Wife Kills Husband: ఐదేళ్ల తరువాత బయటపడిన పచ్చి నిజం.. భర్తను ఎంత క్రూరంగా చంపిందో తెలిసి పోలీసులే షాక్ అయ్యారు..!
Telangana Crime News: వివాహేతర సంబంధాలు కాపురాలనే కాదు.. ప్రాణాలనూ కూల్చేస్తున్నాయి. తాజాగా తెలంగాణలోని..
Telangana Crime News: వివాహేతర సంబంధాలు కాపురాలనే కాదు.. ప్రాణాలనూ కూల్చేస్తున్నాయి. తాజాగా తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో ఇలాంటి ఘటనే వెలుగు చూసింది. ఓ భార్య ప్రియుడిపై మోజుతో కట్టుకున్న భర్తనే అత్యంత కిరాతకంగా చంపించింది. ఆపై ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నంలో ఆమె ఐదు ఏళ్లు విజయవంతంగా తప్పించుకుంది. కానీ.. అబద్ధానికి దూకుడు ఎక్కువ.. నిజానికి నిలకడ ఎక్కువ అంటారు కదా.. ఆలస్యంగానైనా అసలు నిజం బయటకు పొక్కింది. చివరికి ఆమె ఊచలు లెక్కిస్తోంది. అయితే, ఈ కేసుకు సంబంధించి పూర్వాపరాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
మంచిర్యాల జిల్లా బీమారం మండల కేంద్రంలో గత ఐదు సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనకు సంబంధించిన వివరాలను మంచిర్యాల డీసీపీ ఉదయ్ కుమార్ రెడ్డి, జైపూర్ ఏసీపీ నరేందర్ వెల్లడించారు. బీమారం మండలంలోని శ్రీరాంపూర్ కాలనీకి చెందిన సత్యరాజ్, కన్నూరి మహేశ్వరి దంపతలు ఉన్నారు. వృత్తి రీత్యా సత్యరాజ్ ఫాస్టర్.. అయితే మహేశ్వరికి తన భర్తతో కలిసి పని చేసే గంగాధర్ తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. వీరి ఇరువురి విషయం భర్త సత్యరాజ్‌కు తెలియడంతో.. అతను తన భార్యను పలుమార్లు మందలించాడు. అయినప్పటికీ ఆమెలో మార్పు రాలేదు. ప్రియుడు అయిన గంగాధర్‌తో కలిసి భర్తను హతమార్చాలని వ్యూహం పన్నింది.
ఓ రోజు సత్యరాజ్ భీమారం మండలంలోని పోలంపల్లి గ్రామానికి మోటార్ సైకిల్‌పై వెళ్తుండగా.. మహేశ్వరి ప్రియుడు గంగాధర్ టవేర వాహనంతో ఆక్సిడెంట్ చేశాడు. ఆ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సత్యరాజ్.. చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. సత్యరాజ్ మృతిపై ఎవరికీ అనుమానం రాకుండా.. తన భర్త రోడ్డు ప్రమాదంలో మరణించాడంటూ స్థానిక పోలీసులకు మహేశ్వరి ఫిర్యాదు చేసింది. ఇది జరిగి కూడా ఐదేళ్లు అవుతోంది. అయితే.. రోజు రోజుకు మహేశ్వరి ప్రవర్తనలో తేడా కనిపిస్తుండటంతో సత్యరాజ్ తల్లికి అనుమానం వచ్చింది. దాంతో తన కొడుకును మహేశ్వరే చంపించిందని అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు.. లోతుగా విచారణ చేపట్టగా షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. ప్రియుడితో అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్తను కావాలనే వ్యూహం ప్రకారం చంపించినట్లు మహేశ్వరి పోలీసుల ఎదుట అంగీకరించింది. ఈ కేసులో మహేశ్వరి, ఆమె ప్రియుడు తో పాటు.. మరో ముగ్గురుని పోలీసులుఅ దుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి ఒక టవేరా వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించామన్నారు.
Also read:
Andhra Pradesh: సముద్రంలో గల్లంతైన మత్స్యకారులు క్షేమం.. అక్కడ బోటు కనిపించడంతో..
Tirumala: మళ్లీ మొరాయించిన టీటీడీ సర్వర్లు.. దొరికిందే ఛాన్స్‌గా రెచ్చిపోతున్న మాయగాళ్లు..
Exams: ఈనెల 25న బీసీ గురుకులాల ప్రవేశ పరీక్ష.. హెచ్‌సీయూ ఎంట్రన్స్ ఎగ్జామ్ తేదీల్లో మార్పు..