AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahila Darbar Highlights: నన్ను ఆపే శక్తి ఎవరికీ లేదు.. ప్రజల పక్షాన బలమైన శక్తిగా ఉంటా..

Tamilisai Soundararajan Mahila Darbar Updates: రాజ్ భవన్ లో మహిళా దర్బార్ నిర్వాహిస్తున్నారు తెలంగాణ గవర్నర్ తమిళిసై. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు నెలకోసారి ప్రజాదర్బర్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు గవర్నర్.మధ్యాహ్నం 12 గంటల నుంచి ఒంటి వరకు..

Mahila Darbar Highlights: నన్ను ఆపే శక్తి ఎవరికీ లేదు.. ప్రజల పక్షాన బలమైన శక్తిగా ఉంటా..
Mahila Darbar
Sanjay Kasula
|

Updated on: Jun 10, 2022 | 1:30 PM

Share

రాజ్ భవన్ లో మహిళా దర్బార్ నిర్వాహిస్తున్నారు తెలంగాణ గవర్నర్ తమిళిసై. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు నెలకోసారి ప్రజాదర్బర్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు గవర్నర్. మధ్యాహ్నం 12 గంటల నుంచి ఒంటి వరకు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో గవర్నర్ మాట్లాడుతూ.. మహిళా దర్బార్‌లో గవర్నర్‌ తమిళిసై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలను గవర్నర్ కలుస్తుందా అని అడిగారన్నారు. కరోనా సమయంలో సెక్యూరిటీ వాళ్లు వద్దని చెప్పినా.. నిమ్స్‌ ఆస్పత్రిలో ప్రజలను కలిశానన్నారు గవర్నర్‌. తెలంగాణ మహిళలకు సోదరిగా మీ వెంటే ఉంటానని చెప్పారు. మహిళలు, ప్రభుత్వానికి వంతెనలా ఉంటానని.. తాను చేసే పనులకు ఎవరు అడ్డంచెప్పినా పట్టించుకోనన్నారు. తనను ఎవరూ అడ్డుకోలేరని.. ప్రభుత్వానికి తన స్వరం బలంగా వినిపిస్తామన్నారు.

రాష్ట్ర గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తమిళిసై వినూత్న కార్యక్రమాలతో తనదైన ముద్ర వేస్తున్నారు. అందులో భాగంగా గతంలో ప్రజాదర్బార్ నిర్వహించారు. రాజ్‌భవన్ బయట ఫిర్యాదుల పెట్టె ఏర్పాటు చేయించారు. ప్రస్తుతం మహిళా దర్బార్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

రాజ్ భవన్‌లో చేపడుతున్న కార్యక్రమాలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. అయినప్పటికీ ప్రజా సమస్యల పరిష్కారంలో వెనకడుగు వేయబోమని గవర్నర్ తమిళిసై గతంలోనే స్పష్టం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో మహిళా దర్బార్ నిర్వహించనున్నట్టు ప్రకటించటం మరోసారి రాజకీయంగా చర్చలకు దారితీసింది.

గవర్నర్ మహిళా దర్బార్ నిర్వహించడాన్ని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్వాగతించగా…. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో రాజ్‌భవన్ రాజకీయాలకు కేంద్రంగా మారుతోందని విమర్శించారు.

తెలంగాణ వార్తల కోసం..

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 10 Jun 2022 01:13 PM (IST)

    మహిళా దర్బార్‌లో గవర్నర్‌ తమిళిసై కీలక వ్యాఖ్యలు..

    మహిళా దర్బార్‌లో గవర్నర్‌ తమిళిసై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలను గవర్నర్ కలుస్తుందా అని అడిగారన్నారు. కరోనా సమయంలో సెక్యూరిటీ వాళ్లు వద్దని చెప్పినా.. నిమ్స్‌ ఆస్పత్రిలో ప్రజలను కలిశానన్నారు గవర్నర్‌. తెలంగాణ మహిళలకు సోదరిగా మీ వెంటే ఉంటానని చెప్పారు. మహిళలు, ప్రభుత్వానికి వంతెనలా ఉంటానని.. తాను చేసే పనులకు ఎవరు అడ్డంచెప్పినా పట్టించుకోనన్నారు. తనను ఎవరూ అడ్డుకోలేరని.. ప్రభుత్వానికి తన స్వరం బలంగా వినిపిస్తామన్నారు.

