Gaint Killers: జెయింట్ కిల్లర్స్.. వరుస విజయాలు సాధిస్తున్న సీఎం అభ్యర్థులకే షాకిచ్చిన అ”సామాన్యులు”
ఇటీవల ముగిసి 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో సంచలనాలు నమోదయ్యాయి. విజయం సాధించి అధికార పీఠం అధిరోహించాలనుకున్న నేతలకు ఎదురుదెబ్బ తగిలింది. అక్కడ తప్పక విజయం సాధిస్తామని ఆత్మవిశ్వాసంతో ఉన్న నేతలకు సామాన్య నేతలే షాక్ ఇచ్చారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో 5 మంది కీలక నేతలను ఓడించిన ఎమ్మెల్యేల్లో ఎక్కువ మంది తొలిసారిగా ఎన్నికైన తర్వాత శాసనసభలో అడుగు పెడుతున్నారు.

ఇటీవల ముగిసి 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో సంచలనాలు నమోదయ్యాయి. విజయం సాధించి అధికార పీఠం అధిరోహించాలనుకున్న నేతలకు ఎదురుదెబ్బ తగిలింది. అక్కడ తప్పక విజయం సాధిస్తామని ఆత్మవిశ్వాసంతో ఉన్న నేతలకు సామాన్య నేతలే షాక్ ఇచ్చారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో 5 మంది కీలక నేతలను ఓడించిన ఎమ్మెల్యేల్లో ఎక్కువ మంది తొలిసారిగా ఎన్నికైన తర్వాత శాసనసభలో అడుగు పెడుతున్నారు. ఈ ఐదుగురు ఎవరు..? ఆ జాయింట్ కిల్లర్స్ గురించి వివరంగా తెలుసుకుందాం…
“ఓ అమాయకుడా, నీ గెలుపు గురించి గొప్పగా చెప్పుకోకు, నీ గెలుపు కంటే నా ఓటమి గురించే ఎక్కువగా మాట్లాడుతున్నారు”.. మధ్యప్రదేశ్ మాజీ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా ఈ కవితాత్మక వీడియో సోషల్ మీడియాలో అంతకంతకూ వైరల్ అవుతోంది. దాతియా స్థానంలో కాంగ్రెస్‌కు చెందిన రాజేంద్ర భారతి మిశ్రాను ఓడించారు. మిశ్రా మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి గట్టి పోటీదారుగా ఉన్నారు. అలాంటి వ్యక్తి అనుహ్యంగా ఓటమిని చవిచూశారు.
తెలంగాణలో కేసీఆర్, రేవంత్ రెడ్డిలను ఓడించిన కేవీ రమణా రెడ్డి.. దేశవ్యాప్తంగా బిగ్ ఫేమస్ అయ్యారు. తెలంగాణలోని కామారెడ్డి స్థానం నుంచి కేసీఆర్, రేవంత్‌పై కేవీఆర్ విజయం సాధించారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉండగా, ముఖ్యమంత్రి పదవికి రేవంత్ పోటీ పడ్డారు. అయితే వారి ఇద్దరూ కూడా మరో స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఇక్కడ విచిత్రమేమంటే..? కామారెడ్డిలో పోటీ చేసిన బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు ముగ్గురు కూడా తెలంగాణ శాసన సభలో అడుగుపెడుతున్నారు.
ఇక మిజోరాంలోని ఐజ్వాల్ ఈస్ట్-1 స్థానంలో బలమైన నాయకుడు, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జోరంతంగాపై లతన్‌సంగా విజయం సాధించారు. 79 ఏళ్ల జోరమ్‌తంగాకు ఇదే చివరి ఎన్నికలు అని భావిస్తున్నారు. అతను మిజో నేషనల్ ఫ్రంట్ జాతీయ అధ్యక్షుడు కూడా ఉన్నారు.
1. సతీష్ పూనియాపై ప్రశాంత్ శర్మ విజయం
రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ సంచలనం నమోదైంది. సతీష్ పూనియాపై ప్రశాంత్ శర్మ విజయం సాధించారు. జైపూర్‌లోని అమెర్ స్థానంలో బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సతీష్ పూనియా పోటీలో ఉన్నారు. ముఖ్యమంత్రి పదవికి పూనియా కూడా బలమైన పోటీదారుగా ఉన్నారు. అయితే కాంగ్రెస్‌కు చెందిన ప్రశాంత్ శర్మ ఆయనను ఓడించారు. 2013 నుంచి ఈ సీటును కాంగ్రెస్ ఆధీనంలోకి తీసుకుంది. ప్రశాంత్ శర్మ తొలిసారి గెలిచి అసెంబ్లీకి చేరుకున్నారు. ప్రశాంత్ కూడా 2018 ఎన్నికల్లో పోటీ చేశారు. అయితే పూనియా అతనిని ఓడించాడు.
