AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nalgonda: అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న ఎమ్మెల్యే.. హఠాత్తుగా దూసుకొచ్చిన ఆశా వర్కర్‌తో అంతా షాక్

సమస్య ఏదైనా ఉంటే అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్తాం. సమస్యల పరిష్కారానికి ఆందోళన చేస్తుంటారు. కానీ ఓ ఆశా వర్కర్ మాత్రం ఎమ్మెల్యే ఎదుట చేసిన తీరు అందరినీ అశ్చర్యానికి గురి చేసింది. ఈ ఘటన నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం పార్వతీపురంలో చోటుచేసుకుంది.

Nalgonda: అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న ఎమ్మెల్యే.. హఠాత్తుగా దూసుకొచ్చిన ఆశా వర్కర్‌తో అంతా షాక్
Asha Worker Suicide Attempt
M Revan Reddy
| Edited By: |

Updated on: Jan 31, 2024 | 8:21 AM

Share

సమస్య ఏదైనా ఉంటే అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్తాం. సమస్యల పరిష్కారానికి ఆందోళన చేస్తుంటారు. కానీ ఓ ఆశా వర్కర్ మాత్రం ఎమ్మెల్యే ఎదుట చేసిన తీరు అందరినీ అశ్చర్యానికి గురి చేసింది.

నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం పార్వతీపురంలో విష జ్వరాలు సోకాయి. ఈ గ్రామానికి చెందిన ఆశా వర్కర్ తన బాధ్యతను నిర్వర్తించింది. కానీ ఇటీవల విషజ్వరాలతో గ్రామస్తులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. విషయం తెలుసుకున్న నాగార్జున సాగర్ ఎమ్మెల్యే జై వీర్ రెడ్డి గ్రామాన్ని సందర్శించి, అధికారులతో సమీక్ష నిర్వహించారు. విష జ్వరాలపై గ్రామస్తులతో ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి మాట్లాడుతుండగా ఒక్కసారిగా ఆశావర్కర్ వెంకటలక్ష్మి అక్కడికి వచ్చి బ్లేడుతో తన చేతిని గాయపర్చుకుంది.

హఠాత్తు పరిణామంతో ఎమ్మెల్యేతో పాటు అక్కడున్న అధికారులు, గ్రామస్తులు అవాక్కయ్యారు. గ్రామానికి చెందిన కొందరు స్థానిక నేతలు తనను వేధిస్తున్నారని ఎమ్మెల్యే ఎదుట వాపోయింది. వేధింపులు భరించలేకపోతున్నానంటూ, వెంట తెచ్చుకున్న బ్లేడుతో తన ఎడమ చేతిపై మూడు గాట్లు పెట్టుకుంది. వెంటనే అక్కడే ఉన్న మరో ఇద్దరు ఆశా వర్కర్లు వెంకటలక్ష్మికి ప్రాథమిక చికిత్స చేశారు. వెంకటలక్ష్మికి పెద్దగా గాయం కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. దీంతో వెంకటలక్ష్మిని వేధిస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే జై వీర్ రెడ్డి హామీ ఇచ్చారు. సమస్యలుంటే చెప్పుకోవాలి కానీ ఇలా గాయపర్చుకోవడమేంటని ఎమ్మెల్యే వెంకటలక్ష్మిని సున్నితంగా మందలించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

ప్రభాస్ లేకపోతే చనిపోయేవాడిని.. చత్రపతి శేఖర్ ఎమోషనల్..
ప్రభాస్ లేకపోతే చనిపోయేవాడిని.. చత్రపతి శేఖర్ ఎమోషనల్..
ధర ఎక్కువైనా ఈ పండును కచ్చితంగా తినండి.. ఎందుకో తెలిస్తే..
ధర ఎక్కువైనా ఈ పండును కచ్చితంగా తినండి.. ఎందుకో తెలిస్తే..
సిమ్ కార్డులతో భారీ సైబర్ క్రైమ్.. చెక్‌ పెట్టిన ఏపీ సీఐడి!
సిమ్ కార్డులతో భారీ సైబర్ క్రైమ్.. చెక్‌ పెట్టిన ఏపీ సీఐడి!
విజయ్ హజారే ట్రోఫీకి విరాట్, రోహిత్ శాలరీ ఎంత?
విజయ్ హజారే ట్రోఫీకి విరాట్, రోహిత్ శాలరీ ఎంత?
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..