Tirumala: మళ్లీ మొరాయించిన టీటీడీ సర్వర్లు.. దొరికిందే ఛాన్స్‌గా రెచ్చిపోతున్న మాయగాళ్లు..

Tirumala Tirupati: తిరుమల తిరుపతి దేవస్థానం సర్వర్లు మళ్లీ మొరాయించాయి. ఫలితంగా టీటీడీ వెబ్‌సైట్ నుంచి టికెట్లు బుక్ చేసుకునేందుకు..

Tirumala: మళ్లీ మొరాయించిన టీటీడీ సర్వర్లు.. దొరికిందే ఛాన్స్‌గా రెచ్చిపోతున్న మాయగాళ్లు..
Ttd
Follow us
Shiva Prajapati

|

Updated on: Jul 20, 2021 | 12:28 PM

Tirumala Tirupati: తిరుమల తిరుపతి దేవస్థానం సర్వర్లు మళ్లీ మొరాయించాయి. ఫలితంగా టీటీడీ వెబ్‌సైట్ నుంచి టికెట్లు బుక్ చేసుకునేందుకు భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆగస్టు నెలకు సంబంధించి శ్రీవారి 300 రూపాయల దర్శన టికెట్లను టీటీడీ ఇవాళ ఉదయం 9 గంటలకు విడుదల చేసింది. ఈ టికెట్లను అధికారిక వెబ్‌సైట్ అయిన ‘‘tirumala tirupati balaji.ap.gov.in’’ లో భక్తులకు అందుబాటులో ఉంచింది. అయితే, రోజుకు కేవలం 5 వేల టికెట్లు చొప్పున మాత్రం వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. దాంతో ఈ వెబ్‌సైట్‌కు భక్తుల హిట్లు భారీగా పెరిగాయి. కెపాసిటీకి మించి హిట్లు రావడంతో టీటీడీ సర్వర్లు మొరాయించాయి.

ఇదిలాఉంటే.. టీటీడీ సర్వర్ల మొరాయింపును కొందరు కేటుగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. శ్రీవారి 300 రూపాయల దర్శన టికెట్లను ఫోటో మార్ఫింగ్ చేసి భక్తులకు విక్రయిస్తున్నారు. అయితే, ఈ కేటుగాళ్ల వ్యవహారాన్ని గుర్తించిన మహారాష్ట్రకు చెందిన కొందరు భక్తులు పోలీసులకు పిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు.. మార్ఫింగ్ టికెట్లను విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను అలిపిరి అరెస్ట్ చేశారు. వీరిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.

ఇదిలాఉండగా.. తొలి ఏకాదశి సందర్భంగా తిరుమలలో ప్రత్యేక ఏర్పాటు చేశారు. భక్తులు భారీగా వచ్చే అవకాశం ఉండటంతో.. అందుకు తగిన ఏర్పాట్లు చేశారు. అయితే, కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో టీటీడీ అధికారుల తగిన రక్షణ చర్యలు పాటిస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేశారు. మరోవైపు తెల్లవారుజాము నుంచే స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న వేదపండితులు.

Also read:

Exams: ఈనెల 25న బీసీ గురుకులాల ప్రవేశ పరీక్ష.. హెచ్‌సీయూ ఎంట్రన్స్ ఎగ్జామ్ తేదీల్లో మార్పు..

Hyderabad: చిన్నారిపై తాత లైంగిక దాడి!.. రిపోర్ట్‌లో మాత్రం రివర్స్.. అసలు కారణం అదేనా?

Hyderabad: హైదరాబాద్‌లో దారుణం.. కంటికి రెప్పలా కాపాడాల్సిన వాడే కాటేశాడు.. అన్నంలో నిద్ర మాత్రలు కలిపి మరీ..