Big News Big Debate: టీమ్ రేవంత్.. తెలంగాణ క్యాబినెట్‌పై ఉత్కంఠ.. ఛాన్స్ ఎవరికి..

ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డిని ప్రకటించిన హస్తిన పెద్దలకు మంత్రివర్గ కూర్పు కత్తిమీదసాముగా మారింది. పార్టీనే నమ్మకున్న సీనియర్లున్నారు. లాయల్టీతో అంటిపెట్టుకున్న నాయకులున్నారు. కొత్తగా మంత్రి పదవి హామీతో పార్టీలో చేరిన నాయకులున్నారు. అందరికీ ఉన్న 17లో సర్దుబాటు చేయడం కష్టంగా మారింది.

Big News Big Debate: టీమ్ రేవంత్.. తెలంగాణ క్యాబినెట్‌పై ఉత్కంఠ.. ఛాన్స్ ఎవరికి..
Big News Big Debate
Follow us

|

Updated on: Dec 06, 2023 | 6:49 PM

ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డిని ప్రకటించిన హస్తిన పెద్దలకు మంత్రివర్గ కూర్పు కత్తిమీదసాముగా మారింది. పార్టీనే నమ్మకున్న సీనియర్లున్నారు. లాయల్టీతో అంటిపెట్టుకున్న నాయకులున్నారు. కొత్తగా మంత్రి పదవి హామీతో పార్టీలో చేరిన నాయకులున్నారు. అందరికీ ఉన్న 17లో సర్దుబాటు చేయడం కష్టంగా మారింది. దీంతో నిన్నటి నుంచి రేవంత్‌ రెడ్డితో పాటు పార్టీ సీనియర్లు అధిష్టానం పెద్దలతో వరుసగా సమావేశం అవుతూ మంత్రివర్గ జాబితాపై కసరత్తు చేస్తున్నారు.

మంత్రి వర్గంలో చోటు ఆశిస్తున్న సీనియర్లు ఢిల్లీలో మకాం వేసి మరీ లాబీయింగ్‌ చేస్తున్నరు. తమకు అవకాశం ఇవ్వాలని అదిష్టానం పెద్దల దగ్గర వినతిపత్రాలు అందజేస్తున్నారు. పాతపరిచయాలను ఉపయోగించి తమకు మంత్రివర్గంలో చోటు వచ్చేలా విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే భట్టి, ఉత్తమ్‌, శ్రీధర్‌ బాబుకు క్యాబినెట్‌లో చోటు ఖాయం అయినట్టు ప్రచారం జరుగుతుండగా మిగిలినవారు కూడా తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు.

బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ లైవ్ వీడియో చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..