Somesh Kumar: మాజీ సీఎస్ సోమేష్ కుమార్ యాచారం భూములపై ఫోకస్ పెట్టిన ఏసీబీ..!
తీగలాగితే డొంక కదిలింది. శివ బాలకృష్ణ అక్రమాస్తులను కదిలిస్తే తాజాగా మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఆస్తుల చిట్టా తెరపైకి వచ్చింది. ఎకరాకు కోటి పలికే భూములను ఆరేళ్ల కిందట అతి చౌకగా కొనేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫార్మాసిటీ మాటున క్విడ్ ప్రో కో వ్యవహారం ఉందా? అనుమానాలు సరే అసలు నిజాలేంటి? మాజీ సీఎస్ సోమేష్‌కుమార్ యాచారం భూములపై ఫోకస్ పెట్టింది ఏసీబీ.
తీగలాగితే డొంక కదిలింది. శివ బాలకృష్ణ అక్రమాస్తులను కదిలిస్తే తాజాగా మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఆస్తుల చిట్టా తెరపైకి వచ్చింది. ఎకరాకు కోటి పలికే భూములను ఆరేళ్ల కిందట అతి చౌకగా కొనేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫార్మాసిటీ మాటున క్విడ్ ప్రో కో వ్యవహారం ఉందా? అనుమానాలు సరే అసలు నిజాలేంటి? మాజీ సీఎస్ సోమేష్‌కుమార్ యాచారం భూములపై ఫోకస్ పెట్టింది ఏసీబీ.
సోమేష్‌కుమార్.. తెలంగాణ రాష్ర్ట మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి. అప్పట్లో సకల జనుల సమగ్ర సర్వేలో కీలకంగా వ్యవహరించారు. నిజానికి ఆయన ఆంధ్రప్రదేశ్ కేడర్ ఐఎఎస్ అధికారి. కానీ తెలంగాణలోనే ఉండి కీలక పదవులు నిర్వహించారు. ఏపీకి వెళ్లాలని కోర్టు తేల్చి చెప్పింది. ఆ క్రమంలో ఆయన వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. తాజాగా యాచారంలో ఓ భూమి కొనుగోలుకు సంబంధించి సోమేష్ కుమార్ పై మళ్లీ తెరపైకి వచ్చింది. 25 ఎకరాల భూక్రయవిక్రయాల వెనుక క్విడ్ ప్రోకో వ్యవహరం ఉందనే అనుమానాలు వ్యక్తమయ్యాయి.
రంగారెడ్డి జిల్లా యాచారం మండలం కొత్తపల్లిలో సోమేష్‌కుమార్ భార్య పేరిట రిజిస్ట్రేషన్ అయివున్న 25 ఎకరాలు భూమికి సంబంధించి ఏసీబీ దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ఇటీవలే ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆ కేసు విచారణ క్రమంలో సోమేష్ కుమార్ యాచారం భూముల వ్యవహారం తెరపైకి వచ్చింది. హైదరాబాద్‌లో ఉన్న తమ ఇంటిని అమ్మి 2018లో యాచారంలో భూములు కొన్నామనేది సోమేష్ కుమార్ వెర్షన్.
అయితే ఆ ఏరియాలో ఫార్మాసిటీ వస్తుందని ముందే తెలిసి ప్లాన్ ప్రకారం.. యాచారంలో భూములు కొన్నారనేది ఆరోపణ. నలుగురు రైతుల నుంచి ఎకరాకు రూ. 2 లక్షల చొప్పున అతి దక్కువ ధరకు 25 ఎకరాలు కొనుగోలు చేయడంతో క్విడ్ ప్రోకో జరిగిందనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. అంతేకాదు ధరణిలోకి 5,235 సర్వే నెంబర్ ఎలా వచ్చిందనేది మరో డౌట్. ఇక ఆ భూములను సేల్ డీడ్ ద్వారా కొన్నారా? లేదా సాదాబైనమా ద్వారానా? స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ వెబ్‌సైట్‌లో క్రయవిక్రయాలకు సంబంధించి వివరాలున్నాయా? అన్నదానిపై ఏసీబీ అధికారులు విచారణ చేపట్టారు.
అయితే సర్వీసులో ఉన్నప్పుడు కొనుగోలు చేశారు కాబట్టి..D.O.P.Tకి తన ఆస్తులకు సంబంధించి ఈ భూ వివరాలను అందించారా? లేదా? ఇలా అన్ని కోణాల్లో ఏసీబీ ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి తీసుకున్నాకే యాచారంలో భూమి కొన్నామంటున్నారు సోమేష్‌కుమార్. చూడాలి మరీ ఏసీబీ దర్యాప్తులో నిజా నిజాలు బయటకు వస్తాయో..? లేదో..?
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…