  • 10 Jun 2022 01:10 PM (IST)

    నన్ను ఆపే శక్తి ఎవరికీ లేదు.. ప్రజల పక్షాన బలమైన శక్తిగా ఉంటాను.. – గవర్నర్

    తెలంగాణ ప్రజల కోసమే పనిచేస్తున్నాని అన్నారు. తనను ఆపే శక్తి ఎవరికీ లేదన్నారు. ప్రజల పక్షాన బలమైన శక్తిగా ఉంటానంటూ హామీ ఇచ్చారు.

  • 10 Jun 2022 01:04 PM (IST)

    ప్రతి ఒక్కరితో వ్యక్తిగతంగా మాట్లాడిన గవర్నర్

    రాజ్ భవన్ లో మహిళా దర్బార్‌కు వచ్చిన మహిళలతో వ్యక్తిగతంగా మాట్లాడారు. వారు చెప్పిన సమస్యలను విన్నారు. సమస్యను తప్పకుండా పరీష్కరిస్తానంటూ వారికి హామీ ఇచ్చారు. వారి నుంచి వినతి పత్రాన్ని తీసుకుని అధికారులకు అందించారు.

  • 10 Jun 2022 01:00 PM (IST)

    కోవిడ్ సమయంలో ఆస్పత్రులకు వెళ్లాను – గవర్నర్

    కరోనా సమయంలో కూడా తాను ఆస్పత్రుల్లోకి వెళ్లి బాధితులను కలిసినట్లుగా గవర్నర్ గుర్తు చేశారు. ఆ సమయంలో కూడా తాను ఆరు గ్రామాలను దత్తత తీసుకున్నట్లు తెలిపారు.

  • 10 Jun 2022 12:56 PM (IST)

    మహిళా దర్బార్ ఎందుకూ అంటూ ప్రశ్నిస్తున్నారు.. -గవర్నర్

    రాజ్‌భవన్‌లో మహిళా దర్బార్ నిర్వాహించడాన్ని కొందరు ప్రశ్నిస్తున్నారని గవర్నర్ అన్నారు. తాను ఎందుకు ఈ కార్యక్రమం తీసుకున్న సంగతిని వెల్లడించారు. ప్రజల సమస్యలను తాను తెలుసుకోవడంలో తప్పులేదని అన్నారు.

  • 10 Jun 2022 12:50 PM (IST)

    తెలుగులో ప్రసంగించిన గవర్నర్ తమిళసై

    రాజ్ భవన్ లో మహిళా దర్బార్ నిర్వాహిస్తున్నారు తెలంగాణ గవర్నర్ తమిళిసై. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు నెలకోసారి ప్రజాదర్బర్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు గవర్నర్. తన ప్రసంగాన్ని తెలుగు మొదలు పెట్టారు.

  • 10 Jun 2022 12:48 PM (IST)

    తమిళిసై వినూత్న కార్యక్రమాలతో తనదైన ముద్ర..

    రాష్ట్ర గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తమిళిసై వినూత్న కార్యక్రమాలతో తనదైన ముద్ర వేస్తున్నారు. అందులో భాగంగా గతంలో ప్రజాదర్బార్ నిర్వహించారు.

  • 10 Jun 2022 12:48 PM (IST)

    ఒంటి వరకు ప్రజాదర్బర్ కార్యక్రమం..

    తెలంగాణ గవర్నర్ తమిళిసై. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు నెలకోసారి ప్రజాదర్బర్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు గవర్నర్.మధ్యాహ్నం 12 గంటల నుంచి ఒంటి వరకు కార్యక్రమం జరుగుతుంది.

Published On - Jun 10,2022 12:43 PM