Hyderabad Traffic: హైదరాబాద్లో సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం.. రేపు ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి రేపు ఎల్బీ స్టేడియంలో ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో కొన్ని ట్రాఫిక్ ఆంక్షలు నెలకొన్నాయి. రేపు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఎల్బీ స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని ట్రాఫిక్ పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు. ఈ క్రమంలోనే పబ్లిక్ గార్డెన్ నుండి బషీర్ బాగ్ వెళ్లే రోడ్డు మూసివేయనున్నట్లు సిటీ పోలీసులు తెలిపారు.

తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి రేపు ఎల్బీ స్టేడియంలో ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో కొన్ని ట్రాఫిక్ ఆంక్షలు నెలకొన్నాయి. రేపు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఎల్బీ స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని ట్రాఫిక్ పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు. ఈ క్రమంలోనే పబ్లిక్ గార్డెన్ నుండి బషీర్ బాగ్ వెళ్లే రోడ్డు మూసివేయనున్నట్లు సిటీ పోలీసులు తెలిపారు. ఈ మార్గాన్ని గన్ పౌండ్రీ నుండి చాపెల్ రోడ్డు మీదగా మళ్లించినట్లు తెలిపారు. బషీర్ బాగ్ నుండి వచ్చే వాహనాలను కింగ్ కోటి సైడ్ మళ్లిస్తున్నట్లు వెల్లడించారు. సుజాత స్కూల్ మీదుగా వచ్చే వాహనాలను నాంపల్లి రైల్వే స్టేషన్ మీదుగా మళ్లిస్తున్నట్లు ప్రకటించారు. కనుక ఈ మార్గాల వైపు వెళ్లే వాహనదారులు ప్రత్యమ్నాయ మార్గాల్లో ప్రయాణించాలని సూచించారు.

Hyderabad Traffic
ఇదిలా ఉంటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మెజార్టీ స్థానాలను కైవసం చేసుకుంది. నిన్న సీఎల్పీ నేతగా రేవంత్ రెడ్డిని నియమించారు. రేపు మధ్యాహ్నం 1.04 గంటలకు తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు రేవంత్. ఈయనతో పాటూ మరో కొంత మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎల్బీ స్టేడియంలో ప్రమాణస్వీకారానికి అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తున్నారు ఉన్నతాధికారులు. కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు పోలీసులు. మూడు ప్రధాన స్టేజీలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రధాన వేదికపై సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేయనున్నారు. అదే వేదికపై ఎమ్మెల్యేలను కూడా కూర్చోబెట్టేలా ఈ స్టేజిని రూపొందిస్తున్నారు. మరో వేదికపై తెలంగాణ సాంస్కృతి, కళలు ప్రతిబింబించేలా ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించారు. మరో వేదికపై తెలంగాణ అమరవీరుల కుటుంబాలు ఉండేలా ప్రణాళికలు రచించారు. అలాగే ఏఐసీసీ పెద్దలు, గవర్నర్, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ నేపథ్యంలోనే ఎల్బీ స్టేడియం పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక పోలీసు బలగాలతో గస్తీ కాస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




