశ్యంతో ప్రభుత్వం అటల్ పెన్షన్ యోజనను ప్రారంభించింది. 2021-22 చివరి నాటికి 4 కోట్ల మందికి పైగా అటల్ పెన్షన్ యోజనలో చేరినట్లు తాజా గణాంకాలు తెలియజేస్తున్నాయి. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (PFRDA) తెలిపిన వివరాల ప్రకారం.. 2021-22 ఆర్థిక సంవత్సరంలో 99 లక్షలకు పైగా అటల్ పెన్షన్ యోజన ఖాతాలు తెరవబడ్డాయి. మార్చి 2022 చివరి నాటికి ఈ పథకంలో చేరిన వారి సంఖ్య 4.01 కోట్లకు చేరింది. ఈ సంఖ్య పెరగడానికి ఇ-అటల్ పెన్షన్ యోజన కూడా ఒక కారణం. ఈ పథకం ప్రయోజనాన్ని ఆన్‌లైన్‌లో తీసుకోవచ్చు. ఇంట్లో కూర్చొని మొబైల్ లేదా ల్యాప్‌టాప్‌లో అటల్ పెన్షన్ యోజన ఖాతా ఓపెన్‌ చేసుకోవచ్చు. అలాంటి సమయంలో బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. అటల్ పెన్షన్ యోజనలో ఈ సౌకర్యం ఆన్‌లైన్‌లో కూడా అందుబాటులో ఉంది.

అటల్ పెన్షన్ యోజన ఖాతాను ఎలా తెరవాలి:

మీకు ఆధార్ కార్డ్ ఉంటే చాలా సులభంగా అటల్ పెన్షన్ యోజన ఖాతాను ఆన్‌లైన్‌లో తెరవవచ్చు. ఈ పథకాన్ని నెట్ బ్యాంకింగ్ లేదా ఇతర డిజిటల్ మార్గాల ద్వారా అనుసంధానించవచ్చు. e-APYకి ప్రత్యేక ఛార్జీలు అవసరం లేదని PFRDA పత్రికా ప్రకటన పేర్కొంది. దీని కోసం కస్టమర్ KYC చేయాల్సి ఉంటుంది. ఇందులో కస్టమర్ ఆధార్‌తో నమోదు చేయబడతారు. KYC కోసం రెండు ప్రక్రియలు పేర్కొనబడ్డాయి. ఆఫ్‌లైన్ XML నుండి ఆధార్ KYC, ఆన్‌లైన్ ఆధార్ e-KYC. ఆన్‌లైన్ అటల్ పెన్షన్ యోజన (eAPY)ని ప్రారంభించాలనుకునే వారు కొన్ని ముఖ్యమైన విషయాలను జాగ్రత్తగా చూసుకోవాలి. eKYCలో, బ్యాంక్ రికార్డులలో నమోదైనట్లుగానే వివరాలను ఇవ్వండి. అటల్ పెన్షన్ యోజన ఖాతా సేవింగ్స్ బ్యాంక్ ఖాతాకు లింక్ చేయబడుతుంది. అందుకే APY మొదటి విడత డబ్బు ఖాతాలోనే ఉండాలి. ఈ మొత్తం రూ. 1000 నుండి రూ. 5000 మధ్య ఉండాలి. ఆధార్ వివరాలను అందించిన తర్వాత మీ ఖాతా ధృవీకరించబడుతుంది. బ్యాంక్ మీ అటల్ పెన్షన్ యోజన ఫారమ్‌ను తిరస్కరిస్తే, ఆ ఫారమ్‌ను సరిచేసి మళ్లీ సమర్పించండి.

eAPY ఆన్‌లైన్‌లో ఎలా నమోదు చేసుకోవాలి:

☛ ఆన్‌లైన్ APY రిజిస్ట్రేషన్ కోసం పోర్టల్‌ని సందర్శించండి

☛ బ్యాంక్ పేరును ఎంచుకోండి. బ్యాంక్ ఖాతా నంబర్‌, ఇమెయిల్ ID, ఆధార్ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ను నమోదు చేయండి. అలాగే ఆధార్ ఆఫ్‌లైన్ ఇ-కెవైసి XML ఫైల్‌ను అప్‌లోడ్ చేయండి.

☛ పేపర్‌లెస్ ఆఫ్‌లైన్ ఇ-కెవైసి కోసం షేర్ కోడ్ ఎంటర్ చేయండి.

☛ తర్వాత క్యాప్చా కోడ్‌ను నమోదు చేశాక కొనసాగింపుపై క్లిక్ చేయండి.

అటల్ పెన్షన్ యోజన ఆధార్ చట్టంలోని సెక్షన్ 7లో చేర్చబడింది. అటల్ పెన్షన్ యోజన ప్రయోజనం పొందాలనుకునే వ్యక్తి తప్పనిసరిగా ఆధార్ నంబర్‌ను అందించాలని ఈ చట్టంలోని నిబంధన చెబుతోంది. అయితే అటల్‌ పెన్షన్‌ ఖాతా తెరవడానికి ఆధార్‌ను అందించడం అవసరం. అటల్ పెన్షన్ యోజన కోసం సేవింగ్స్ బ్యాంక్ ఖాతా లేదా పోస్టాఫీసు బ్యాంకు ఖాతా కలిగి ఉండాలి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

SBI Alert: ఈ రెండు నంబర్ల నుంచి వచ్చిన కాల్స్ లిఫ్ట్ చేశారో అంతే సంగతులు.. ఎస్బీఐ హెచ్చరిక!

PM Kisan: పీఎం కిసాన్‌ స్కీమ్‌లో కేంద్రం కీలక నిర్ణయం.. నిబంధనలు కఠినతరం.. రైతులు ఇలా చేస్తే డబ్బులు అందవు

Aadhaar Card: మీ ఆధార్‌ కార్డు విషయంలో ఏదైనా మోసం జరిగిందా..? సింపుల్‌ ఇలా తెలుసుకోండి