Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CONG vs BRS: ములుగు జిల్లాలో టెన్షన్ టెన్షన్… రాజకీయ దుమారం రేపుతున్న రమేష్ ఆత్మహత్య

ములుగు జిల్లాలో టెన్షన్ టెన్షన్.. నెలకొంది. కాంగ్రెస్ vs BRS వార్‌గా మారింది రమేష్ అనే యువకుడి ఆత్మహత్య. పోటాపోటికి నిరసనలకు పిలుపునిచ్చాయి ఇరుపార్టీలు. దీంతో స్థానికంగా టెన్షన్‌ వాతావరణం నెలకొంది. ఇందిరమ్మ ఇంటి కోసం రమేష్‌ అనే వ్యక్తి సూసైడ్ చేసుకోవడం రాజకీయ దుమారం...

CONG vs BRS: ములుగు జిల్లాలో టెన్షన్ టెన్షన్... రాజకీయ దుమారం రేపుతున్న రమేష్ ఆత్మహత్య
Mulugu Tension
K Sammaiah
|

Updated on: Jul 07, 2025 | 8:11 AM

Share

ములుగు జిల్లాలో టెన్షన్ టెన్షన్.. నెలకొంది. కాంగ్రెస్ vs BRS వార్‌గా మారింది రమేష్ అనే యువకుడి ఆత్మహత్య. పోటాపోటికి నిరసనలకు పిలుపునిచ్చాయి ఇరుపార్టీలు. దీంతో స్థానికంగా టెన్షన్‌ వాతావరణం నెలకొంది. ఇందిరమ్మ ఇంటి కోసం రమేష్‌ అనే వ్యక్తి సూసైడ్ చేసుకోవడం రాజకీయ దుమారం రేపుతున్నది. నేడు బీఆర్‌ఎస్‌ నిరసనలకు పిలుపునిచ్చింది. BRSను అడ్డుకునేందుకు చలోములుగుకు కాంగ్రెస్‌ పిలుపునిచ్చింది. నేడు మంత్రుల పర్యటనతో స్థానికంగా టెన్షన్ వాతావరణం నెలకింది. దీంతో పోలీసులు ముందస్తుగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ములుగు జిల్లా వ్యాప్తంగా సిటీ పోలీస్ యాక్ట్ అమలు చేస్తున్నారు పోలీసులు. ఈ నెల 31వ తేదీ వరకు సిటీ పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని జిల్లా SP శబరీష్ తెలిపారు. నిరసన కార్యక్రమాలు, ర్యాలీలు, ధర్నాల పై నిషేధం విధించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠినచర్యలు ఉంటాయని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ముందస్తుగా పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ములుగుకు వచ్చే అన్ని దారులలో ప్రత్యేక పోలీస్ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు ముమ్మరం చేశారు.

కాగా, ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం చల్వాయి గ్రామానికి చెందిన చుక్కా రమేశ్‌ (29) హైదరాబాద్‌లో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడు. ఇటీవల ఇంటికి వచ్చిన ఆయన, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల జాబితాలో తనపేరు లేకపోవడంపై మనస్థాపం చెందాడు. అధికారులను, స్థానిక నాయకులను సంప్రదించినా చుక్కెదురైంది. దీంతో ఎవరెవరికి ఇళ్లు వచ్చాయనే అంశంపై ‘చల్వాయి సమాచారం’ అనే వాట్సాప్‌ గ్రూపులో స్థానిక కాంగ్రెస్‌ నాయకులకు రమేశ్‌ మధ్య వాదోపవాదాలు జరిగినట్లు తెలుస్తోంది. అనంతరం పస్రా పోలీసులు రమేశ్‌ ఇంటికి వచ్చి ఇతరులను కించపరిచే పోస్టులు పెట్టొద్దని హెచ్చరించి వెళ్లారు.

పోలీసులు అతడి ఫోన్‌ను తీసుకెళ్లారని గ్రామస్థులు చెబుతుండగా, తాము తీసుకోలేదని పోలీసులు చెప్పారు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం రమేశ్‌ ఇంట్లో ఉరి వేసుకున్నారు. ‘నాపై తప్పుడు కేసు పెట్టడంతో మనస్తాపంతో చనిపోతున్నా. అమ్మమ్మ, చిన్నమ్మలు క్షమించాలి’ అని సూసైడ్‌ నోట్‌ రాసి తనువు చాలించాడు. ఈ అంశం ఇప్పుడు రాజకీయ రంగు పులుముకోవడంతో జిల్లాలో ఉద్రిక్తతలకు దారి తీసింది.