AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: నా ఫోన్ పోయింది కాల్ చేసుకుంటానని పోలీసులను సెల్ అడుగుతుంది.. కట్ చేస్తే..

ఈమె మాములు లేడీ కాదు.. పెద్ద కిలాడీ. ఆమె టార్గెట్ ఖాకీలు మాత్రమే. వారు అయితే బాగా గిట్టుబాటు అవుతుందని అనుకుందో ఏమో.. పోలీసులకు చుక్కలు చూపిస్తుంది. ఇటీవల సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ సమీపంలో.. ఓ కానిస్టేబుల్ వద్దకు వెళ్లి.. సార్.. సార్ నా ఫోన్ పోయింది.. కాల్ చేసుకుంటానంటూ ఫోన్ అడిగింది.

Hyderabad: నా ఫోన్ పోయింది కాల్ చేసుకుంటానని పోలీసులను సెల్ అడుగుతుంది.. కట్ చేస్తే..
Honey Trap
Ranjith Muppidi
| Edited By: |

Updated on: Mar 07, 2025 | 6:24 PM

Share

ఒక్క కాల్ చేసుకుంటాను మీ సెల్ ఇస్తారా అని కానిస్టేబుల్‌ని అడిగింది. దానికేముంది అని అతను సెల్ ఇచ్చాడు. ఆపై తన నంబర్‌కు కాల్ చేసింది. అవతలి వాళ్లు ఎత్తడం లేదంటూ.. ఆ కానిస్టేబుల్ ఫోన్ తిరిగి ఇచ్చేసింది. ఆ రోజు రాత్రి కానిస్టేబుల్‌కు స్పైసీ మెసేజీలు పెట్టింది. ఆ తర్వాత హైదరాబాద్ వస్తున్నానని చెప్పింది. ఆ తర్వాత మీట్ అయి.. సరదాగా షికారు చేసింది. ఆపై తన ప్లాన్ అమలు చేసింది. తనకు అర్జెంట్ అవసరం ఉందని.. డబ్బు కావాలని అడిగింది. అతను నిరాకరించడంతో.. దగ్గర్లోని పోలీస్ స్టేషన్‌కి వెళ్లి.. కానిస్టేబుల్ వేధింపులకు పాల్పడుతున్నాడని కేసు పెట్టింది. దీంతో కంగుతిన్న కానిస్టేబుల్.. ఈ తలనొప్పులు అన్నీ ఎందుకు అనుకుని.. 40 వేలు ఇచ్చి ఇష్యూ సెటిల్ చేసుకున్నాడు.

కొద్ది రోజుల తర్వాత అదే ప్రాంతంలో ఓ హోం గార్డును కూడా ఇలానే పటాయించింది. కాసేపు స్వీట్‌గా మాట్లాడి నంబర్ తీసుకుంది. ఆపై తన ట్రిక్ ప్లే చేసింది. హోంగార్డు ఆమెను పట్టించుకోకపోవడంతో.. అదే పోలీస్​స్టేషన్​లో కేసు పెట్టేందుకు వెళ్లింది. ఈమె తీరును గమనించిన పోలీసులు మందలించి వదిలేశారు. ఇలా ఖాకీలను మాత్రమే టార్గెట్ చేస్తూ మాయమాటలతో బుట్టులో వేసుకుని బెదిరింపులకు పాల్పడుతుంది. అసలు ఈమె బ్యాగ్రౌండ్ ఏంటా అని.. వెరిఫై చేసిన పోలీసులు కంగుతిన్నారు.

వరంగల్‌కు చెందిన మేడమ్ గారి వయస్సు 25. డిగ్రీ చేసింది. విలాసాలు, జల్సాలకు అలవాటు పడి డబ్బు కోసం ఈ మార్గాన్ని ఎన్నుకుంది. తన హ్యాండ్ బ్యాగ్, పర్సు దొంగలు కొట్టేశారని కానిస్టేబుల్స్, హోం గార్డుల వద్దకు వెళ్లి సాయం కోరుతుంది. వారిని మాటల్లో పెట్టి.. హోటల్‌కు తీసుకువెళ్తుంది. కొద్దిసేపటి తర్వాత బయటకు వచ్చి.. తనతో అసభ్యకరంగా ప్రవర్తించారంటూ హంగామా చేస్తుంది. కేసు పెడతానని బెదిరించి అందినంత డబ్బులు వసూలు చేస్తుంది. వరంగల్‌లో కూడా పలువురు పోలీసులను ఇలానే మోసం చేసినట్లు సమాచారం.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..