Telangana: తీరనున్న దశాబ్దాల కల.. ఆ లైన్ లో మొదటి రైలు ప్రారంభం

సత్తుపల్లి(Sattupalli) నుంచి కొత్తగూడెం(Kothagudem) థర్మల్ పవర్ ప్లాంట్ కు బొగ్గు లోడ్‌ మొదటి రైలు ఇవాళ ప్రారంభమైంది. ఇది భద్రాచలం రోడ్‌ - సత్తుపల్లి సెక్షన్‌లో నడుస్తున్న మొదటి రైలు కావడం విశేషం. సత్తుపల్లి ప్రాంతంలోని....

Telangana: తీరనున్న దశాబ్దాల కల.. ఆ లైన్ లో మొదటి రైలు ప్రారంభం
Bhadrachalam
Follow us

|

Updated on: May 28, 2022 | 7:42 PM

సత్తుపల్లి(Sattupalli) నుంచి కొత్తగూడెం(Kothagudem) థర్మల్ పవర్ ప్లాంట్ కు బొగ్గు లోడ్‌ మొదటి రైలు ఇవాళ ప్రారంభమైంది. ఇది భద్రాచలం రోడ్‌ – సత్తుపల్లి సెక్షన్‌లో నడుస్తున్న మొదటి రైలు కావడం విశేషం. సత్తుపల్లి ప్రాంతంలోని ఎస్‌సీసీఎల్‌ గనుల నుంచి బొగ్గు రవాణా కోసం దక్షిణ మధ్య రైల్వే, మెస్సర్స్‌ సింగరేణి కాలరీస్‌ లిమిటెడ్‌ సంయుక్తంగా ఈ నూతన రైల్వే లైను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా, భద్రాచలం రోడ్(Bhadrachalam Road) నుంచి సత్తుపల్లి వరకు రైల్వే లైన్ నిర్మాణం పూర్తయింది. భద్రాచలం – భావన్నపాలెం మధ్య విద్యుదీకరణ పూర్తయ్యింది. భావన్నపాలెం నుంచి సత్తుపల్లి వరకు (సుమారు 15 కిమీలు) పనులు మాత్రమే మిగిలున్నాయి. ఈ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. అవి త్వరలో పూర్తికానున్నాయని అధికారులు తెలిపారు. భద్రాచలం రోడ్‌ – సత్తుపల్లి నూతన రైల్వే లైను 2010 -11లో మంజూరైంది. ఈ ప్రాజెక్టు వ్యయం మొత్తంలో (సుమారుగా రూ.927.94 కోట్లు) తెలంగాణ ప్రభుత్వం మెస్సర్స్‌ సింగరేణి కాలరీస్‌ కంపెనీ లిమిటెడ్‌ రూ.618.55 కోట్ల భాగస్వామ్యం ఉంది. ఈ ప్రాజెక్టు తెలంగాణలోని బొగ్గు గనుల ప్రాంతంలో ఉంది. ఇందులో మూడు క్రాసింగ్‌ స్టేషన్లు ఉన్నాయి.

ఈ ప్రాజెక్టు రైల్వేకు మరియు మెస్సర్స్‌ ఎస్‌సిసిఎల్‌ వారికి రెండింటికీ ప్రయోజనకరమైంది. సత్తుపల్లి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లోని బొగ్గు గనుల నుంచి పర్యావరణ అనుకూల బొగ్గు రవాణాకు ఉపకరిస్తుంది. తద్వారా థర్మల్‌ విద్యుత్‌ ప్లాంట్ల బొగ్గు డిమాండ్‌ను తీరుస్తుంది. రైల్వేలకు అదనపు లోడింగ్‌, ఆదాయాన్ని తెస్తుంది. సరకు రవాణా కోసం ఈ ప్రాంతానికి రైలు అనుసంధానం కల్పిస్తుంది. రోడ్డు రవాణా తగ్గడం ద్వారా కాలుష్యం తగ్గుతుంది. మౌలిక సదుపాయాల అభివృద్ధికి దోహదం చేస్తుంది. ప్రాజెక్టు మొత్తం పూర్తి కానప్పటికీ ప్రస్తుత బొగ్గు డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని ముందస్తుగానే ఈ రైల్వే లైనులో మొదటి రైలును ప్రారంభించడానికి కృషి చేసిన దక్షిణ మధ్య రైల్వే కనస్ట్రక్షన్‌ విభాగం అధికారులను, సిబ్బందిని, మెస్సర్స్‌ ఎస్‌సిసిఎల్‌ యంత్రాంగాన్ని దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ శ్రీ అరుణ్‌ కుమార్‌ జైన్‌ అభినందించారు.

ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం సాధించేలా విద్యుదీకరణ పనులను జాప్యం లేకుండా త్వరగా పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ ప్రాజెక్టు మొత్తం పనులన్నీ పూర్తయితే వివిధ ప్రాంతాలకు బొగ్గు రవాణా చేయడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, దీంతో విద్యుత్‌ ప్లాంట్లకు మరియు పరిసర ప్రాంతాల అభివృద్ధికి ప్రయోజనకరంగా ఉంటుందని ఆయన అన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..