AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GHMC: గ్రేటర్‌ హైదరాబాద్‌వాసులకు గుడ్‌న్యూస్.. ఆస్తిపన్ను చెల్లింపుపై సర్కార్ కీలక నిర్ణయం!

గ్రేటర్ హైదరాబాద్ వాసులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అస్తి పన్ను చెల్లింపుదారులకు వెసులుబాటు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆస్తి పన్ను చెల్లింపులో రాయితీ కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఓటీఎస్‌లో మొత్తం పన్నుతోపాటు వడ్డీ 10 శాతం చెల్లిస్తే సరిపోతుందని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.

GHMC: గ్రేటర్‌ హైదరాబాద్‌వాసులకు గుడ్‌న్యూస్.. ఆస్తిపన్ను చెల్లింపుపై సర్కార్ కీలక నిర్ణయం!
Ghmc
Balaraju Goud
|

Updated on: Mar 07, 2025 | 7:59 PM

Share

గ్రేటర్ హైదరాబాద్ వాసులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అస్తి పన్ను చెల్లింపుదారులకు వెసులుబాటు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆస్తి పన్ను చెల్లింపులో రాయితీ కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. అస్తి పన్ను బకాయి మొత్తం ఒకేసారి చెల్లిస్తే, వడ్డీలో 90 శాతం మాఫీ అయ్యేలా మరోసారి ఓటీఎస్‌ పథకాన్ని అమలు చేయనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్ ఉత్తర్వులు జారీ చేశారు.

వన్ టైమ్ సెటిల్‌మెంట్(OTS) పథకాన్ని ఉపయోగించుకుని భాగ్యనగర వాసులు సకాలంలో అస్తి పన్ను చెల్లించాలని దాన కిశోర్ పేర్కొన్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మొండి బకాయిలను రాబట్టేందుకు గత కొన్నేళ్లుగా ఇలాంటి స్కీమ్‌ను రాష్ట్ర ప్రభుత్వం తీసుకువస్తోంది. ఈ క్రమంలోనే 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఓటీఎస్‌లో మొత్తం పన్నుతోపాటు వడ్డీ 10 శాతం చెల్లిస్తే సరిపోతుందని రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

గతేడాది ప్రవేశపెట్టిన ఓటీఎస్ పథకం ద్వారా సుమారు లక్ష మంది వినియోగదారులు ఆస్తి పన్ను చెల్లించినట్లు జీహెచ్ఎంసీ తెలిపింది. ఈ సారి కూడా ఆస్తి పన్నుకు సంబంధించి రూ.2 వేల కోట్లు వసూలు చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. ప్రభుత్వం ఓటీఎస్‌కు అంగీకరించడంతో ఆశించిన స్థాయిలో పన్నులు వసూలవుతాయని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ భావిస్తోంది. ఈ సదవకాశాన్ని హైదరాబాద్ వాసులు వినియోగించకుకోవాలని తెలంగాణ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్ కోరారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..