ప్రశాంత్ శర్మ రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకున్నారు. అతని తండ్రి సహదేవ్ శర్మ ఈ స్థానం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. జైపూర్ కాంగ్రెస్‌కు బలమైన నాయకుడు. గత ఓటమి నుంచి ప్రశాంత్ ఈ ప్రాంతంలో చురుగ్గా ఉన్నారు. ఇదిలావుంటే ఎన్నికల్లో ఓటమి తర్వాత మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయవద్దని సతీష్ పూనియా నిర్ణయించుకోవడం విశేషం. ఇకపై అమర్ నియోజకవర్గ ప్రజలకు సేవ చేయలేనని పూనియా సోషల్ మీడియా వేదికగా రాసుకొచ్చారు.
2. ఛత్తీస్‌గఢ్ కీలక మంత్రి రవీంద్ర చౌబే పరాజయం
ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ కీలక పరిణామం చోటు చేసుకుంది. భూపేష్ బఘెల్ ప్రభుత్వంలో బలమైన నేత, మంత్రి రవీంద్ర చౌబే ఓటమి చవి చూశారు. ఛత్తీస్‌గఢ్‌లోని సాజా స్థానం నుండి భారతీయ జనతా పార్టీకి చెందిన ఈశ్వర్ సాహు చేతిలో ఓడిపోయారు. ఈశ్వర్ సాహుకు ఇది మొదటి ఎన్నిక. కాగా, చౌబే 7 సార్లు ఎమ్మెల్యే గెలుస్తూ వస్తున్నారు. చౌబే అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. ఇక ఈశ్వర్ సాహు గురించి చెప్పాలంటే సాహుకు రాజకీయ నేపథ్యం లేదు. తన కుమారుడు భువనేశ్వర్‌కు న్యాయం చేసేందుకు బీజేపీ సాహుకు టికెట్ ఇచ్చింది. ఏప్రిల్ 2023లో కవర్ధాలో జరిగిన మత హింసలో భువనేశ్వర్ చనిపోయాడు. ఈ హింసకు భూపేష్ సర్కార్‌కే కారణమని బీజేపీ ఆరోపించింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఈశ్వర్ సాహుకు టికెట్ కేటాయించిన బీజేపీ.. స్వయంగా హోంమంత్రి అమిత్ షా ఈశ్వర్ కోసం ప్రచారం చేశారు. సాహును గెలిపించాలని, తన కుమారుడికి న్యాయం చేయాలని షా సాజా నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
3. నరోత్తమ్ మిశ్రా ఓటమి
మధ్యప్రదేశ్‌లోని దతియా స్థానం నుండి జరిగిన ఎన్నికల్లో శివరాజ్ కేబినెట్ సీనియర్ నాయకుడు నరోత్తమ్ మిశ్రా ఓడిపోయారు. మిశ్రా కాంగ్రెస్‌కు చెందిన రాజేంద్ర భారతి చేతిలో పరాజయం పాలయ్యారు. భారతి మిశ్రాపై ఇప్పటికే మూడుసార్లు ఎన్నికల్లో పోటీ చేసినా ఓటమి చవిచూడాల్సి వచ్చింది. నరోత్తమ్ ముఖ్యమంత్రి పదవికి పోటీదారుగా ఉన్నారు. 2020లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషించారు. ఈసారి కాంగ్రెస్ దతియా సీటుపై గట్టి పటిష్టతను ఏర్పాటు చేసుకుంది. తొలుత భారతి టిక్కెట్టును పార్టీ కట్ చేయగా, కార్యకర్తలంతా ఏకమైన వెంటనే పార్టీ టిక్కెట్టు మార్చి భారతిని రంగంలోకి దింపింది. ఎల్‌ఎల్‌బీ వరకు చదివిన భారతి 1980లలో రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 1985లో అతి పిన్న వయస్కులైన ఎమ్మెల్యేగా రికార్డు సృష్టించారు.
