Rajinikanth Live Show With KCR: టాక్ ఆఫ్ ది టు స్టేట్స్‌గా మారిన ‘రజినీకాంత్ లైవ్‌షో విత్ కేసీఆర్’..
టీవీ9 స్టూడియోలో గులాబీ బాస్. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటు బీఆర్ఎస్ ఫెయిల్యూరా? కాంగ్రెస్ సక్సెసా? దీనికి కేసీఆర్ ఇచ్చే సమాధానం ఏంటి? బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు ఏంటి? బీజేపీతో ఉన్న బంధమేంటి? తెలంగాణలో ఉద్యోగాల ఘనత కాంగ్రెస్‌దా? బీఆర్ఎస్ ప్రభుత్వానిదా? టీవీ9 స్టూడియోలో గులాబీ బాస్‌తో చర్చిద్దాం.
తెలంగాణలోనే టాలెస్ట్ లీడర్, తెలంగాణ ఉద్యమ రథసారధి, తెలంగాణ రాష్ట్ర సాధకుడు. పద్నాలుగేళ్లపాటు ఉవ్వెత్తున ఉద్యమాన్ని నడిపించి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన స్వాప్నికుడు. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, పదేళ్లపాటు తెలంగాణ స్టేట్‌ను ప్రగతిపథంలో నడిపించిన పాలనాదక్షుడు. ఆయనే కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు. పద్నాలుగేళ్ల తెలంగాణ ఉద్యమ చరిత్రలో… పదేళ్ల బీఆర్‌ఎస్ రూలింగ్‌లో… కేసీఆర్‌తో టీవీ9 ఇంటర్వ్యూ ఓ సంచలనం. కేసీఆర్ ఓ టీవీ ఛానెల్ స్టూడియోకొచ్చి పుష్కరకాలమైంది. పన్నెండేళ్లక్రితం టీవీ9 స్టూడియోకొచ్చారు కేసీఆర్. మళ్లీ ఇప్పుడు మరోసారి టీవీ9 స్టూడియోలో అడుగుపెట్టబోతున్నారు.
టీవీ9 వేదికగా ఈరోజు రాత్రి 7గంటలకు తెలుగు మీడియా చరిత్రలోనే బిగ్గెస్ట్ లైవ్‌షో జరగబోతోంది. టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజినీకాంత్ లైవ్‌షోలో పాల్గోబోతున్నారు కేసీఆర్. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతోన్న టైమ్‌లో పన్నెండేళ్లక్రితం టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజినీకాంత్‌కి పూర్తిస్థాయి ఇంటర్వ్యూ ఇచ్చిన కేసీఆర్… మళ్లీ ఇప్పుడు ఆయన లైవ్‌షోకి రాబోతున్నారు.
రజినీకాంత్ లైవ్‌షో విత్ కేసీఆర్… తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోంది. ‘రజినీకాంత్ లైవ్‌షో విత్ కేసీఆర్’ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు పొలిటికల్ పీపుల్. 12ఏళ్ల సుదీర్ఘ గ్యాప్ తర్వాత ఫుల్ ఫ్లెడ్జెడ్ తొలి మీడియా ఇంటర్వ్యూ ఇవ్వబోతున్న కేసీఆర్… టీవీ9 ప్రశ్నలకు ఏం సమాధానాలు చెబుతారోనని ఉత్కంఠ అందరిలో కనిపిస్తోంది.
కేసీఆర్‌తో టీవీ9 లైవ్‌షోపై సూపర్ బజ్ నడుస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే టాక్ ఆఫ్ ది టు స్టేట్స్‌గా మారింది ‘రజినీకాంత్ లైవ్‌షో విత్ కేసీఆర్’. టీవీ9 కేసీఆర్ లైవ్‌షోకి సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో విపరీతంగా సర్క్యులేట్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే రజినీకాంత్ లైవ్‌షో విత్ కేసీఆర్‌తో ఆసక్తికర ట్వీట్ చేశారు బీఆర్‌ఎస్ నేత క్రిషాంక్. కేసీఆర్ లైవ్‌షోపై ఐపీఎల్‌ను మించిన బజ్ ఉందంటూ రాసుకొచ్చారు. సీఎస్కే, ముంబై ఇండియన్స్ మ్యాచ్ ఎవరూ చూడరు.. ఇవాళ టీవీ9 మాత్రమే చూస్తామంటూ పోస్ట్ చేశారు.
పదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్.. ఇప్పుడు ప్రతిపక్ష నేతగానూ దూకుడు చూపిస్తున్నారు. పుష్కర కాలం తర్వాత ఇప్పుడు తెలుగు న్యూస్ ఛానల్‌కు తొలి ఇంటర్వ్యూ ఇవ్వబోతుండటం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. తెలంగాణలో అయితే బజ్ బొంబాట్ అవుతోంది. 12ఏళ్ల తర్వాత మాజీ సీఎం కేసీఆర్ టీవీ9 స్టూడియోకి రాబోతున్నారు. టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజినీకాంత్‌తో ఇంటర్వ్యూ ఎలా ఉండబోతోందో సోషల్ మీడియా సర్కిల్స్‌లో ఇప్పటికే ఓ లెక్కకు వచ్చారు జనం. ఈ ఇంటర్వ్యూ గత రికార్డులు బద్దలు కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. సో రాత్రి ఏడు గంటలకు డోన్ట్ మిస్ ఇట్..
టీవీ9 స్టూడియోలో గులాబీ బాస్ ఏం సమాధానం చెబుతారన్నదీ ఆసక్తికరంగా మారింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటు బీఆర్ఎస్ ఫెయిల్యూరా? కాంగ్రెస్ సక్సెసా? దీనికి కేసీఆర్ ఇచ్చే సమాధానం ఏంటి? బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు ఏంటి? బీజేపీతో ఉన్న బంధమేంటి? దీనికి గులాబీ బాస్ ఇచ్చే సమాధానం ఏంటి? తెలంగాణలో ఉద్యోగాల ఘనత కాంగ్రెస్‌దా? బీఆర్ఎస్ ప్రభుత్వానిదా? టీవీ9 స్టూడియోలో చర్చిద్దాం. Get Ready For Biggest Live Show With KCR @7PM.
బస్సుయాత్రతో జనంలోకి కేసీఆర్
ఇదిలావుంటే, లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏఫ్రిల్ 24వ తేదీ నుంచి మే 10వ తేదీ వరకు కొనసాగే యాత్ర కోసం తెలంగాణ ప్రగతి రథం పేరుతో మెర్సిడెజ్ మెంజ్ ఏసీ బస్సును సిద్ధం చేశారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో రోడ్ షోతో కేసీఆర్ ఎన్నికల ప్రచారం ప్రారంభమై, సిద్దిపేటలో జరిగే సభతో ముగియనుంది. మొత్తం 17 రోజుల పాటు జరిగే బస్సు యాత్రలో 21 చోట్ల రోడ్ షోలు నిర్వహించేలా షెడ్యూల్ సిద్ధం చేశారు బీఆర్ఎస్ నేతలు. బస్సుయాత్ర సాగే రూట్లలో ఉదయం వేళ పార్టీ కేడర్‌కు దిశానిర్దేశంచేస్తారు కేసీఆర్.
విద్యార్థులు, యువత, మహిళలు, మైనారిటీలతో భేటీ కానున్నారు. రైతులను కలుసుకొని పంట పొలాలను సందర్శిస్తారు. వేసవి తీవ్రత నేపథ్యంలో సాయంత్రం 5.30 గంటల తర్వాత ఈ రోడ్ షోలను ప్రారంభిస్తారు. రోడ్ షో ముగిశాక ఆయా ప్రాంతాల్లో స్థానికంగా రాత్రి బస చేస్తారు.
గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఈ బస్సును కేసీఆర్‌కు బహుకరించారు. పూర్తి బులెట్‌ఫ్రూప్‌తో తయారైన ఈ బస్సు ముందు భాగంలో కేసీఆర్ కూర్చునేందుకు ప్రత్యేకంగా సోఫా ఏర్పాటు చేశారు. బస్సులోంచి పైభాగానికి చేరుకునేందుకు హైడ్రాలిక్ లిఫ్ట్ ఉంది. బస్సు చుట్టు 360 డిగ్రీల సీసీ కెమెరాలు అమర్చారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…