AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Revanth Reddy: తెలంగాణ టెట్‌ పరీక్షను వెంటనే వాయిదా వేయాలి.. రేవంత్‌ రెడ్డి డిమాండ్‌..

Revanth Reddy: తెలంగాణలో ఈనెల 12న నిర్వహించనున్న టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (TS TET 2022) పరీక్షను వెంటనే వాయిదా వేయాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. అదే రోజు రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌ (ఆర్‌ఆర్‌బీ) పరీక్ష కూడా...

Revanth Reddy: తెలంగాణ టెట్‌ పరీక్షను వెంటనే వాయిదా వేయాలి.. రేవంత్‌ రెడ్డి డిమాండ్‌..
Revanth Reddy
Narender Vaitla
|

Updated on: Jun 10, 2022 | 12:10 PM

Share

Revanth Reddy: తెలంగాణలో ఈనెల 12న నిర్వహించనున్న టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (TS TET 2022) పరీక్షను వెంటనే వాయిదా వేయాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. అదే రోజు రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌ (ఆర్‌ఆర్‌బీ) పరీక్ష కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఒకేరోజు రెండు పోటీ పరీక్షలు ఉంటే అభ్యర్థులు ఒక పరీక్షను కోల్పోవాల్సి వస్తుందని రేవంత్‌ రెడ్డి ట్వీట్ చేశారు. ‘ఆర్‌ఆరీఆర్‌బీ జాతీయ స్థాయిలో నిర్వహించే పరీక్ష, టెట్‌ రాష్ట్ర స్థాయిలో నిర్వహించే పరీక్ష. కాబట్టి టెట్‌ పరీక్షను మరో రోజు నిర్వహించుకునే అవకాశం ఉంటుంది. వెంటనే తెలంగాణలో టెట్ పరీక్షను వాయిదా వేయాలి’ అంటూ రేవంత్‌ రెడ్డి ట్వీట్ చేశారు.

ఇదిలా ఉంటే టెట్‌ పరీక్షను వాయిదా వేయాలనే వాదన రావడం ఇదే తొలిసారి కాదు. కొన్ని రోజుల క్రితం కొంతమంది అభ్యర్థులు టెట్‌ పరీక్షను వాయిదా వేయాలని కేటీఆర్‌కు ట్విట్వర్‌ వేదికగా విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. సదరు ట్వీట్స్‌ను విద్యాశాఖమ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి రీట్వీట్ చేసిన కేటీఆర్‌. పరీక్షల వాయిదా విషయంపై ఆలోచించండి అంటూ ట్వీట్‌ చేశారు. అయితే దీనిపై సబితా అప్పట్లోనే ఫుల్‌ క్లారిటీ ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో టెట్‌ను వాయిదా వేయమని. పరీక్షకు సంబంధించిన అన్నీ ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. తాజాగా రేవంత్‌ రెడ్డి ట్వీట్‌తో ఈ అంశం మరో సారి తెరపైకి వచ్చింది.

ఇక జూన్‌ 12న జరగాల్సిన టెట్‌ పరీక్ష కోసం సర్వం సిద్ధం చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే హాల్‌ టికెట్‌లు విడుదల కూడా చేశారు. టెట్‌ పరీక్ష అనంతరం పరీక్షా ఫలితాలను ఈ నెల 27న విడుదల చేయనున్నారు. ఆర్‌ఆర్‌బీ పరీక్షలు సైతం జూన్‌ 12న మొదలై 17 వరకు కొనసాగనున్నాయి. ఈ పరీక్షలు రాసే అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా షాలి‌మా‌ర్‌-సి‌కింద్రా‌బాద్‌, బిలా‌స్‌‌పూ‌ర్‌-సి‌కింద్రా‌బాద్‌, భువ‌నే‌శ్వర్‌-‌తం‌బా‌రామ్‌, గుంటూ‌రు-భ‌ద్రక్‌ స్టేషన్ల మార్గా‌లలో ఈ నెల 10, 11, 13 తేదీ‌లలో దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతోన్న విషయం తెలిసిందే.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?