4. కేసీఆర్, రేవంత్ రెడ్డిలను ఓడించిన కేవీఆర్
తెలంగాణ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 8 సీట్లతో సరిపెట్టుకుంది. అందులో ఒకటి కామారెడ్డి. కాటిపల్లి వెంకటరమణారెడ్డి.తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితం తర్వాత రాజకీయ వర్గాల్లో మార్మోగుతున్న పేరు. నిన్నటిదాకా కామారెడ్డి జిల్లా నేతగానే ఉన్న వెంకటరమణారెడ్డి ఒక్కసారిగా దేశ వ్యాప్తంగా సంచలనం అయిపోయారు. తెలంగాణ సీఎం కేసీఆర్, సీఎం అభ్యర్థి, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రత్యర్థులుగా పోటీ పడిన కామారెడ్డిలో వెంకటరమణారెడ్డి విజయం సాధించడమే ఇందుకు కారణం. కెవీఆర్ పూర్తి పేరు కత్తిపల్లి, వేకంట రమణారెడ్డి. ఈ స్థానం నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిలను ఓడించారు కేవీఆర్. కామారెడ్డి స్థానంలో కేవీఆర్‌కు 66,652 ఓట్లు రాగా, కేసీఆర్‌కు 59,911 ఓట్లు, రేవంత్‌రెడ్డికి 54,916 ఓట్లు వచ్చాయి. ఇక్కడ కేవీఆర్ 6,741 ఓట్లతో గెలుపొందారు.
కెవీఆర్ పౌర రాజకీయాల నుండి తన వృత్తిని ప్రారంభించారు. 12వ తరగతి ఉత్తీర్ణత సాధించిన కెవీఆర్ నిజామాబాద్ కార్పొరేషన్ సభ్యుడిగా ఉన్నారు. కామారెడ్డిని స్మార్ట్‌గా తీర్చిదిద్దేందుకు కేసీఆర్ ప్రభుత్వం మాస్టర్‌ప్లాన్ సిద్ధం చేయడంతో కేవీఆర్ నేతృత్వంలో ఈ ప్రాంత రైతులు పెద్ద ఎత్తున ఉద్యమించారు. 2018లో కేవీఆర్ కూడా ఈ స్థానం నుంచి పోటీ చేసినా ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. ఈ ఎన్నికల్లో కేవీఆర్ తరఫున ప్రధాని నరేంద్ర మోదీ ప్రచారం చేశారు.
5. సీఎం లాల్తాన్‌సంగా జోరమ్‌తంగా ఓటమి
మిజోరం ముఖ్యమంత్రి జోరంతంగా ఐజ్వాల్ ఈస్ట్-1 స్థానం నుంచి పోటీ చేశారు. ఈ సీటు అతనికి బలమైన కంచుకోటగా పరిగణిస్తారు. అయితే JPM పార్టీ అభ్యర్థి లల్తన్‌సంగ ఈ ఎన్నికల్లో ఆయనను ఓడించారు. ఎన్నికల్లో ముఖ్యమంత్రిని ఓడించిన అనంతరం లల్తన్‌సంగ పాత్రికేయులతో మాట్లాడుతూ.. ప్రజలు ముఖ్యమంత్రిపై ఆగ్రహంతో ఉన్నారని, ఇదే విజయానికి అతి పెద్ద కారణమని అన్నారు. జోరంతంగా మిజోరాం శక్తివంతమైన నాయకుడు. 1990 నుండి మిజో నేషనల్ ఫ్రంట్ అధ్యక్ష పదవిలో కొనసాగుతున్నారు. జోరంతంగా 15 ఏళ్లుగా మిజోరం ముఖ్యమంత్రిగా కూడా ఉన్నారు. అలాంటి వ్యక్తిని లల్తాన్‌సంగ మట్టి కరిపించారు. లల్తాన్‌సంగ గురించి చెప్పాలంటే, 2008లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి రాజకీయాల్లో చురుకుగా ఉంటున్నారు. జోరమ్‌తంగాను ఓడించిన తర్వాత లల్తాన్‌సంగ పేరు దేశవ్యాప్తంగా మార్మోగుతోంది.
జెయింట్ కిల్లర్ అంటే ఏమిటి?
ఈ పదం మొదటిసారిగా 1970లో భారతదేశ రాజకీయ వర్గాల్లో ప్రతిధ్వనించింది. 1967లో సోషలిస్ట్ నాయకుడు జార్జ్ ఫెర్నాండెజ్ ముంబై సౌత్ స్థానం నుండి సీనియర్ కాంగ్రెస్ నాయకుడు SK పాటిల్‌ను ఓడించారు. ఆ సమయంలో పాటిల్ రైల్వే మంత్రిగా కొనసాగుతున్నారు. జార్జ్ రైల్వే యూనియన్ సభ్యుడుగా ఉన్నారు. ఈ ఓటమి తర్వాత పాటిల్ రాజకీయంగా ఎదగలేకపోయారు. 1977 ఎన్నికల్లో ఇందిరా గాంధీని రాజనారాయణ ఓడించిన తర్వాత కూడా ఈ మాట రాజకీయ వర్గాల్లో విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. రాజకీయ వర్గాల్లో, జెయింట్ కిల్లర్ అంటే ఒక నాయకుడు ఎన్నికలలో ఓడిపోయిన, అతని రాజకీయ జీవితం ఇబ్బందుల్లో ఉన్న వ్యక్తిగా భావిస్తుంటారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…