Kushaiguda: వెంకన్న ఆలయంలోకి చోరీకి వెళ్లి ప్రాణాలు పోగొట్టుకున్న దొంగ.. పోలీసుల చేతికి సీసీ ఫుటేజ్
దొంగను పట్టుకోడానికి ప్రయత్నిస్తున్న టైమ్ లో వాచ్ మెన్ రంగస్వామి పై రాళ్లు విసిరాడు.. తనపై దాడి చేస్తున్న దొంగను ప్రతిఘటించడం కోసం వాచ్ మెన్ తన చేతిలో ఉన్న కర్రతో దొంగను బలంగా కొట్టాడు. దీంతో దొంగ తలకు తీవ్ర గాయాలయ్యి.. గుడిలోనే ప్రాణాలు కోల్పోయాడు.
పక్కగా ప్లాన్ చేసి గుడిలో చోరీ చేయడానికి ప్రయత్నించిన ఓ దొంగ.. అదే గుడిలో రక్తపు మడుగులో శవమయ్యాడు.. హైదరాబాద్ లోని కుషాయిగూడలోని వెంకటేశ్వర స్వామి టెంపుల్ లో హుండీ డబ్బులు కొట్టేయడానికి వచ్చిన దొంగను వాచ్ మెన్ కొట్టడంతో అక్కడికక్కడే చనిపోయాడో దొంగ.. డెడ్ బాడీని పోస్ట్ మార్టం కోసం గాంధీ మార్చురీకి తరలించారు.. మంగళవారం రాత్రి జరిగిన ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. వివరాల్లోకి వెళ్తే.. కుషాయిగూడ లోని వెంకటేశ్వర స్వామి టెంపుల్ లో అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఒక దొంగ చొరబడ్డాడు. దొంగతనం చేయాలని ముందే ప్లాన్ చేసుకున్న దొంగ ఆలయం పై పక్కా గా రెక్కీ నిర్వహించి రాత్రి ఎవరూ లేరని భావించి చోరీకి ట్రై చేశాడు.. మొదట ఒక హుండీ నీ పగొలగొట్టెందుకు ప్రయత్నించగా అది ఎంతకీ తెరచుకొకపోవడం తో పక్కనున్న మరో హుండీని పగలగొట్టెందుకు ప్రయత్నించాడు..భారీగా సౌండ్ రావడంతో.. అక్కడే ఉన్న వాచ్ మెన్ దొంగను గమనించి అడ్డుకోవడానికి ప్రయత్నించాడు.
దొంగను పట్టుకోడానికి ప్రయత్నిస్తున్న టైమ్ లో వాచ్ మెన్ రంగస్వామి పై రాళ్లు విసిరాడు.. తనపై దాడి చేస్తున్న దొంగను ప్రతిఘటించడం కోసం వాచ్ మెన్ తన చేతిలో ఉన్న కర్రతో దొంగను బలంగా కొట్టాడు. దీంతో దొంగ తలకు తీవ్ర గాయాలయ్యి.. గుడిలోనే ప్రాణాలు కోల్పోయాడు. స్థానికంగా ఉన్నవారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకొని ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హుండీని దొంగలించడానికి దొంగ ప్రయత్నం చేసిన క్రమంలో అడ్డుకుపోయిన రంగయ్య అనే వాచ్ మెన్ పై దొంగ దాడి చేశాడని, ఈ క్రమంలోనే ఈ ఘటన జరిగిందని చెప్పారు ఏసీపీ వెంకట్ రెడ్డి.
మంగళవారం రాత్రి దొంగ గోడ దూకి టెంపుల్ లోకి వచ్చాడన్నారు ఆలయ ఈవో.. హుండీ పగలగొడుతుండగా వాచ్మెన్ చూసి కొట్టడంతో చనిపోయాడన్నారు.. టెంపుల్ లోని సీసీ కెమెరాల ఫుటేజ్ పోలీసులకు అప్పగించామన్నారు. దొంగ వద్ద దొరికిన సెల్ ఫోన్ ఆధారంగా అతడు కామారెడ్డి సమీపంలోని ఆరేపల్లి గ్రామానికి చెందిన రాజుగా పోలీసులు గుర్తించారు. అతని కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం అందించారు. పోస్ట్ మార్టం కోసం డెడ్ బాడీని గాంధీకి మార్చురీకి పంపించామని.. పోస్ట్ మార్టం అనంతరం డెడ్ బాడీని బంధువులకు అప్పగిస్తామన్నారు పోలీసులు. మొత్తానికి దొంగను అడ్డుకునే ప్రయత్నం చేసిన వాచ్ మెన్ అనుకోకుండా అతడి ప్రాణాలు పోవటానికి కారణం అయ్యాడు.
Reporter – Pranitha
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..